News


11900ల దిగువన ముగిసిన నిఫ్టీ

Friday 14th June 2019
Markets_main1560508978.png-26303

మార్కెట్‌ ఈ వారం చివరిరోజైన శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 289 పాయింట్ల నష్టంతో 39,452.07 వద్ద, నిఫ్టీ 90.75 పాయింట్లను నష్టపోయి 11,823.30 వద్ద ముగిసింది. శుక్రవారం అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలకు నేడు టోకు ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో  మార్కెట్‌ ఫ్లాట్‌ గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 39,797.00 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,910.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రికత్తలు, ముడిచమురు ధరల ఒడిదుడుకుల ట్రేడింగ్‌ దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. వచ్చేవారం నుంచి అమెరికా నుంచి దిగుమతయ్యే 29 ఉత్పత్తులపై సుంకాలను పెంచేందుకు భారత్‌ సిద్ధమైంది. ఈ అంశంపై మరో రెండు రోజుల్లో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి సరైన వివరణ వస్తుందన్న వార్తలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.  ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు కట్టుబడటంతో ఏదశలో సూచీలు లాభాల్లోకి రాలేదు. దీనికి తోడు నేడు మార్కెట్‌కు వారంతపు రోజు కావడంతో ట్రేడర్లు కూడా అమ్మకాలకే మొగ్గుచూపారు. ఓ దశలో సెన్సెక్స్‌ 378 పాయింట్లను నష్టపోయి 39,363.45 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లను నష్టపోయి 11,797.70    వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది. 

ఐషర్‌మోటర్స్‌, భారతీఎయిర్‌టెల్‌, జీ లిమిటెడ్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం నష్టపోగా, అదానీ పోర్ట్‌, పవర్‌గ్రిడ్‌ సన్‌ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి. You may be interested

ఎన్‌బీఎఫ్‌సీ స్టాకులను ఏం చేద్దాం!

Friday 14th June 2019

గతేడాదిలో ఆరంభమైన ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం బాగా ముదిరి పలు సమస్యలకు కేంద్రబిందువుగా మారింది. లిక్విడిటీ కొరత, డిఫాల్టులు, రేటింగ్‌ డౌన్‌గ్రేడ్స్‌, మోసాలు.. ఇలా పలు కారణాలతో పలు ఎన్‌బీఎఫ్‌సీల విలువ భారీగా క్షీణించిపోయింది. ఉదాహరణకు ఏడాదిలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు విలువ 80 శాతం, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 40 శాతం మేర పతనమయ్యాయి. దీంతో వీటి మార్కెట్‌ క్యాప్‌ విపరీతంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పలు ఎంఎఫ్‌లు ఎన్‌బీఎఫ్‌సీ

ఈ స్టాకులపై ఎంఎఫ్‌ల ఆసక్తి

Friday 14th June 2019

ఎన్‌డీఏ ప్రభుత్వం రెండో దఫా పాలనా కాలంలో ఇన్‌ఫ్రాపై వ్యయాలు పెంచుతుందన్న అంచనాలున్నాయి. దీంతో అసెట్‌మేనేజర్లు ఈ రంగానికి చెందిన మేలైన కంపెనీలపై దృష్టి పెడుతున్నారు. దీంతో పాటు క్యాపిటల్‌గూడ్స్‌ రంగానికి చెందిన కంపెనీలపై సైతం ఎంఎఫ్‌లు మక్కువ చూపుతున్నాయి. మేనెల్లో ఇలా ఎంఎఫ్‌లకు మక్కువగా మారిన ఐదు కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి... 1. ఎల్‌అండ్‌టీ: మార్కెట్‌ క్యాప్‌ 2.12 లక్షల కోట్ల రూపాయలు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌

Most from this category