News


స్వల్పలాభాలతో ముగింపు

Friday 18th January 2019
Markets_main1547807502.png-23671

ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కూడా అక్కడక్కడే ముగిసింది. సెన్సెక్స్‌ 12 పాయింట్ల లాభపడి 36,386.61 వద్ద, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 10,907 వద్ద ముగిసింది. సూచీలకు ఈ వారంలో ఇది నాలుగో లాభాల ముగింపు కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న సానుకూల సంకేతాలతో నేడు దేశీయ మార్కెట్‌ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రిలయన్స్‌ షేర్ల 1.50శాతం లాభాల ప్రారంభం అండగా నేడు సెన్సెక్స్‌ 49 పాయింట్ల లాభంతో 36,429 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల పెరిగి 10,924 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ట్రేడింగ్‌లో ప్రారంభం నుంచి సన్‌ఫార్మా భారీ పతనం సూచీల ర్యాలీకి అడ్డుగా నిలిచింది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు, ఎఫ్‌ఎంఎఫ్‌సీ షేర్ల పతనంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సూచీ 156 పాయింట్లు నష్టపోయి 36,218.33 వద్ద, నిఫ్టీ సూచీ 53 పాయింట్లను 10,852.20 వద్దకు పతనయ్యాయి. అయితే మిడ్‌సెషన్‌ అనంతరం సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ షేర్లు మరింత జోరుగా ర్యాలీ చేయడం, యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం తదితర సానుకూలాంశాలు సూచీలను లాభాల్లోకి మళ్లించాయి. ఇంట్రాడేలో చిన్న షేర్లలో భారీగా అమ్మకాలు జరిగడంతో ఎన్‌ఎస్‌ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ దాదాపు 1.25శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో ఒక్క ఐటీ ఇండెక్స్‌(0.60శాతం)మాత్రమే లాభపడింది. ఇక బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 72 పాయింట్లను నష్టపోయి 27,456.70 వద్ద ముగిసింది. సన్‌ ఫార్మా పతనంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ అత్యధికంగా 2.75శాతం నష్టపోయిగా, ఇండియన్‌ బ్యాంక్‌ 6శాతం పతనంతో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, కోటక్‌ బ్యాంక్‌, హిందాల్కో, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు 1.50శాతం నుంచి 4.50శాతం లాభపడగా, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌, భారతీఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా షేర్లు 2శాతం నుంచి 8.50శాతం నష్టపోయాయి.



You may be interested

విప్రో ఏడీఆర్‌ 2 శాతం అప్‌

Saturday 19th January 2019

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వేదాంత ఏడీఆర్‌లు లాభాల్లోనూ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటామోటర్స్‌ ఏడీఆర్‌లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా  విప్రో కంపెనీ షేరు కంపెనీ 2శాతం లాభపడింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం వెలువరించిన మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడం, బోనస్‌ ఇష్యూను ప్రకటించడంతో

వడ్డీ రేట్ల తగ్గింపు సమయంలో డెట్‌ ఫండ్స్‌ బెస్ట్‌

Friday 18th January 2019

ఆర్‌బిఐ కీలక రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్న వేళ   డెట్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం ద్వారా తీరైన రిటర్న్స్ పొందవచ్చని మార్కెట్‌ పండితులు సూచిస్తున్నారు. డెట్‌ ఫండ్స్‌ను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సెక్యూరిటీలు అనికూడా అంటారు. వీటిల్లో సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌, కార్పొరేట్‌బాండ్స్‌, కమర్షియల్‌పేపర్స్‌, గవర్నమెంట్‌ బాండ్స్‌.. ఇలా పలు రకాలున్నాయి. ఈ ఫండ్స్‌లో ప్రధానంగా వడ్డీరేట్ల రిస్కు, క్రెడిట్‌ రిస్క్‌ అని రెండు రకాల రిస్కులుంటాయి. వడ్డీరేట్లకు, బాండ్ల మార్కెట్‌ విలువకు విలోమానుపాత

Most from this category