News


11800ల దిగువకు నిఫ్టీ

Friday 28th June 2019
Markets_main1561718482.png-26667

మార్కెట్‌ వారంతాన్ని నష్టాలతో ముగించింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకు, మెటల్‌ షేర్ల పతనంతో సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 192 పాయిం‍ట్లను కోల్పోయి 39,394.64 వద్ద, నిఫ్టీ 52.60 పాయింట్లు నష్టపోయి 11800ల దిగువన 11,789 వద్ద స్ధిరపడ్డాయి. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ నష్టాల ముగింపు. నేటి నుంచి ప్రారంభం కానున్న జీ 20 సమావేశంలో ట్రంప్‌, జిన్‌పింగ్‌లు తమ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాలకు పరిష్కార మార్గాలను కనుక్కోవచ్చనే ఆశావాహనంతో నేడు దేశీయ మార్కెట్‌ లాభంతో ప్రారంభమైంది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే మెటల్‌, బ్యాంకింగ్‌, అటో షేర్లలో అమ్మకాలు మొదలవడంతో సూచీల ఆరంభ లాభాలు ఆవిరియ్యాయి. అప్పటి నుంచి సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. వచ్చే వారంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుండటం, కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాల విడుదల కానుండటం, జీ 20 సమావేశంలో ట్రంప్‌, జిన్‌పింగ్‌లు చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. నిఫ్టీ 11,775.50-11,871.70 రేంజ్‌లో కదలాడగా, సెన్సెక్స్‌ 39,675-39,362 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఇంట్రాడేలో ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఎఫ్‌ఎంజీసీ, రియల్టీ రంగ షేర్లు లాభపడగా, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా మెటల్‌ షేర్లు నష్టపోయాయి. ప్రైవేట్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ ఇండెక్స్‌ 164 పాయింట్లు నష్టపోయి 31,105.20    వద్ద స్ధిరపడింది. సూచీలు వరుస మూడు వారాల నష్టాల ముగింపు తరువాత ఈ వారంలో  స్వల్పంగా లాభాలను ఆర్జించుకోగలిగాయి. 

ఇండస్‌ ఇండ్‌, కోల్‌ ఇండియా, ఇన్ఫ్రాటెల్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, అదానీపోర్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, గెయిల్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. You may be interested

మూడేళ్లలో రెట్టింపైన హెచ్‌యూఎల్‌.. ఇంకా ఎంత?

Friday 28th June 2019

హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ కంపెనీలో మూడేళ్ల క్రితం ఇన్వెస్ట్‌ చేసి, ఇప్పటికీ ఆ పెట్టుబడిని కొనసాగించిన ఇన్వె‍స్టర్లకు రెట్టింపు ప్రతిఫలం దక్కినట్టే. మూడేళ్లలో ఈ షేరు 106 శాతం పెరిగింది. 2016 జూన్‌ 27న ఈ షేరు ధర రూ.859.80. తాజా ధర రూ.1787.30. కానీ, ఇదే కాలంలో సెన్సెక్స్‌ 50 శాతమే పెరగ్గా, నిఫ్టీ 46 శాతం రాబడినిచ్చింది. సూచీలకు మించి ఈ కంపెనీ దిగ్గజ రాబడులను ఇచ్చినట్టు.

గ్రామీణ ఆర్ధికం మెరుగుపడితేనే వృద్ధి: డాబర్‌ సీఈఓ

Friday 28th June 2019

బడ్జెట్‌ రాయితీలు, రుతుపవనాలతో గ్రామీణ ఆర్థికం పుంజుకొంటుంది ఈ త్రైమాసికం గత త్రైమాసికం కన్నా మెరుగ్గా ఉంటుంది లిక్విడిటీ సమస్య పరిష్కారం అవుతోంది మార్కెట్‌ వాటా పెరిగితే కొత్త కొత్త ఆవిష్కరణలను ఆరోగ్య రక్షణ రంగంలో తీసుకొచ్చి వృద్ధిని సాధిస్తామని డాబర్‌ ఇండియా సీఈఓ మోహిత్‌ మల్హోత్రా ఒక ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితేనే... గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏర్పడిన మందగమనానికి

Most from this category