News


నిప్టీ 75, సెన్సెక్స్‌ 240 పాయింట్లు పతనం!

Thursday 10th October 2019
Markets_main1570698518.png-28804

  యుఎస్‌-చైనా మధ్య జరిగిన డిప్యూటీ స్థాయి చర్చలలో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడంతో పాటు వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్‌ వచ్చిన చైనా ప్రతినిధులు షెడ్యుల్‌కి ముందే యుఎస్‌ను వీడనున్నారనే వార్తలు వెలువడడంతో గురువారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అదేవిధంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కదులుతున్నాయి. దీనికి తోడు ఆర్థిక సంవత్సరం 2020 రెండవ త్రైమాసికానికి సంబంధించి కార్పోరేట్‌ ఫలితాల ఒత్తిడి, బ్యాంకింగ్‌ షేర్లు దిద్దుబాటుకు గురికావడం వంటి అంశాలు కూడా మార్కెట్లు నష్టపోడానికి కారణంగా ఉన్నాయి. మధ్యాహ్నాం 2.25 సమయానికి నిఫ్టీ 50 73.45 పాయింట్లు నష్టపోయి 11,239.85 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 248.10 పాయింట్లు నష్టపోయి 37,929.85 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఉండడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 742.50 పాయింట్లు నష్టపోయి 28,043.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 
  నిఫ్టీ 50 లో లాభపడిన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌(4.33 శాతం), రిలయన్స్‌(2.88 శాతం), గ్రాసిమ్‌(2.84), హిందుస్థాన్‌ యూనిలీవర్‌(1.23 శాతం), సన్‌ఫార్మా(1.19 శాతం) షేర్లు ముందున్నాయి. అదే విధంగా యెస్‌ బ్యాంక్‌(5.78 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(3.34 శాతం), గెయిల్‌(2.99 శాతం), టాటా మోటార్స్‌(2.89 శాతం), ఎస్‌బీఐ(2.66 శాతం) నష్టపోయిన షేర్లలో ముందున్నాయి.



You may be interested

ఇండియా వృద్ధి అంచనాలు తగ్గించిన మూడీస్‌

Thursday 10th October 2019

మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సంస్థ తాజాగా భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది. 2019-20 సంవత్సరానికి జీడీపీ అంచనాను 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పెట్టుబడుల ఆధారిత మందగమనం విస్తతృం కావడం, ఇది క్రమంగా వినిమయ మందగమనానికి దారితీయడం, తత్ఫలితంగా గ్రామీణ కుటుంబాల్లో ఆర్థిక ఒత్తిళ్లు పెరగడం, బలహీనమైన ఉపాధి కల్పన జరగడం వంటి కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నట్లు వివరించింది. మందగమనానికి కారణాలు

ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ 18% పతనం!

Thursday 10th October 2019

 గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో  లక్ష్మీ విలాస్‌ బ్యాంకు(ఎల్‌వీబీ)ను విలీనం చేసే ప్రతిపాదనలకు ఆర్‌బీఐ అనుమతి నిరాకరించడంతో గురువారం ట్రేడింగ్లో ఈ రెండు సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 12.51 సమయానికి ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 18.02 శాతం నష్టపోయి రూ. 196.60 వద్ద ట్రేడవుతోంది. కాగా లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ 4.82 శాతం నష్టపోయి రూ. 25.65 వద్ద లోయర్‌ సర్యూట్‌ ఫ్రీజ్‌

Most from this category