News


సెన్సెక్స్‌ తక్షణ మద్దతుశ్రేణి 39,920–39,800

Monday 4th November 2019
Markets_main1572837356.png-29313

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరోదఫా వడ్డీ రేట్లను తగ్గించడం, అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదిరే అవకాశాలు మెరుగుపడటంతో అమెరికా, బ్రెజిల్‌ సూచీలు కొత్త రికార్డుల్ని అందుకోగా, పలు యూరప్, ఆసియా సూచీలు నెలల గరిష్టస్థాయికి పెరిగాయి. ఈ ట్రెండ్‌తో పాటు  అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ ఫండ్స్‌ కలిసికట్టుగా  కొనుగోళ్లు జరుపుతున్న కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇప్పటికే కొత్త రికార్డు స్థాయిని చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రికార్డు గరిష్టస్థాయికి మరో 1.8 శాతం దూరంలో వుంది. కొద్దినెలలుగా ఎన్‌పీఏలు, కార్పొరేట్‌ డిఫాల్ట్‌లు వంటి ప్రతికూలాంశాలతో సతమతమవుతున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ షేర్ల వెయిటేజి ఎక్కువగా వున్నందున, నిఫ్టీ...సెన్సెక్స్‌కంటే వెనుకబడి వుంది. వచ్చే కొద్దిరోజుల్లో నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని నమోదుచేయలేకపోతే...మార్కెట్లో స్వల్పకాలిక కరెక్షన్‌ జరగవచ్చు. నిఫ్టీ సైతం సెన్సెక్స్‌ను అనుసరించగలిగితే, రెండు నెలలపాటు మార్కెట్లో పెద్ద ర్యాలీని చూసే ఛాన్స్‌ వుంటుంది. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
నవంబర్‌1తో ముగిసిన వారంలో  సెన్సెక్స్‌ 40,392 పాయింట్ల స్థాయి వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు అంతక్రితం వారం ముగింపు (గత ఆదివారంనాటి మూరత్‌ ట్రేడింగ్‌ ముగింపు)తో పోలిస్తే   915 పాయింట్ల భారీలాభంతో 40,165 పాయింట్ల వద్ద ముగి
సింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలైతే సెన్సెక్స్‌ 40,400–40,500 పాయింట్ల శ్రేణి వరకూ పెరగవచ్చు.  ఈ స్థాయిపైన ముగిస్తే 40,700 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. అటుపైన క్రమేపీ 40,900 పాయింట్ల వరకూ పెరిగే ఛాన్స్‌ వుంటుంది.  ఈ వారం తొలి నిరోధస్థాయిని ఛేదించలేకపోయినా, బలహీనంగా మొదలైనా 39,920–39,800 శ్రేణి వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ శ్రేణిపైన స్థిరపడితే మార్కెట్‌ స్వల్పకాలంలో పెరిగే అవకాశాలుంటాయి. ఈ మద్దతుశ్రేణిని కోల్పోతే 39,500 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున  39,240 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. 

నిఫ్టీ తొలి మద్దతుశ్రేణి 11810-11,785....
గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  11.695 కీలక నిరోధస్థాయిపై ముగిసినంతనే వేగవంతమైన ర్యాలీ జరిపి 11,945 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 263 పాయింట్ల లాభంతో 11,890 పాయింట్ల వద్ద ముగిసింది. 11,980-12,100 పాయింట్ల మధ్య పలు సాంకేతిక అవరోధాలున్నందున, నిఫ్టీకి ఈ వారం కీలకమైనది.  ఈ సోమవారం నిఫ్టీ పెరిగితే 11,945-11,980 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన ముగిస్తే 12,040 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఆపైన 12,110 పాయింట్ల సమీపంలో కొత్త రికార్డును నెలకొల్పే ఛాన్స్‌ వుంటుంది. ఈ తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే నిఫ్టీ బలహీనపడి 11,810-11,785 పాయింట్ల వద్ద లభిస్తున్న తొలి మద్దతుశ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ లోపున ముగిస్తే 11,680 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 11,645 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు.  
 You may be interested

ఈ వారం రికమెండేషన్లు

Monday 4th November 2019

ఎస్‌బీఐ    కొనచ్చు  బ్రోకరేజ్‌ సంస్థ:- ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌  ప్రస్తుత ధర:- రూ.313 టార్గెట్‌ ధర:- రూ.390 ఎందుకంటే:- దేశంలో అతి పెద్ద వాణిజ్య బ్యాంక్‌ ఇదే. ఈ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ సైజు రూ.36 లక్షల కోట్లుగా, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.5 లక్షల కోట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 22 వేల బ్రాంచ్‌లతో 43 కోట్లకు పైగా ఖాతాదారులకు సేవలందిస్తోంది. యోనో యాప్‌తో డిజిటల్‌ స్పేస్‌లోనూ జోరు చూపిస్తోంది. గత రెండేళ్లుగా మార్జిన్లు అధికంగా

ఫలితాలు, గణాంకాలే నడిపిస్తాయ్‌..!

Monday 4th November 2019

హెచ్‌డీఎఫ్‌సి, టైటాన్, పీఎన్‌బీ, డాబర్, టెక్ మహీంద్రా,  టాటా స్టీల్, సన్ ఫార్మా, సిప్లా ఫలితాలు ఈవారంలోనే.. స్థూల ఆర్థికాంశాలపై మార్కెట్‌ దృష్టి ఒడిదుడుకులకు ఆస్కారం: సామ్కో సెక్యూరిటీస్‌ ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల వెల్లడి, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున ఈవారంలో వెల్లడికానున్న పలు

Most from this category