News


గరిష్టస్థాయి వద్ద అమ్మకాలు

Monday 19th August 2019
Markets_main1566210083.png-27870

  • ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు 
  • 11050పైన ముగిసిన నిఫ్టీ
  • 50 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాలను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా సోమవారం సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 52.16 పాయింట్లు లాభంతో 37,402.49 వద్ద, నిఫ్టీ  6.10 పాయింట్లు పెరిగి వద్ద 11,053.90 ముగిసింది. సూచీలకిది వరుసగా మూడో లాభాల ముగింపు కావడం విశేషం. మీడియా, ఐటీ, పార్మా రియల్టీ, ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ప్రభ్వుత రంగ, అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ షేర్లకు అమ్మకాల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 361 పాయింట్ల రేంజ్‌లో 37,358.49 - 37,718.88 శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ 110 పాయింట్ల శ్రేణిలో 11,037.85 - 11,146.90 స్థాయిలో కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న సూచీలు నేడు లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రానున్న ద్రవ్యపరపతి సమావేశంలో భాగంగా వడ్డీరేట్లపై ఈసారి ఆర్‌బీఐ 40బేసిస్‌ పాయింట్ల మేర కోత విధింపు వచ్చనే అంచనాలతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం సానుకూల ప్రకటన చేయవచ్చనే అంచనాలతో మిడ్‌సెషన్‌ వరకు మార్కెట్లో కొనుగోళ్ల పర్వం సాగింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 369 వద్ద పాయింట్లు పెరిగి 37,350.33 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 11,146.90 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే దేశీయ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు ట్రేడింగ్‌ సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మార్కెట్‌ వర్గాలు తీవ్ర నిరాశకులోనయ్యాయి. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 26 పైసలు క్షీణించడటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది. ఫలితంగా ట్రేడర్లతో పాటు ఇన్వెస్టర్లు కూడా అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఉదయం ఆర్థించిన లాభాలన్నీ కోల్పోయి స్వల్పంగా లాభంతో ట్రేడింగ్‌ను ముగించాయి.

టైటాన్‌, ఇన్ఫ్రాటెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. కోల్‌ఇండియా, గెయిల్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, గ్రాసీం, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. You may be interested

11181 పాయింట్లు దాటితే బలమైన అప్‌మూవ్‌!

Monday 19th August 2019

నిఫ్టీపై నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా నిఫ్టీ గతవారం ఎంత ప్రయత్నించినా తన 200 రోజుల డీఎంఏ స్థాయిని దాటలేకపోయిందని, ఈ స్థాయిని దాటితేనే బలమైన అప్‌మూవ్‌ ఉంటుందని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రిసెర్చ్‌హెడ్‌ షబ్బీర్‌ కయ్యూమీ అభిప్రాయపడ్డారు. వీక్లీ చార్టుల్లో క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ పరిశీలిస్తే ప్రస్తుతానికి పతనానికి చెక్‌ పడినట్లు భావించవచ్చన్నారు. చార్టుల్లో కప్‌ అండ్‌ హ్యాండిల్‌ ప్యాట్రన్‌ ఏర్పడిందని, ఈ ప్యాట్రన్‌ పై అవధి 11170 పాయింట్ల వద్ద

ఐపీఓ దెబ్బతో పతనమైన ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌!

Monday 19th August 2019

సాధారణంగా ఒక సంస్థకు సంబంధించిన అనుబంధ సంస్థ ఐపీఓకి (ఇనీసీయల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తే ఆ సంస్థ షేరు విలువ పెరుగుతుంది. కానీ ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌  మాత్రం సోమవారం ట్రేడింగ్‌లో  8 శాతం మేర పతనమయ్యింది(ఉదయం 10.00 సమయానికి). ఈ కంపెనీకి అనుబంధ సంస్థయిన ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ రూ. 1,200 కోట్ల ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాప్ట్‌ పేపర్స్‌ నమోదు చేసింది. ‘ఉజ్జీవన్ పైనాన్స్‌లో ఉన్న

Most from this category