News


2022 నాటికి 50వేలకు సెన్సెక్స్‌!

Thursday 27th June 2019
Markets_main1561627823.png-26627

కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా
మోదీ ప్రభుత్వ పాలన మూడో ఏడుకు చేరేనాటికి సెన్సెక్స్‌ 50వేల పాయింట్లను చేరవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ నిపుణుడు రస్మిక్‌ ఓజా అంచనా వేశారు. బడ్జెట్‌ వరకు నిఫ్టీ అటుఇటు ఊగిసలాడుతూనే ఉంటుందన్నారు. ఒకవేళ నిఫ్టీ 12వేల పాయింట్లను చేరితే వాల్యూషన్ల పరంగా మరోమారు గత గరిష్ఠాలకు చేరువైనట్లవుతుందన్నారు. జూలై సీరిస్‌కు నిఫ్టీ పుట్స్‌ కొనుగోలు చేయడం ద్వారా పోర్టుఫోలియోలో లాంగ్స్‌ను హెడ్జ్‌ చేసుకోవచ్చని, బడ్జెట్లో అనూహ్య ప్రతిపాదనల కారణంగా నిఫ్టీ నెగిటివ్‌గా మారితే ఈ పుట్స్‌ రక్షిస్తాయని చెప్పారు. రాబోయే ఎర్నింగ్స్‌ సీజన్‌ స్వల్పంగా నిరాశపరిచే అవకాశాలున్నాయన్నారు. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్‌ అంచనాలు కొంతమేర తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. 
బ్యాంకులే బెటర్‌
రాబోయే రెండేళ్లకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు బాగుంటాయని, వీటి లాభాలు బాగా పెరుగుతాయని ఓజా అంచనా వేశారు. లాభాల పెరుగుదలతో వీటి ఆర్‌ఓఈ 15 శాతాన్ని దాటవచ్చని దీంతో వీటి వాల్యూషన్ల రీరేటింగ్‌ జరగవచ్చని అభిప్రాయపడ్డారు. బ్యాంకులతో పాటు ఎల్‌అండ్‌టీపై బుల్లిష్‌గా ఉన్నామన్నారు. భారీ ఆర్డర్లు పొదగలగడం, వాటిని సరిగ్గా పూర్తి చేయడంలో కంపెనీకి మంచి సామర్ధ్యం ఉందన్నారు. ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ షేరు సరసమైన వాల్యూషన్ల వద్ద ఉందని చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్స్‌ ఎర్నింగ్స్‌లో 18 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉండొచ్చన్నారు. మిడ్‌క్యాప్స్‌లో ఎన్‌సీసీ, హిమస్టింగా సీడ్‌ షేర్లను రికమండ్‌ చేశారు. సిమెంట్‌, చిన్న ఎన్‌బీఎఫ్‌సీలు, టెక్‌, చమురు, మెటల్‌ రంగాలకు ప్రస్తుతానికి దూరంగా ఉండాలని సూచించారు. You may be interested

లాభాల బాటలో టాటా మోటర్స్‌

Thursday 27th June 2019

అటోరంగ దిగ్గజం టాటా మోటర్స్‌ షేర్లు గురువారం 4.50శాతం లాభపడ్డాయి.అటో రంగ షేర్ల ర్యాలీలో భాగంగా నేడు ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.162.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 4.22శాతం ర్యాలీ చేసి రూ.167.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు(రూ.161.1)తో పోలిస్తే 3.20శాతం లాభంతో

బడ్జెట్‌లో పెద్ద సంస్కరణలు లేకపోవచ్చు

Thursday 27th June 2019

సంస్కరణల కొనసాగింపుల వైపు మొగ్గు చూపే అవకాశం పార్లమెంటులో ప్రధాని చేసిన ప్రసంగాన్ని గమనిస్తే బీజేపీ1 చేపట్టిన చర్చల్ని కొనసాగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తోందని, నీతీ ఆయోగ్‌ కూడా దీనినే ప్రతిబింబించిందని మార్కెట్‌ నిపుణులు సమీర్‌ నారయణ్‌ ఒక ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే.... చిన్న సమస్యల దిద్దుబటుకే మొగ్గు? బడ్జెట్‌ ఇంకో వారంలో రానుంది. కానీ బడ్జెట్‌పై ఎటువంటి అంచనాలు కానీ హైప్‌ కానీ

Most from this category