News


రెండోరోజూ కొనసాగిన రికార్డు ర్యాలీ

Wednesday 18th December 2019
Markets_main1576664542.png-30290

ఇంట్రాడే, ముగింపులో రికార్డు స్థాయిలే..
12200పైన ముగిసిన నిఫ్టీ
206 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌


మెటల్‌, ఫార్మా, అటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల రికార్డు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 206 పాయింట్లు లాభంతో 41,558 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయిoట్లు 12200 పైన 12,221 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు అటు ట్రేడింగ్‌నూ, ముగింపులోనూ కొత్త రికార్డు స్థాయిలు కావడం విశేషం. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలకు తోడు దేశీయ ఈక్విటీల కొనుగోళ్లకు విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపరించింది. ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు నేడు జరుగుతున్న 38 జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పన్ను శ్లాబులును తగ్గించవచ్చనే ఆశావహన అంచనాలు మార్కెట్లో కొనుగోళ్లకు పురిగొల్పాయి. ముఖ్యంగా మెటల్‌, ఫార్మా, అటో రంగ షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 262 పాయింట్లు లాభపడి 41,614.77 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 12,237 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. మరోవైపు మీడియా, ప్రభుత్వ రంగ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.38శాతం లాభపడి 32,261 వద్ద స్థిరపడింది. అయితే మార్కెట్‌ మరో అరగంటలో ముగుస్తుందగా సూచీలు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాలు కొన్ని హరించుకుపోయాయి. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పేయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం 2శాతం నుంచి 3.50శాతం వరకు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, యస్‌బ్యాంక్‌, గ్రాసీం, గెయిల్‌ టాటామోటర్స్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

టాటా గ్రూపు స్టాక్స్‌ పరిస్థితి ఏంటి..?

Thursday 19th December 2019

సైరస్‌ మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్‌గా తొలగించడం చట్ట విరుద్ధమని ఎన్‌సీఎల్‌ అప్పిలేట్‌ ట్రి‍బ్యునల్‌ ఇచ్చిన తీర్పు ప్రభావం.. బుధవారం ట్రేడింగ్‌ సెషన్‌లో టాటా గ్రూపు స్టాక్స్‌పై చూపించింది. కొన్ని షేర్లు స్వల్పంగాను, కొన్ని చెప్పుకోతగ్గంత నష్టపోయాయి. అత్యధికంగా టాటా కమ్యూనికేషన్స్‌ 7 శాతం క్షీణించింది. ఈ పరిస్థితుల్లో టాటా గ్రూపు షేర్‌ హోల్డర్లు ఆందోళన పడిపోకుండా, తాము దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేశామా? లేక స్వల్ప కాలం కోసమా

టాటా గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకం!

Wednesday 18th December 2019

అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్నియమిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ(అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌) ఆదేశాలిచ్చింది. మిస్త్రీని తొలగించడం, ఆయన స్థానంలో చంద్రశేఖర్‌ను ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం అనైతికమని ప్రకటించింది. మిస్త్రీ పునర్నియామకం నాలుగువారాల్లో అమల్లోకి వస్తుందని, ఈ గడువులోపు టాటా గ్రూప్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ట్రిబ్యునల్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలోని ద్విసభ్య బెంచ్‌ ఈ తీర్పునిచ్చింది. దీంతో పాటు టాటాసన్స్‌ను పబ్లిక్‌ నుంచి ప్రైవేట్‌

Most from this category