News


భారీ పతనానికి ఐదు కారణాలు

Thursday 22nd August 2019
Markets_main1566470976.png-27954

దేశియ బెంచ్‌మార్క్‌ సూచీలు వరుసగా మూడవరోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. మెటల్‌, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల పతనంతోపాటు, ఆర్థిక మందగమనంపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందడంతో గురువారం మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 587.44 పాయింట్లు లేదా 1.59 శాతం తగ్గి 36,472.93 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 180.95 పాయింట్లు లేదా 1.67 శాతం తగ్గి 10,737.75 వద్ద ముగిశాయి. కాగా మార్కెట్‌ పతనానికి కారణమైన ఐదు అంశాలు...

ఉద్దీపనంపై ప్రభుత్వం కట్టుబడి ఉండకపోవడం: 
ఆర్థిక మందగమనాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజిని ప్రకటిస్తుందని ఇన్వెస్టర్లు వేచిచూస్తుండగా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడం మార్కెట్లను నిరాశపరిచింది. దీనితోపాటు ప్రధాన ఉద్దీపన ప్యాకేజి అవకాశాలను ప్రభుత్వ చీప్‌ ఎకనామిక్‌ అడ్వజర్‌ క్రిష్ణమూర్తి సుబ్రమణ్యం తోసిపుచ్చడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతింది. ‘లాభం ప్రైవేట్‌, నష్టాలు పబ్లిక్‌’ అనే విధానం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన అనడం గమనార్హం.

అంతర్జాతీయ పరిణామాలు:
ప్రపంచ ఆర్థిక మందగమనంపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందడంతో అంతర్జాతీయ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. ఈ ప్రభావం కూడా ఇండియాపై పడింది. యుఎస్‌ వడ్డీ రేట్ల దృక్పథంపై అనిశ్చితి వలన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. జపాన్ వెలుపల ఆసియా-పసిఫిక్ షేర్ల ఎంఎస్‌సీఐ విస్తృత సూచీ 0.5 శాతం పతనమయ్యింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మినిట్స్‌ వలన యూరోపియన్‌ మార్కెట్‌ల సెంటిమెంట్‌ బలహీనపడింది.  కొత్తగా మానిటరీ పాలసీని సులభతరం చేయడం కంటే గత నెలలో తగ్గించిన వడ్డీ రేట్లను పునర్‌పరిశీలించడానికి పాలసీ తయారీదారులు మొగ్గుచూపుతున్నారని రిజర్వ్‌ బ్యాంక్‌ మినిట్స్‌ తెలపడంతో యూరొపియన్‌ స్టాకులు నష్టపోయాయి.

ఆర్థిక మందగమనం: 
జూన్‌ క్యార్టర్‌లో ఆదాయం, లాభాల పరంగా వృద్ధి మందగమనాన్ని ప్రకటించిన కంపెనీలు, ఆర్థిక మందగమనం వలన మరింత నష్టపోతాయని కేర్‌ రేటింగ్స్‌ చెప్పడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మరింత దెబ్బతింది. కాగా ఇండియా కార్పొరేట్ల నికర అమ్మకాల వృద్థి జూన్‌ క్వార్టర్‌లో 4.6 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ వృద్ధి 13.5 శాతంగా నమోదుకావడం గమనార్హం. అదేవిధంగా నికర లాభాల వృద్ధి ఈ త్రైమాసికంలో 6.6 శాతం ఉండగా, గత ఏడాది ఇదే సమయానికి 24.6 శాతంగా ఉంది.

ఫెడ్‌ కామెంట్స్‌ ముందు ఇన్వెస్టర్ల జాగ్రత్త:
 అమెరికా వ్యోమింగ్‌లోని జాక్సన్ హోల్‌ సింపోజియంలో ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానించనుండటంతో ఇన్వెస్టర్లు దీనిపై దృష్ఠి సారించనున్నారని విశ్లేషకులు తెలిపారు. ఈ సమావేశం తర్వాత యుఎస్‌ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌ ఇచ్చేందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ మరొక సారి వడ్డీ రేట్లను తగ్గిస్తుందా?లేదా? అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

రూపీ బలహీనత: 
దేశియ మార్కెట్‌ నుంచి విదేశి నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగుతుండడంతో గురువారం రూపీ డాలర్‌ మారకంలో భారీగా పడిపోయింది. ఈ రోజు ఇంట్రాడేలో రూపీ డాలర్‌ మారకంలో 42 పైసలు బలహీనపడి 71.97 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా బుధవారం సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో 71.55 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.

నిపుణుల విశ్లేషణ: 
ఆసియా మార్కెట్‌లు, యుఎస్ ఫ్యూచర్స్ ఫ్లాట్‌గా ఉన్నప్పటికి భారత మార్కెట్‌ మాత్రం గత కొన్ని రోజుల నుంచి నష్టాల్లోనే ముగుస్తోంది. బడ్జెట్‌లో విధించిన సర్‌చార్జీ నుంచి ఎఫ్‌పీఐలను మినహాయింపునిచ్చే చర్యలపై స్పష్టత కోసం మార్కెట్‌ ఎదురుచూస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించనున్న ఉద్దీపన ప్యాకేజీపై మార్కెట్ కొంత అసహనంగా ఉంది. దీనికితోడు కొంతమంది ప్రభుత్వ అధికారులు, ఉద్దీపన ప్యాకేజి ఉండదని వ్యాఖ్యానించడంతో మార్కెట్‌కు ఆర్థిక ప్యాకేజిపై ఆశలు తగ్గాయి. కాగా మార్కెట్‌ సమీప కాలంలో కొంత బలహీనత ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికి ఆర్థిక సంవత్సరం 2020 రెండవ త్రైమాసికంలో మార్కెట్‌ కోలుకుంటుందని అంచనావేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. You may be interested

స్టాక్స్‌ను మళ్లీ ఈ ధరల్లో చూడలేం...?

Friday 23rd August 2019

మార్కెట్లకు క్షీణ దశ ముగుస్తున్నట్టేనన్నారు ప్రముఖ నిపుణులు, కార్నెలియన్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు వికాస్‌ఖేమాని. వచ్చే మూడు నాలుగు నెలల కాలం మంచి షేర్ల కొనుగోలుకు అనుకూల సమయంగా సూచించారు. రికవరీ అన్నది మొదలైతే మళ్లీ ఈ ధరల్లో స్టాక్స్‌ లభించవన్న విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్లకు సంబంధించిన అంశాలపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.    ‘‘ఆర్థిక రంగంలో కదలికకు ప్రభుత్వం వంతుగా ఎంతో చేస్తుందని ఆశించొచ్చు. నాలుగు విడతలుగా రేట్ల

సెన్సెక్స్‌ 587 పాయింట్లు, నిఫ్టీ 181 పాయింట్లు క్రాష్‌

Thursday 22nd August 2019

సెన్సెక్స్‌ నష్టం  587 పాయింట్ల 10750 దిగువకు ముగిసిన నిఫ్టీ  జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు దేశీయ మార్కెట్‌ను మరోసారి భారీగా దెబ్బతీసాయి. ఆర్థిక వృద్ధి మందగమనానికి ఉద్దీపన చర్యలేవి ఉండవని కేంద్రం నుంచి స్పష్టత రావడం, డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది కనిష్టానికి పతనం కావడం, క్యూ1లో దేశీయ నికర అమ్మకాల వృద్ధి క్షీణించడం, రేపు  జాక్సన్‌ హోల్‌ వేదికగా ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగం

Most from this category