News


రికార్డు ర్యాలీతో నవంబర్‌ సిరీస్‌ ముగింపు

Thursday 28th November 2019
Markets_main1574938101.png-29933

 

  • ఇంట్రాడేలో కొత్త గరిష్టాలను నమోదు చేసిన సూచీలు
  • 12150 పైన ముగిసిన నిఫ్టీ

సూచీలు నవంబర్‌ డెరివేటివ్‌ సీరీస్‌ను గురువారం రికార్డు ర్యాలీతో ముగించాయి. ప్రతీనెలా చివరి గురువారం ఆ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులకు ముగింపు రోజు. కాగా ఈ రోజు బ్యాంకింగ్‌, మెటల్‌, ఐటీ షేర్ల ర్యాలీతో వరుసగా రెండోరోజూ లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడంతో పాటు రెండోరోజూ కొత్త రికార్డుస్థాయిలోనే ముగియడం విశేషం.సెన్సెక్స్‌ 109 పాయింట్లు లాభపడి 41,130.17 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53.60 పాయింట్లు పెరిగి 12150పైన 12,154.30 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈల కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 248.50 పాయింట్లు పెరిగి 32,124.45 వద్ద స్థిరపడింది. ఒక్క అటోరంగ షేర్లు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 3.50శాతం లాభంతో ముగిసింది. 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహపూరిత వాతావరణం నేపథ్యంలో నేడు  సెన్సెక్స్‌ 140 పాయింట్ల లాభంతో 41,161 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 12,133 ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త ఆల్‌టైం అందుకోవడంతో పాటు కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.10లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా దేశీయ కంపెనీల్లో రూ.10లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ అందుకున్న తొలికంపెనీగా రికార్డు కెక్కింది. అనంతరం నేడు నవంబర్‌ ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ ముగింపు తేది కావడం, శుక్రవారం దేశీయ క్యూ2 జీడీపీ గణాంకాలు విడుదల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించడంతో సూచీలు మధ్యాహ్న సెషన్‌లో ఆరంభలాభాల్ని కోల్పోయాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూడకుండా  మిడ్‌సెషన్‌ మొత్తం స్వల్పలాభంతో పరిమితి శ్రేణిలో కదలాడాయి. అయితే కిత్రం రోజులానే మార్కెట్‌ మరో అరగంటలో ముగిస్తుందనే తరుణంలో మార్కెట్లో కొనుగోళ్ల పర్వం మొదలైంది. ముఖ్యంగా ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రైవేట్‌ రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో సూచీలు మిడ్‌సెషన్‌ నష్టాలను పూడ్చుకున్నాయి. అలాగే  సెన్సెక్స్‌ 144 పాయింట్ల లాభంతో 41,163.79 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 12,158.80 వద్ద కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. 

కోల్‌ ఇండియా, యస్‌బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, యూపీఎల్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2.50శాతం నుంచి 14శాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ అటో, హెచ్‌డీఎఫ్‌సీ, హీరోమోటోకార్ప్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. You may be interested

ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ ఐపీవో.. ముఖ్యమైన వివరాలు..

Thursday 28th November 2019

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన సబ్సిడరీ.. ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు (ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ) ఐపీవో సోమవారం (డిసెంబర్‌ 2న) ప్రారంభం కానుంది. 4వ తేదీన ఇష్యూ ముగుస్తుంది. రూ.750 కోట్లను ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా సమీకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.36-37గా కంపెనీ ఖరారు చేసింది. ఒక రిటైల్‌ ఇన్వెస్టర్‌ కనీసం 400 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్‌

ఎన్‌బీఎఫ్‌సీ మొండి ఆస్తుల కొనుగోలు భాద్యత ఆర్‌బీఐకి?!

Thursday 28th November 2019

ప్రభుత్వ యోచన ఎన్‌బీఎఫ్‌సీల వద్ద పేరుకుపోయిన మొండిపద్దులకు సంబంధించిన ఆస్తులను ఆర్‌బీఐ కొనుగోలు చేయాలని ప్రభుత్వం కోరుతున్నట్లు తెలిసింది. దేశంలో టాప్‌ 25 షాడో బ్యాంకులు(ఎన్‌బీఎఫ్‌సీలు) వద్ద ఉన్న ఒత్తిడిలో ఉన్న ఆస్తులు కొనేందుకు ఆర్‌బీఐ ఒక ఫండ్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు బ్యాంకులు కొన్ని రియల్టీ లోన్లను మొండిపద్దులుగా పరిగణించి వన్‌టైమ్‌ మాఫీ చేసేందుకు అనుమతించాలని కూడా ప్రభుత్వం

Most from this category