News


మార్కెట్‌ భారీ పతనానికి కారణలివే...!

Friday 28th February 2020
Markets_main1582876117.png-32167

కరోనా వ్యాధి వ్యాప్తి ఉధృతి భయాలు ఈక్విటీ మార్కెట్లను వెంటాడంతో శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్‌ భారీ పతనాన్ని చవిచూసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా మిడ్‌సెషన్‌ కల్లా సెనెక్స్‌ 1342 పాయింట్లను కోల్పోయి 38,403.53, నిఫ్టీ 399 పాయింట్లు క్షీణించి 11,233.95 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకింది. సూచీలకిది వరుసగా ఆరోరోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. అంతర్జాతీయ వృద్ధి భయాలతో డిమాండ్‌ తగ్గవచ్చనే అంచనాలతో మెటల్‌ షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూశాయి. వాటితో పాటు ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ మీడియా, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3నుంచి 5శాతం నష్టాన్ని చవిచూశాయి. అలాగే ఫార్మా, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ షేర్లు 2 నుంచి 3శాతం క్షీణించాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.5లక్షల కోట్ల వరకు హరించుకుపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్కెట్‌ భారీ పతనానికి గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం...!

1. శరవేగంగా కరోనావైరస్‌ వ్యాప్తి:
చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ వ్యాధి అతికొద్ది కాలంలో శరవేగంగా ప్రపంచదేశాలకు వ్యాపిస్తోంది. అంతర్జాతీయంగా శుక్రవారం నాటికి మొత్తం 83వేల మంది ఈ వైరస్‌ భారిన పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ఆవిర్భావానికి కారణమని చెబుతున్న చైనాలో ఇప్పటి వరకు 2,788 మరణాలు సంభవించగా, మొత్తం 78,824 కేసులు నమోదైనట్లు గుణాంకాలు చెబుతున్నాయి. తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా ఉంది. కేవలం శుక్రవారం మాత్రమే 256 మంది కొత్త కరోనా వైరస్‌ భాధితులు నమోదయ్యాయి. మొత్తంగా చైనా బయటి దేశాల్లో 2వేల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.

2. వ్యాధి వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన:
ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ వ్యాధిపై తీవ్ర అందోళన వ్యక్తం చేసింది. వ్యాధి వ్యాప్తి అభివృద్ధి చెందిన దేశాలకు విస్తరించిందని ఇది ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదమని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ప్రభుత్వాలు, విధానకర్తలు వ్యాధిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సలహానిచ్చింది.కరోనా వైరస్‌ ఎదుర్కోవడానికి ధనిక దేశాలతో సహా అన్ని దేశాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది.

3. ఆగని ఎఫ్‌ఐఐల అమ్మకాలు:
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. వరుసగా 4ట్రేడింగ్‌ సెషన్‌లోనూ భారీ ఎత్తున అమ్మకాలు జరిపారు. ఈ 4 ట్రేడింగ్‌ సెషన్‌లలో దాదాపు రూ.10వేల కోట్లు అమ్మకాలు జరిపారు. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 3,127.36 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇదే విభాగంలో బుధవారం రూ.3337 కోట్ల, మంగళవారం రూ.2325 కోట్లు, సోమవారం రూ.1160 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఎక్చ్సేంజీ గణాంకాలు చెబుతున్నాయి. 
 

4. నాలుగేళ్ల కనిష్టానికి క్రూడాయిల్‌ ధర:
ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర శుక్రవారం 4ఏళ్ల కనిష్టానికి దిగివచ్చాయి. క్రూడాయిల్‌ పతనం అంతర్జాతీయ వృద్ధి పతనాన్ని సూచిస్తుంది. ఈ వారంలో క్రూడాయిల్‌ ధర ఏకంగా 12శాతం మేర క్షీణించింది. ప్రపంచమార్కెట్లో బ్రెంట్‌క్రూడాయిల్ ఫ్యూచర్‌ ధర శుక్రవారం 2.24శాతం క్షీణించి 51.01డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

5. జీడీపీ గణాంకాలు:

నేడు మార్కెట్‌ ముగింపు మూడో త్రైమాసికపు జీడీపీ గణాంకాలతో పాటు జవనరి నెలకు సంబంధించి కీలక ఎనిమిది రంగాల మౌలిక రంగ గణాంకాలు విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 4.7శాతం వృద్ధితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరపు మూడో క్వార్టర్‌ జీడీపీ గణాంకాలు ఫ్లాట్‌గా నమోదు కావచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఎస్‌బీఐ బ్యాంక్‌ ఈ మూడో క్వార్టర్‌లో జీడీపీ 4.5శాతంగా నమోదుకావచ్చని అంచనావేస్తుంది. అలాగే కరోనా వైరస్ అంటువ్యాధితో భారత్ ఆర్థికంగా ప్రమాదాన్ని ఎదుర్కోంటుందని తెలిపింది. వివిధ వస్తువుల కోసం చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడటం వల్ల ఆర్థికంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన పడే ప్రమాదం భారత్ ఎదుర్కొంటుందని తెలిపింది. వివిధ వస్తువుల కోసం చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడటం ఇందుకు కారణమని తెలిపింది.

6. అంతర్జాతీయ మార్కెట్ల పతనం: 
కరోనా వైరస్‌ వ్యాధి భయాలు పెరగడంతో నిన్నరాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 4శాతం, యూరప్‌ మార్కెట్ల 3.50శాతం పతనమవగా, నేడు ఆసియాలో ప్రధాన సూచీలు 3శాతం నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ సూచీలు నేడు భారీ నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. You may be interested

కరోనా వైరస్‌ దెబ్బకు బేర్‌మన్న బుల్‌

Friday 28th February 2020

సెన్సెక్స్‌ 1,448.37 పాయింట్లు 4ఏళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన నిఫ్టీ ఈక్విటీ మార్కెట్లను కరోనా వ్యాధి భయాలు వీడటం లేదు. ఫలితంగా దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 1,448.37 పాయింట్లు నష్టపోయి 38297.29 వద్ద, నిఫ్టీ 431.50 పాయింట్లు కోల్పోయి 11201.80 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ గడిచిన నాలుగేళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 111 పాయింట్ల నష్టంతో వద్ద, నిఫ్టీ 111 పాయింట్లను కోల్పోయి

52 వారాల కనిష్టానికి 313 షేర్లు

Friday 28th February 2020

శుక్రవారం 313 షేర్లు  52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వాటిలో 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, అర్బన​ఆఫ్‌షోర్‌, ABB ఇండియా, ACC, అగర్వాల్‌ ఇండస్ట్రీయల్‌ కార్పొరేషన్‌, అగ్రి టెక్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అంబికా కాటన్‌ మిల్స్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఆంధ్రా సుగర్స్‌, ఆంధ్రా పేపర్‌, అపార్‌ ఇండస్ట్రీస్‌, అప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, అపోలో టైర్స్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్కిడ్‌ఫ్లే ఇండస్ట్రీస్‌, ఆర్చీస్‌, ఆర్కొటెక్‌, ఆరో గ్రానైట్‌ ఇండస్ట్రీయల్‌లు

Most from this category