News


సూచీలకు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల జోష్‌

Monday 20th May 2019
Markets_main1558348142.png-25846

  • రికార్డు స్థాయిలో ముగిసిన సూచీలు
  • 1,422 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ 
  • 421 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై: ఎగ్జిట్‌ పోల్స్‌ మరోసారి బీజేపీకి జై కొట్టడంతో  సోమవారం మార్కెట్లో లాభాల పంట పండింది. నిన్న విడుదల ఎగ్జిట్‌  పోల్స్‌ కేంద్రంలో బీజేపీ సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లలో జోష్‌ నింపాయి. ఫలితంగా బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 1,422 పాయింట్ల లాభంతో 39352.67 వద్ద, నిఫ్టీ 421.10 పాయింట్లు పెరిగి 11828.30 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇరు సూచీలకు ఇది రికార్డు స్థాయి ముగింపు కావడం విశేషం. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 2వారాల గరిష్టానికి బలపడటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. సూచీలకు వరుసగా ఇది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఈ 3రోజుల్లోనే సెన్సెక్స్‌ 2238 పాయింట్లను, నిఫ్టీ 671 పాయింట్లను ఆర్జించాయి. స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడంతో బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల సంపద ఒక్కరోజులోనే 4లక్షల కోట్లకు ఎగసింది. మొత్తం సంపద 150.91 లక్షల కోట్లకు చేరింది.

నేటి ఉదయం సెన్సెక్స్‌ 770 పాయింట్ల లాభంతో 38,700 వద్ద, నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి 11,652 పాయింట్ల వద్ద  ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్ల వెల్లువతో సూచీలు దూసుకెళ్లాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 10ఏళ్ల తరువాత అతిపెద్ద ర్యాలీ చేసింది. ట్రేడింగ్‌లో 1482 పాయింట్లు లాభపడి 39,412.56 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 438 పాయింట్లు లాభపడి 11,845.2 వద్ద డే-హైని నమోదు చేసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సూచీలు ఏ దశలో వెనుదిరగలేదు. 

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువలా సాగడంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకు నిఫ్టీ ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఈ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సి్‌స్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం వరకు ర్యాలీ చేయడంతో ఇంట్రాడేలో 1330 పాయింట్లు(4.50శాతం) పెరిగి 30779.90 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ ముగింపు సమయానికి  1330 పాయింట్ల (4శాతం) లాభంతో 30,663.20 వద్ద స్థిరపడింది. మరోవైపు రూపాయి బలపడటంతో ఐటీ షేర్లు, డాక్టర్‌ రెడ్డీస్‌ 7శాతం పతనం కారణంగా ఫార్మా షేర్ల లో ఓ మోస్తరుగా మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఈ ఏడాది సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదు కావచ్చనే ఐఎంఎఫ్‌ తెలపడంతో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో అటో, ఫైనాన్స్ కంపెనీలు షేర్లు ర్యాలీ సాగింది. 

టాటామోటర్స్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, అదానీపోర్ట్స్‌ షేర్లు 7శాతం నుంచి 11శాతం లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ అటో, జీ లిమిటెడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 0.50శాతం నుంచి 5.50శాతం నష్టపోయాయి. You may be interested

స్మాల్‌, మిడ్‌క్యాప్‌ ర్యాలీ ఇకపై..: పొరింజు

Monday 20th May 2019

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లకు ఇది మలుపు వంటిదని ప్రముఖ ఫండ్‌ మేనేజర్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ పోర్ట్‌ఫోలియో సర్వీసెస్‌ అధినేత పొరింజు వెలియాత్‌ అభిప్రాయపడ్డారు. ర్యాలీకి సిద్ధంగా ఉన్నాయని, అది కూడా కేవలం ఒకటి రెండు నెలలు కాకుండా వచ్చే రెండు మూడేళ్ల పాటు ఇవి ర్యాలీ చేయనున్నాయన్నారు. ఈ స్టాక్స్‌కు దూరంగా ఉన్న వారు సైతం చౌక విలువలను గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈక్విటీ పెట్టుబడులు, ప్రధానంగా ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌

కార్వీ నుంచి స్ట్రాంగ్‌ బెట్స్‌

Monday 20th May 2019

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలతో మరోమారు సుస్థిర ప్రభుత్వమే వస్తుందన్న నమ్మకం మార్కెట్లో బలంగా పెరిగింది. దీంతో సూచీలు సోమవారం చెలరేగాయి. నిఫ్టీ దాదాపు  420 పాయింట్లు, సెన్సెక్స్‌ దాదాపు 1400పాయింట్లు, బ్యాంకు నిఫ్టీ దాదాపు 1300 పాయింట్లు పెరిగాయి. నిఫ్టీ తన ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చాలా దగ్గరైంది. ఈ నేపథ్యంలో స్థిరమైన ప్రదర్శన జరిపే స్టాకులను ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలని కార్వీ బ్రోకింగ్‌ సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు స్టాకులను

Most from this category