News


లాభాల్లోంచి నష్టాలోకి మార్కెట్‌...

Tuesday 2nd July 2019
Markets_main1562047012.png-26728

స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.., తిరిగి నష్టాల్లోకి మళ్లింది. ప్రపంచమార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వాతావరణం, దేశీయ ఆర్థిక వ్యవస్థలో నమోదైన బలహీన ఆర్థిక గణాంకాలు సూచీలను నష్టాల్లోకి మళ్లేందుకు కారణమయ్యాయి. నేడు నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,892.70వద్ద, సెన్సెక్స్‌ 126 పాయింట్ల లాభంతో 39,811.68 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. 

దేశీయంగా నిన్న పలు వాహన కంపెనీలు జూన్‌ మాసపు విక్రయ గణాంకాలను విడుదల చేశాయి. వరుసగా 3వ నెలలో అమ్మకాల క్షీణతను నమోదు చేశాయి. జూన్‌లో 19శాతం క్షీణించి 222,000 యూనిట్లుగా నమోదయ్యాయి.ఏప్రిల్‌ నెలలో 17శాతం, మే 20.5శాతం విక్రయాలు క్షీణించాయి. ఇదే జూన్‌ నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.1లక్ష కోట్ల మార్కు దిగువన రూ.99,939 కోట్లకు తగ్గాయి. మరోవైపు భారత తయారీ రంగ వృద్ధి ఇదే జూన్‌లో అంతంత మాత్రంగానే నమోదైంది. కొత్త ఆర్డర్లు రాకపోవడంతో ఉత్పత్తి, ఉదోగ్య కల్పన మందగించడంతో 52.1కు పడిపోయింది. అంతర్జాతీయంగా బలహీనమైన ఉత్పాదక కార్యకలాపాలు ప్రపంచ వృద్ధని మందగించింది. అలాగే  అమెరికా -చైనాల మధ్య కుదరిన చర్చలు ఒప్పందం ఎంతకాలం సాగుతుందనే ఆందోళనలతో అంతర్జాతీయంగా బలహీన వాతావరణం నెలకొంది. ఫలితంగా నేడు అమెరికా ఫ్యూచర్లతో పాటు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల బాట పట్టాయి. ఈ ప్రతికూలాంశాలు దేశీయ మార్కెట్‌ ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైనప్పటికీ.., తిరిగి నష్టాల్లోకి మళ్లాయి. 

ఉదయం గం.10:40.ని.లకు సెన్సెక్స్‌ 158 పాయింట్ల నష్టంతో 39,528.12 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లను కోల్పోయి 11825ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్నిరంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎక్కువగా బ్యాంకింగ్‌, ఆర్థిక, ఫార్మా, మెటల్‌ అమ్మకాలు ఒత్తిడికిలోనవుతున్నాయి. అయితే, ఐటీ షేర్లల్లో అమ్మకాలు కొంత స్వల్పంగా ఉన్నాయి.
 



You may be interested

యస్‌ బ్యాంక్‌ రుణగ్రహిత డిఫాల్ట్‌

Tuesday 2nd July 2019

ఎన్‌బీఎఫ్‌సీ రంగం సమస్యల్లో ఉండడంతో పాటు ఆర్థిక మందగమనం కారణానా యస్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న  రూ.1200 కోట్ల రుణాలపై వడ్డీలను  రేడియస్‌ డెవలపర్స్‌ సంస్థ షెడ్యుల్‌ సమయంలో చెల్లించలేకపోయింది.  బ్యాంకులు ప్రకటించిన ప్రమాదకర రుణాలు రూ. 5,500 కోట్లపై వడ్డీలను తీర్చడంలో ఈ కంపెనీ గత 45-60 రోజులుగా ఆలస్యం చేసింది. ‘రూ. 30 కోట్ల వడ్డి చెల్లింపులు ఆలస్యం చేయడంతో రేడియస్‌ డెవలపర్స్‌ ఖాతా ఎస్‌ఎమ్‌ఏ 2

డిమాండ్‌ భయాలతో తగ్గిన చమురు

Tuesday 2nd July 2019

చమురు ఉత్పత్తి కోత నిర్ణయాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు ఒపెక్‌ దేశాలు పొడింగించినప్పటికి  అంతర్జాతీయంగా ఆయిల్‌ డిమాండ్‌ బలహీనపడడంతో భవిష్యత్తులో చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా మంగళవారం(జులై​2) ట్రేడింగ్‌లో చమురు ధరలు తగ్గాయి. సెప్టెంబర్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ప్యూచర్‌ ధరలు 0.2 శాతం తగ్గి బ్యారెల్‌కు 64.91 డాలర్ల వద్ద, అగష్టు డబ్యూటీఐ ప్యూచర్‌ ధరలు 0.4 శాతం తగ్గి బ్యారెల్‌కు 58.84  డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Most from this category