News


సెన్సెక్స్‌కు 41,060 మద్దతు కీలకం

Monday 27th January 2020
Markets_main1580092514.png-31211

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ సరళతర విధానాల ఫలితంగా ఏడాదికాలంగా ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లు 20-30 శాతం వరకూ పరుగులు తీశాయి. కానీ ఆ పరుగులో వెనుకబడ్డ భారత్‌ మార్కెట్‌కు (13 శాతం ర్యాలీయే..అందులో 10 శాతం కార్పొరేట్‌ టాక్స్‌ కట్‌ ఫలితమే) కీలకమైన బడ్జెట్‌వారం వచ్చేసింది. జీడీపీ వృద్ధి క్షీణత, వినియోగ డిమాండ్‌ తగ్గుదల, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాల కారణంగా సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రతిపాదనల్ని వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టగలుగుతారా? పన్ను వసూళ్ల తగ్గుదలతో పాటు డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని అందుకోలేకపోవడంతో ద్రవ్యలోటు పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో...బడ్జెట్లో ఆర్థికాభివృద్ధి కోసం ఎటువంటి ఉద్దీపన చర్యలుంటాయనేది ఆసక్తిదాయకం. మధ్యకాలిక మార్కెట్‌ట్రెండ్‌కు ఆ ప్రతిపాదనలే కీలకమవుతాయి.  ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
జనవరి 24తో ముగిసిన వారంలో తొలిరోజున బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 42,273 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పిన అనంతరం తీవ్ర అమ్మకాలకు ఒత్తిడికి లోనై 41,059 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. అటుతర్వాత నష్టాల్లో కొంతవరకూ రికవరీ చేసుకున్నప్పటికీ, చివరకు  అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 332 పాయింట్ల నష్టంతో 41,613 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో శనివారం బడ్జెట్‌ ప్రతిపాదనలు వెలువడనున్న నేపథ్యంలో... గతవారపు 41,060కనిష్టస్థాయి వద్ద లభించబోయే మద్దతు ఈ వారం కీలకం. ఎందుకంటే అదే స్థాయి నుంచి అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో మార్కెట్‌ కోలుకుంది. ఇక సెన్సెక్స్‌కు 41,400- 41,270 పాయింట్ల శ్రేణి తక్షణ మద్దతునివ్వవచ్చు. 41,060 పాయింట్ల స్థాయిని అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో కోల్పోతే వేగంగా 40,710 పాయింట్లస్థాయికి, ఆ లోపున 40,330 పాయింట్ల వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ వారం ప్రధమార్థంలో తొలి మద్దతుశ్రేణిని పరిరక్షించుకున్నా, పాజిటివ్‌గా ప్రారంభమైనా 41,700-41,850 పాయింట్ల శ్రేణి తొలుత నిరోధించవచ్చు. ఈ శ్రేణిని అధిగమిస్తే తిరిగి 42,270 పాయింట్ల రికార్డుస్థాయిని పరీక్షించవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 42,550 పాయింట్ల వరకూ పెరగవచ్చు. 

నిఫ్టీకి కీలక మద్దతు 12,090

గత సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 12,430 పాయింట్ల కొత్త రికార్డుస్థాయిని చేరిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, వెనువెంటనే పతనబాటను పట్టి 12,090 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ఆ స్థాయి నుంచి కొంత కోలుకున్నప్పటికీ, అంతక్రితం వారంతో పోలిస్తే 104 పాయింట్ల నష్టంతో 12,248 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో బడ్జెట్‌ సమర్పణ,  ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్ల సందర్భంగా మార్కెట్‌ హెచ్చుతగ్గులకు లోనైతే నిఫ్టీకి 12,090 పాయింట్ల మద్దతుస్థాయి కీలకం. ఈ మధ్యలో తొలుత 12,190-12,150 పాయింట్ల శ్రేణి తక్షణ మద్దతును అందించవచ్చు. ఇక 12,090 మద్దతుస్థాయిని కోల్పోతే...వేగంగా 11,980 పాయింట్ల వద్దకు, ఆ లోపున 11,880 పాయింట్ల స్థాయికి పతనం కావొచ్చు. ఈ వారం ప్రారంభంలో తొలి మద్దతుశ్రేణిని పరిరక్షించుకుంటే 12,280-12,320 పాయింట్ల నిరోధశ్రేణి వద్దకు చేరవచ్చు. అటుపైన  క్రమేపీ 12,430 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 12,510 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం వుంటుంది. You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.4,670 కోట్లు

Monday 27th January 2020

(అప్‌డేటెడ్‌...) రెండు రెట్లు వృద్ధి  కలసివచ్చిన ఎస్సార్‌ స్టీల్‌ రుణ రివకరీ  నిర్వహణ లాభం 23 శాతం అప్‌  ముంబైఐ ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.1,874 కోట్లుగా  ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఈ క్యూ3లో రూ.4,670 కోట్లకు పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ఎస్సార్‌ స్టీల్‌ రుణాలు రికవరీ కావడం, కీలక ఆదాయం పెరగడం దీనికి

ప్రీ-బడ్జెట్ అంచనాలు, క్యూ3 ఫలితాలే నడిపిస్తాయ్‌..

Monday 27th January 2020

ఈవారంలోనే జనవరి సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు  శనివారం కేంద్ర బడ్జెట్.. ఆ రోజూ పని చేయనున్న మార్కెట్‌ ఎస్‌బీఐ, ఐటీసీ, హెచ్‌యూఎల్, మారుతి సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, టాటా మోటార్స్ ఫలితాలు మంగళ, బుధవారాల్లో అమెరికా ఎఫ్‌ఓఎంసీ సమావేశం న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి కేంద్ర బడ్జెట్ ప్రకటనపై మార్కెట్‌ వర్గాలు కొండంత ఆశతో ఉన్నాయి. నీరసించిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి వృద్ధిని గాడిన

Most from this category