News


బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో పాజిటివ్‌ ముగింపు

Monday 11th November 2019
Markets_main1573468223.png-29507

ట్రేడింగ్‌ ఆద్యంత లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి స్వల్పలాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 21.47 పాయింట్లు పెరిగి 40,345.08 వద్ద, నిఫ్టీ 5పాయింట్ల లాభంతో 11,913 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 389 పాయింట్లు లాభపడి 4నెలల గరిష్టం 31,139 వద్ద ముగిసింది. ఆర్థిక, మీడియా, రియల్టీ రంగ షేర్లకు కూడా లాభపడ్డాయి. మరోవైపు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, అటో, ఫార్మా రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అంశంలో మరోసారి సందిగ్ధత తలెత్తడంతో ప్రపంచమార్కెట్లలో బలహీన వాతావరణ నెలకొంది. అక్కడ నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న మార్కెట్‌ నష్టంతో మొదలైంది. సూచీలు సైతం చివరి అరగంట వరకు లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. అయితే మార్కెట్‌ ప్రారంభం నుంచి రాణిస్తున్న బ్యాంకింగ్‌ షేర్లు.... సూచీలు భారీగా నష్టపోకుండా అడ్డుకున్నాయి. చివరి అరగంటలో ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ  సూచీలను నష్టాల్లోంచి గట్టెక్కించింది. ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ కొత్త ఆల్‌టైం హైని నమోదుచేసింది. ఇంట్రాడే సెన్సెక్స్‌ 40,150.97 - 40,417.44 రేంజ్‌లో, నిప్టీ 11,853.95 - 11,932.65 స్థాయిలో ట్రేడయ్యాయి. 

సిప్లా, వేదాంత, హిందాల్కో, హీరోమోటర్స్‌, నెస్లే షేర్లు 2శాతం నుంచి 2.50శాతం వరకు నష్టపోయాయి. టాటామోటర్స్‌, గెయిల్‌, బీపీసీఎల్‌, యస్‌బ్యాంక్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 2శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి. 



You may be interested

ప్రైవేట్‌ బ్యాంకుల స్వర్ణయుగం ముగిసిందా?

Monday 11th November 2019

నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ మధ్య ఇన్వర్స్‌ రొటేషన్‌ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా బ్యాంకు నిఫ్టీ అత్యుత్తమ ప్రదర్శన జరుపుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకు షేర్ల అద్భుత ర్యాలీతో బ్యాంకు నిఫ్టీ బలమైన ర్యాలీ చూపింది. పీఎస్‌యూ బ్యాంకుల ఆస్తుల నాణ్యతపై నీలినీడలు ముసురుతుంటే ప్రైవేట్‌ బ్యాంకుల ఆస్తుల నాణ్యత స్థిరంగా మెరుగుపడుతూ వచ్చింది. దీంతో పీఎస్‌బీల కన్నా ప్రైవేట్‌బ్యాంకు షేర్లు మంచి లాభాలు చూశాయి. మొత్తం 8 ప్రైవేట్‌ బ్యాంకు

పసిడి మెరుపులు తగ్గుతాయా??

Monday 11th November 2019

ట్రేడ్‌వార్‌ ముగింపుతో బంగారం ధర తగ్గే ఛాన్సులు స్వల్పకాలికమేనని నిపుణుల అంచనా గతవారం యూఎస్‌, చైనా వాణిజ్య చర్చలపై పాజిటివ్‌ వార్తలు వచ్చిన నేపథ్యంలో దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధర కాస్త వెనకడుగువేసింది. దేశీయ ఎంసీఎక్స్‌ బంగారం గతవారాన్ని 1.6 శాతం నష్టంతో ముగించింది. రెండు పెద్ద దేశాల మధ్య చర్చలు ఫలప్రదమయ్యే అవకాశాలు కనిపించడంతో స్టాక్‌ మార్కెట్లు కదం తొక్కాయి. వాణిజ్యయుద్ధం శాంతియుతంగా ముగిస్తే ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను పునఃసమీక్షిస్తామని

Most from this category