11500 దిగువన ముగిసిన నిఫ్టీ
By Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక చివరి రోజును మార్కెట్ నష్టాలతో ముగించింది. ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 38,667.33 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లను కోల్పోయి 11500 దిగువన 11,477.25 వద్ద స్థిరపడ్డాయి. రేపు సెప్టెంబర్ నెల వాహన గణాంకాలు వెల్లడి, ఎల్లుండి మహాత్మగాంధీ జయంతి సందర్భంగా సెలవు రోజు కావడం, గురు, శుక్రవారాల్లో ఆర్బీఐ ద్రవ్యపరపతి సమావేశంతో పాటు, వచ్చే వారంలో కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపారు. అలాగే ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 18 పైసల మేర క్షీణించడటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరించింది. రూపాయి బలహీనతతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. టెలికం షేర్లు భారీగా పెరిగాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు కూడా స్వల్పంగా పెరిగాయి. మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అన్ని రంగాల్లో కెల్లా బ్యాంకింగ్ రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఫలితంగా 7734 పాయింట్లు నష్టపోయి 29,103 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 422 పాయింట్లు నష్టపోయి 38,401.09 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల మేర పతనమైన 11,390.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఈ దశలో షార్ట్‌కవరింగ్ జరగడంతో సూచీలు నష్టాలు కొంతమేర తగ్గాయి. ఈ క్యూ2లో కాలంలో సెన్సెక్స్ 919 పాయింట్లును, నిఫ్టీ 365 పాయింట్లను కోల్పోయాయి. జీ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్‌బ్యాంక్ 3.50శాతం నుంచి 14.50 వరకు నష్టపోయాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 2.50శాతం నుంచి 7శాతం వరకు లాభపడ్డాయి.
You may be interested
ఎయిర్టెల్ 7 శాతం అప్!
Monday 30th September 2019రానున్న మూడు క్వార్టర్లలో టెలికం మార్కెట్లో తమ ఆదాయ వాటాను 35శాతానికి పెంచుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని భారతీ ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా సీఈఓ గోపాల్ విట్టాల్ సోమవారం అన్నారు. అంతేకాకుండా ప్రత్యర్థి కంపెనీలైన రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా కంపెనీ బలహీనతలను ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్టెల్ షేరు 6.93 శాతం లాభపడి రూ. 373.30 వద్ద ముగిసింది. కాగా గత సెషన్లో రూ. 349.10 వద్ద
రెండు దశాబ్దాల కనిష్టానికి రిలయన్స్ క్యాపిటల్ షేర్లు
Monday 30th September 2019అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ఆర్థిక సేవల సంస్థ రిలయన్స్ క్యాపిటల్ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 20ఏళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ లెండింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తుందని గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ సోమవారం ప్రకటించడం షేర్ల పతనానికి కారణమైంది. నేడు ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.28.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని నేడు ముంబాయిలో షేర్‌హోల్డర్ల వార్షిక సాధారణ