లాభాల్లో నుంచి నష్టాల్లోకి మార్కెట్
By Sakshi

లాభాలతో ప్రారంభమైన మార్కెట్ మిడ్‌సెషన్ కల్లా నష్టాల్లోకి మళ్లింది. మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే మహారాష్ట్రలో భాజపా గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే హరియాణా ఫలితాలు మాత్రం హంగ్ దిశగా కదులుతున్నాయి. హరియాణ సీఎం పీఠాన్ని చిన్న పార్టీ జేజేపీకి సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసింది. ఈ అనిశ్చితి సమయంలో స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా సూచీలు లాభాల్లోకి నష్టాల్లోకి మళ్లాయి. మధ్యాహ్నం గం.12:00ల నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 11574 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 38908 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రియల్టీ, మీడియా, ఆర్థిక, అటో రంగ షేర్లకు స్వల్పంగా లాభాల మద్దతు లభిస్తుంది. రెండో రోజూ దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం సెషన్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 269 పాయింట్ల లాభపడి 39,327.15, నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 11,679.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఐఓసీ, గెయిల్, గ్రాసీం, ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్ షేర్లు 2శాతం నుంచి 4శాతం వరకు నష్టపోయాయి. అల్ట్రాటెక్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, హెచ్‌సీఎల్‌టెక్, ఐషర్‌మోటర్స్ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి.
You may be interested
అనూహ్య అమ్మకాలు: ఎస్బీఐ 9.50శాతం పతనం
Thursday 24th October 2019లాభాల్లో నుంచి నష్టాల్లోకి మళ్లిన మార్కెట్లో ఎస్బీఐ షేర్లు మిడ్‌సెషన్ సమయంలో ఒక్కసారిగా భారీ పతనాన్ని చవిచూశాయి. నేడు బీఎస్ఈలో ఈ బ్యాంక్ షేర్లు రూ.277.00 వద్ద ట్రేడింగ్ వద్ద ప్రారంభించాయి. మిడ్‌సెషన్‌లో ఈ షేర్లలో ఒక్కసారిగా అమ్మకాల తీవ్ర మొదలైంది. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో కేవలం 10 నిముషాల్లో ఎస్బీఐ దాదాపు 9.50శాతం క్షీణించి రూ.248.80 వద్ద ఇంట్రాడే కనిష్టానికి తాకింది. అనంతరం క్షణాల్లో రూ. 266 సమీపానికి రికవరీ
ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు ప్రారంభించిన యుఎస్సెక్
Thursday 24th October 2019కంపెనీ లాభాలను, మార్జిన్లను ఎక్కువ చేసి చూపించారని ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా యుఎస్ సెక్యురిటీ, ఎక్సేంజ్ బోర్డు(యుఎస్ సెక్)కు ఆ కంపెనీ ఉద్యోగుల గ్రూప్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విజిల్ బ్లోవర్ ఫిర్యాదుపై దర్యాప్తును యుఎస్ సెక్ ప్రారంభించింది. ఇన్ఫోసిస్, యుఎస్ సెక్ దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తుందని, వారికి అందుబాటులో ఉంటుందని కంపెనీ బీఎస్ఈకి ఇచ్చిన ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా పెద్ద ఒప్పందాలకు సంబంధించి కంపెనీ