News


స్వల్ప లాభాల ముగింపు

Friday 20th December 2019
Markets_main1576838503.png-30338

  • నాలుగో రోజూ కొనసాగిన రికార్డుల ర్యాలీ
  • సూచీలను నడిపించిన పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ 7.62 పాయింట్లు పెరిగి 41,681.54 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 12.10 పాయింట్ల లాభంతో 12,271.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 143 పాయింట్లు పెరిగి 32,384.95 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్ల అండతో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లోనే సెన్సెక్స్‌ 136 పాయింట్లు పెరిగి 41,810 వద్ద, నిఫ్టీ 12294 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి. అయితే మార్కెట్‌కు నేడు వారంతపు రోజు కావడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత, రూపాయి బలహీన ట్రేడింగ్‌, ఆసియా మార్కెట్ల మిశ్రమ ముగింపు తదితర ప్రతికూలాంశాలతో సూచీలు ఉదయం లాభాల్ని కోల్పోయి ఫ్లాట్‌గా ముగిశాయి. మెటల్‌, మీడియా, ఐటీ రంగ షేర్లకు కూడా స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు అటో, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయినప్పటికీ సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా నాలుగో  రోజూ అటు ఇంట్రాడేలోనూ, ఇంటు ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను నెలకొల్పడం విశేషం. ఇక వారం మొత్తం మీదగా చూస్తే సెన్సెక్స్‌ 671 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్లు లాభపడ్డాయి. 

నెస్లే, ఎస్‌బీఐ, యూపీఎల్‌, టాటా స్టీల్‌, టైటాన్‌ షేర్లు 2.50శాతం నుంచి 3.50శాతం వరకు లాభపడ్డాయి. ఐటీసీ, ఐషర్‌ మోటర్స్‌, టాటా మోటర్స్‌, కోటక్‌ బ్యాంక్‌, వేదాంత షేర్లు 1.20శాతం నుంచి 3శాతం వరకు నష్టపోయాయి. 
 



You may be interested

డెట్‌ రాబడులపై ఆర్‌బీఐ ‘ఓఎంఓ’ ప్రభావం

Friday 20th December 2019

ఆర్‌బీఐ ఉన్నట్టుండి ఒక నిర్ణయం తీసుకుంది. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ రూపొందించిన ‘ఆపరేషన్‌ ట్విస్ట్‌’ విధానాన్ని తాను కూడా అనుసరించనున్నట్టు ప్రకటించింది. రూ.10,000 కోట్లతో ఈ నెల 23న ఆర్‌బీఐ ప్రత్యేక ఓఎంఓను నిర్వహించనుంది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఆబీఐ నిర్ణయంతో లాంగ్‌ డ్యురేషన్‌, డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ ఎక్కువగా లాభపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐ ఈ తరహా ఓఎంవోను ప్రకటించడం

‘‘ఆపరేషన్‌ ట్విస్ట్‌’’తో ప్రభుత్వ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

Friday 20th December 2019

ఇకపై నిరంతరంగా ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు చేపడతామన్న ఆర్‌బీఐ ప్రకటనతో బాండ్‌ ఈల్డ్స్‌ దిగివచ్చాయి. దీంతో బ్యాంకు షేర్లు ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు శుక్రవారం మంచి ర్యాలీ జరిపాయి. ఆర్‌బీఐ ప్రకటనతో 10ఏళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌ 14 బీపీఎస్‌ తగ్గి 6.61 శాతానికి వచ్చింది. దీంతో నిఫ్టీ పీఎస్‌బీ సూచీలోని షేర్లన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, ఇండియన్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ

Most from this category