News


కీలక మద్దతు 38,820-38650

Tuesday 28th May 2019
Markets_main1559029958.png-25960

మార్కెట్‌ అంచనాల్ని మించి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో భారత్‌ సూచీలు సరికొత్త రికార్డుల్ని సృష్టించడంతో పాటు కొత్త గరిష్టస్థాయిల వద్ద ముగిసాయి. కానీ నరేంద్ర మోది నేతృత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రభావం ఇప్పటివరకూ మార్కెట్లో పెద్దగా కన్పించలేదనే చెప్పాలి. గత నెలరోజుల్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనై, సూచీలు సాధించింది కేవలం 1 శాతం వృద్ధి మాత్రమే. ఇక నుంచి కొత్త ప్రభుత్వం చేపట్టబోయే చర్యలపై అంచనాలే మార్కెట్‌ను నడిపించే అవకాశం వుంటుంది. మరోవైపు అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌ వార్‌ రిస్క్‌ మార్కెట్లపై వుండనే వుంటుంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ర్యాలీ భారీగా వుండకపోవొచ్చన్న అభిప్రాయాల్ని పలువురు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక  సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
మే 24తో ముగిసినవారం తొలిరోజైన సోమవారం ఎగ్జిట్‌పోల్స్‌ ఎఫెక్ట్‌తో భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరో రెండు రోజులు ర్యాలీని కొనసాగించి...గురువారం లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయంలో  40,125 పాయింట్ల స్థాయి వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. అటుతర్వాత జరిగిన లాభాల స్వీకరణ కారణంగా కొంత క్షీణించినప్పటికీ, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,504 పాయింట్ల భారీలాభంతో 39,435 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గత వారం ద్వితీయార్థంలో నెలకొన్న తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో సెన్సెక్స్‌ 38,820-38650 పాయింట్ల శ్రేణి కీలక మద్దతును అందించినందున, సమీప భవిష్యత్తులో ఈ మద్దతు శ్రేణి ముఖ్యమైనది. ఈ వారం లాభాల స్వీకరణ కొనసాగితే తొలుత తొలుత 39,250 పాయింట్ల స్థాయి మద్దతునివ్వవచ్చు. ఆ లోపున పైన ప్రస్తావించిన శ్రేణి వద్దకు తగ్గవచ్చు. అయితే ఆ శ్రేణిని పరిరక్షించుకోలిగితే....సెన్సెక్స్‌ మరిన్ని కొత్త రికార్డుల్ని నెలకొల్పే ఛాన్స్‌ వుంటుంది. ఆ మద్దతుశ్రేణి లోపున 38,570 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ వారం అప్‌ట్రెండ్‌ కొనసాగితే 39,780 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలగవచ్చు. అటుపై తిరిగి 40,125 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఆ స్థాయిపైన 40,300 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం వుంటుంది. 

నిఫ్టీ కీలక మద్దతు శ్రేణి 11,650-11,615
గతవారం ప్రధమార్థంలో 12,041 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 437 పాయింట్ల భారీ లాభంతో 11,844 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం లాభాల స్వీకరణతో కొనసాగితే నిఫ్టీకి 11,780 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే లభించబోయే 11,650-11,615 పాయింట్ల మద్దతుశ్రేణి కీలకం. రానున్న రోజుల్లో ఈ మద్దతుశ్రేణిని పరిరక్షించుకోగలిగే నిఫ్టీ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం వుంటుంది. పైన ప్రస్తావించిన మద్దతుశ్రేణి దిగువన 11,580 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ వారం అప్‌ట్రెండ్‌ కొనసాగితే తొలుత 11,955 పాయింట్లస్థాయిని అందుకోవొచ్చు. అటుపై తిరిగి 12,040 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఆపైన 12,100 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. 



You may be interested

ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ను ఎలా ఎంచుకోవాలి ?

Tuesday 28th May 2019

ప్ర: ఇన్వెస్ట్‌మెంట్‌కు బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ మంచి సాధనమని, బ్యాలన్స్‌డ్‌  ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు వస్తాయని ఫ్రెండ్స్‌ ఊదరగొట్టడంతో నేను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టాను.  కానీ ఈ ఫండ్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఫండ్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వెనక్కి తీసుకొని వేరే కేటగిరీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? -రవి, విజయవాడ  జ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Tuesday 28th May 2019

43 శాతం తగ్గిన మదర్సన్‌సుమీ లాభం న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ మదర్సన్‌ సుమీ సిస్టమ్స్‌ ఫలితాల విషయంలో నిరుత్సాహపరిచింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ లాభం రూ.43 శాతానికి పైగా క్షీణించి రూ.429 కోట్లకు పరిమితం అయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.757 కోట్లుగా ఉంది. ఆదాయం మాత్రం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.15,407 కోట్ల నుంచి రూ.17,169 కోట్లకు వృద్ధి చెందింది.

Most from this category