News


సెన్సెక్స్‌ ప్రధాన మద్దతు 26,714 పాయింట్లు

Monday 23rd March 2020
Markets_main1584932072.png-32622

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను జీరో స్థాయికి తగ్గించినప్పటికీ, గతవారం అటు అమెరికా గానీ, ఇటు ఇండియాగానీ 12 శాతం మార్కెట్‌ నష్టాన్ని చవిచూసాయి. ఈ తరుణంలో శుక్రవారం మన మార్కెట్‌ ముగిసిన తర్వాత...షార్ట్‌ సెల్లింగ్‌పై నియంత్రణలు విధిస్తున్నట్లు సెబి ప్రకటించింది. ఇటువంటి నియంత్రణలు ఏ దేశంలోనూ సానుకూల ప్రభావాన్ని చూపించిన దాఖలాలు లేవు. 2001లో ఇండియాలో కూడా షార్ట్‌ సెల్లింగ్‌ని నిషేదించిన తర్వాతి రోజుల్లో స్టాక్‌ సూచీలు 15 శాతం వరకూ పడిపోయాయి. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ అయిన యాపిల్‌ షేరుగానీ, ఇండియాలో విలువైన కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గానీ నెలరోజుల్లోనే 40,50 శాతం పతనమైన తీరును చూస్తుంటే...అంతటి షేర్ల భారీ పతనానికి కారణం షార్ట్‌ సెల్లింగ్‌ ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు. కరోనావైరస్‌ వ్యాప్తి ప్రభావంతో ఆయా కంపెనీల లాభాలు వచ్చే రెండు, మూడు క్వార్టరల్లో పుంజుకోవన్న భయాలు తలెత్తినందున ఇన్వెస్టర్లు తెగనమ్మడమే ఈ షేర్ల పతనానికి కారణం. అయితే షార్ట్‌ సెల్లింగ్‌పై నియంత్రణలు వుంటే... షార్ట్‌ కవరింగ్‌ ద్వారా ఇటువంటి పెద్ద కంపెనీల షేర్లు వేగంగా కోలుకునే అవకాశం వుండదు.   ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు  ఇలా వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
మార్చి20తో ముగిసినవారంలో 26,714 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 4,187 పాయింట్ల  పాయింట్ల భారీనష్టంతో 29,916  పాయింట్ల వద్ద ముగిసింది.  వరుసగా రెండు వారాల్లో దాదాపు 7,500 పాయింట్ల పతనం సంభవించింది.  ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో సెన్సెక్స్‌ మొదలైతే తొలుత 27,930 పాయింట్ల వద్ద చిన్నపాటి  మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు కోల్పోతే తిరిగి 26,714 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 25,550 పాయింట్ల వరకూ పడిపోవొచ్చు. ఈ వారం రెండో  మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా, పాజిటివ్‌గా మొదలైనా 30,420 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 31.101 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని  సైతం ఛేదిస్తే 32,658 పాయింట్ల వరకూ రిలీఫ్‌ర్యాలీ జరిగే అవకాశం వుంటుంది. 

 నిఫ్టీ కీలక మద్దతు 7,830 పాయింట్లు...

క్రితంవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,830 పాయింట్ల వరకూ పతనాన్ని కొనసాగించి, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,210  పాయింట్ల భారీ నష్టంతో 8,745 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ వారం నిఫ్టీ  గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైతే 8,175 పాయింట్ల వద్ద తొలుత మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే గతవారపు కనిష్టస్థాయి అయిన 7,830 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. ఈ  లోపున వేగంగా 7,420 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగినా, పాజిటివ్‌గా మొదలైనా నిఫ్టీ 8,880 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.  అటుపైన ముగిస్తే 9,130 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన 9,590 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. 



You may be interested

క్వాంట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 23rd March 2020

ప్ర: మార్కెట్‌ ప్రస్తుతం పతన బాటలో ఉంది కదా ! ఈ సమయంలో కూడా మ్యూచువల్‌ ఫం‍డ్స్‌లో సిప్‌లు కొనసాగించాలా ?  జ: మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పటికీ, బుల్‌ రన్‌లో ఉన్నప్పటికీ, మ్యూచువల్‌ ఫం‍డ్స్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) కొనసాగించడమే ఉత్తమం. బుల్‌ రన్‌ కానీ, మార్కెట్‌ పతనం కానీ ఎప్పుడు ఆగిపోతాయో ఎవరూ అంచనా వేయలేరు. ఉదాహరణకు 2,003 నుంచి 2007 వరకూ బుల్‌రన్‌ కొనసాగింది. సెన్సెక్స్‌ 2,800

మూడేళ్ల కనిష్టస్థాయికి ఏటీఎఫ్‌ ధరలు

Monday 23rd March 2020

12 శాతం తగ్గుదల న్యూఢిల్లీ: విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర 12 శాతం తగ్గింది. కోవిడ్–19 (కరోనా వైరస్) పాజిటివ్ నిర్థరణ కేసులు పెరిగిపోతుండడం, ఈ వైరస్‌ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్‌ ధరను కిలోలీటర్‌కు రూ. 6,688 మేర తగ్గించినట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో కిలోలీటర్‌ ధర

Most from this category