News


సెన్సెక్స్‌ ప్లస్‌...నిఫ్టీ మైనస్‌

Tuesday 24th September 2019
Markets_main1569320594.png-28521

  • 11600 దిగువన నిఫ్టీ ముగింపు
  • లాభాల స్వీకరణ, బ్యాంకింగ్‌ షేర్ల  పతనం

రెండురోజుల బ్లాక్‌బాస్టర్‌ ర్యాలీ తర్వాత మంగళవారం రోజం‍తా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ 11600 స్థాయిని కోల్పోగా సెన్సెక్స్‌ 36000 స్థాయిని నిలబెట్టుకుంది. నిఫ్టీ 12 పాయింట్లను కోల్పోయి 11,588.20 వద్ద, సెన్సెక్స్‌ 7.11 పాయింట్లు స్వల్ప లాభంతో 39,097 వద్ద స్థిరపడ్డాయి. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ, బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్ల పతనంతో పాటు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌  సూచీల మిశ్రమ ముగింపునకు  కారణమయ్యాయి.  బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో, మెటల్‌ షేర్ల నష్టపోగా, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల భారీ పతనంతో ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 383 పాయింట్లు నష్టపోయి 30,183 వద్ద ముగిసింది.
393 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌:-
ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు రెండురోజుల భారీ లాభాల ముగింపు ఉత్సాహంతో మార్కెట్‌ నేడు కూడా లాభంలో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్‌ 45 పాయింట్ల లాభంతో 39,135.28 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల పెరిగి 11606 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభంతో ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా, ఐటీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు కొంతసేపు లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 216 పాయింట్లు పెరిగి 39,306.37 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 11,655.05 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. ఈ తరుణంలో గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సూచీల లాభాలకు అడ్డుకట్ట వేశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, మెటల్‌, అటో షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరగడంతో సూచీలు ఉదయం ఆర్జించిన లాభాల్ని హరించుకపోవడమేకాక నష్టాల్లో మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్‌ గరిష్టస్థాయి నుంచి 393 పాయింట్లు నష్టపోయి 38,913.06 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లను కోల్పోయి 11,539.20 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,913.06-39,306.37 రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 11,539.20-11,655.05 శ్రేణిలో కదలాడింది. 

ఐఓసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐషర్‌మోటర్స్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు 3శాతం నుంచి 4శాతం వరకు నష్టపోయాయి. టాటామోటర్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, జీ లిమిటెడ్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 3శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఈ నెల 30 నుంచి ఐఆర్‌సీటీసీ ఐపీవో

Wednesday 25th September 2019

భారతీయ రైల్వేకు చెందిన అనుబంధ కంపెనీ ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఐపీవో అతి త్వరలోనే ఇన్వెస్టర్ల ముందుకు రానుంది. ఈ నెల 30 నుంచి ఐపీవోను చేపట్టాలని కంపెనీ ప్రణాళిక.   కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును గణనీయంగా తగ్గించడంతో దేశ ఈక్విటీ మార్కెట్లు ఒక్కసారిగా బేరిష్‌ నుంచి బుల్లిష్‌గా మారిన వెంటనే ఐఆర్‌సీటీసీ తన ఐపీవో ప్రణాళికను బయటకు తీయడం గమనార్హం. కార్పొరేట్‌ పన్ను కోతతో

ఆర్‌ఐఎల్‌, ఎయిర్‌టెల్‌ షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు!

Tuesday 24th September 2019

ప్రభుత్వం  కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించిన తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్యాక్స్‌ కట్‌ ప్రభావం మంగళవారం తగ్గినట్టు‍ కనిపిస్తున్నప్పటికి, ఎంఏసీడీ(మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌, డైవర్జన్స్‌) ఇండికేటర్‌లో 66 స్టాకులు బలమైన బుల్‌ సంకేతాలనిస్తున్నాయని సాంకేతిక విశ్లేషకులు తెలిపారు. ఈ స్టాకులు, టెక్నికల్‌ చార్టులలో ‘బుల్లిష్‌ క్రాస్‌ ఓవర్‌’ నమూనాను ఏర్పాటు చేశాయని, అంతేకాకుండా తాజాగా బలమైన ట్రేడింగ్‌ వాల్యుమ్‌లను చూశాయని విశ్లేషకులు

Most from this category