News


అక్కడక్కడే ముగిసిన మార్కెట్‌

Monday 9th December 2019
Markets_main1575887015.png-30132

ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి స్వల్ప లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 42 పాయింట్లు పెరిగి 40, 487 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 11937 వద్ద ముగిసింది. తద్వారా సూచీల రెండురోజుల నష్టాలకు ముగింపు పడినట్లైంది. అటో, ఆర్థిక, మెటల్‌, ఫార్మా, ప్రైవేట్‌ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 31,332 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ స్వల్ప లాభంతో మొదలైంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 40,527.24 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభంతో 11,939.10 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నపటికీ., బ్యాంకింగ్‌ రంగ షేర్ల రికవరితో సూచీలు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. మిడ్‌సెషన్‌లో నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 11,982 వద్ద, సెన్సెక్స్‌ 200 పాయింట్లను ఆర్జించి 40,645 వద్ద వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని అందుకున్నాయి. మార్కెట్‌ మరోగంటలో ముగుస్తుందన్న తరుణంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా మిడ్‌సెషన్‌లో ఆర్జించిన లాభాల్ని కోల్పోయి స్వల్ప లాభాలతో సూచీలు ట్రేడింగ్‌ను ముగించాయి.

మారుతి సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ పోర్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. జీ లిమిటెడ్‌, ఎల్‌ అండ్‌ టీ, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ 5 శాతం క్రాష్‌

Monday 9th December 2019

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ షేరు వరుసగా 5రోజూ నష్టాల్లో ముగిసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.275.00 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభమైనప్పటి ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒకదశలో షేరు 6.75శాతం నష్టపోయి రూ.254.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 4.75 శాతం నష్టపోయి రూ.259.50 వద్ద స్థిరపడింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.168.00లు, రూ.919.00లుగా

ఈ వ్యూహంతో ఆప్షన్‌ బయర్స్‌లాభాలు పొందొచ్చు!

Monday 9th December 2019

అసిత్‌ బరాన్‌ పతి సూచనలు, సలహాలు అసిత్‌ బరాన్‌ పతి... ఆప్షన్‌ బయింగ్‌తో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించిన ట్రేడర్‌. సాధారణంగా ఆప్షన్‌ సెల్లర్స్‌కు మాత్రమే మార్కెట్‌ న్యాయం చేస్తుందని, ఆప్షన్స్‌ కొన్నవాళ్లు లాభపడడం తక్కువ సందర్భాల్లోనే జరుగుతుందని మార్కెట్‌లో అందరూ భావించే విషయం. కానీ ఆప్షన్‌ బయింగ్‌ కూడా లాభాల పంటనిస్తుందని ఈ మాజీ బ్యాంకు ఉద్యోగి చూపించాడు. ట్రేడింగ్‌లో మజా తెలిసాక చేస్తున్న ఉద్యోగం  వదిలి మరీ పూర్తి

Most from this category