News


నష్టాల్లోంచి లాభాల్లోకి సూచీలు

Friday 23rd August 2019
Markets_main1566538629.png-27964

నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు అన్యూహంగా లాభాల్లోకి మళ్లాయి. ఎఫ్‌పీఐలపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జీలను విధింపును కేంద్రం ఎత్తివేస్తుందనే వార్తలు వెలుగులోకి రావడం ఇందుకు కారణమైంది. ప్యాకేజీ ఉద్దీపన చర్యలు ఉండవని కేంద్రం స్పష్టం చేయడంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు, రూపాయి ఎనిమిది నెలల కనిష్టానికి పతనం తదితర కారణాలతో సూచీలు నిన్న 6నెలల కనిష్టం వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. నిన్నటి నష్టాల ముగింపును కొనసాగిస్తూ నేడు కూడా సూచీలు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల నష్టంతో 36,387.68 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 42 పాయింట్ల నష్టంతో 10700 దిగువున 10,699.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభంలో కొంత అమ్మకాలు జరగడంతో ఈ క్రమంలో సెన్సెక్స్‌ 371 పాయింట్లు కోల్పోయి 36,102.35 వద్ద, నిఫ్టీ నిఫ్టీ ఇండెక్స్‌ 104 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఈ దశలో  ఎఫ్‌పీఐలపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జీలను విధింపును కేంద్రం ఎత్తివేస్తుందనే వార్తలు వెలుగులోకి మార్కెట్‌లో మళ్లీ కొనుగోళ్లకు మద్దతు లభించింది. ఫలితంగా సూచీలు అనూహ్యంగా నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. ఐటీ, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌, అటో, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో  సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టం(36,102.35) నుంచి 522 పాయింట్లు రివకరి సాధించి 36,624.74 వద్ద, నిఫ్టీ డే కనిష్టం నుంచి 158 పాయింట్లు పెరిగి 10,795.40 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి. ఉదయం గం.11:00లకు సెన్సెక్స్‌ 64 పాయింట్ల లాభంతో 36,537.40 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 10,773.50 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

లాభాల కోసం ‘ప్రైవేటు’ పనిచేయడం తప్పేంటి?

Friday 23rd August 2019

‘లాభాలు ప్రైవేట్‌, నష్టాలు పబ్లిక్‌ ’ వంటి విధానం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ప్రకటించిన ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ వ్యాఖ్యలతో పూర్తిగా నిరాకరిస్తున్నానని హీరో గ్రూప్ వ్యవస్థాపక ప్రమోటర్ సునీల్ కాంత్ ముంజాల్ ఓ ఇంటర్యూలో అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థలను గమనిస్తే అవి ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుస్తుందని తెలిపారు. ‘ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించే ఆర్థిక వ్యవస్థలలో మనది

నష్టాలకు బ్రేక్‌..60 డాలర్లకు పైన చమురు

Friday 23rd August 2019

చమురు డిమాండ్‌ ఆందోళనల నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి దారులు సరఫరాను కఠినతరం చేయడంతో చమురు ధరలు శుక్రవారం ట్రేడింగ్‌లో పెరిగాయి. దీనితో పాటు ఫెడ్‌ రిజర్వ్‌ మానెటరీ పాలసీపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు వేచి ఉండడం కూడా చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. బ్రెంట్‌ క్రూడ్‌ 10 సెంటులు పెరిగి బారెల్‌ 60.02 డాలర్లకు చేరుకోగా డబ్యూటీఐ క్రూడ్‌ 3 సెంటులు పెరిగి బారెల్‌ 55.38 డాలర్లకు చేరుకుంది.

Most from this category