News


సెన్సెక్స్‌ కీలక శ్రేణి 41,420-40,610

Monday 24th February 2020
Markets_main1582511704.png-32017

కరోనావైరస్‌ వ్యాప్తి పట్ల మార్కెట్‌ శక్తుల్లో నెలకొన్న అయోమయం కారణంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లు గతంలో ఎన్నడూ లేని కొత్త ట్రెండ్‌ను ఆవిష్కరిస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లు, బంగారం, అమెరికా బాండ్లు, డాలరు- ఈ నాలుగూ మూకుమ్మడిగా పెరగడం ఇప్పటివరకూ ఏ సంక్షోభ సమయంలోనూ, మరే సానుకూల ఆర్థిక వాతావరణలోనూ జరగలేదు. మరోవైపు విపత్తుల సందర్భంగా ఇన్వెస్టర్లు సురక్షితంగా భావించే జపాన్‌ కరెన్సీ యెన్‌, ఆ దేశపు బాండ్లు ఈ దఫా క్షీణించడం విశేషం. ఈ కొత్త ఫైనాన్షియల్‌ ట్రెండ్‌...స్టాక్‌ మార్కెట్లను ఏవైపు నడిపిస్తోందో, కొద్ది వారాలు చూస్తేగానీ అవగతం కాదు. ఇదిలా వుండగా, విదేశీ ఇన్వెస్టర్లు ఫిబ్రవరిలో ఇప్పటికే భారత్‌ మార్కెట్లోకి దాదాపు రూ. 23,000 కోట్లకుపైగా కుమ్మరించినందున, మార్కెట్లో డౌన్‌ట్రెండ్‌ వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి కన్పించడం లేదు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
ఫిబ్రవరి 20తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 41,420-40,610 పాయింట్ల శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనై,  చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 88 పాయింట్ల  స్వల్పనష్టంతో  41,170 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు వారాలుగా 3 శాతం శ్రేణి మధ్య ఒడిదుడుకులకు గురవుతున్న సెన్సెక్స్‌... ఈ వారం 41,420-40,610 పాయింట్ల శ్రేణిని ఎటువైపు ఛేదిస్తే, అటువైపు వేగంగా కదలవచ్చు. ఈ వారం సెన్సెక్స్‌కు తక్షణ మద్దతు 41,040 పాయింట్ల వద్ద లభిస్తుండగా, ఈ మద్దతును కోల్పోతే 40,610 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున ముగిస్తే వేగంగా 40,475-40,115 పాయింట్ల శ్రేణి వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే వెనువెంటనే 41,420 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే వేగంగా 41,700 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో దాటితే తదుపరి అప్‌ట్రెండ్‌సాధ్యపడి 42,000 పాయింట్ల మార్క్‌ను అందుకునే వీలుంటుంది. 

నిఫ్టీ 12,160-11,910 శ్రేణిని ఛేదిస్తేనే...

గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,160-11,908 పాయింట్ల శ్రేణి మధ్య ఊగిసలాడి, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 32 పాయింట్ల నష్టంతో 12,081 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు ట్రేడింగ్‌ శ్రేణిని ఈ వారం నిఫ్టీ ఎటు ఛేదిస్తే, అటు వేగంగా కదలవచ్చు. నిఫ్టీకి 12,030 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తుండగా, ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 11,910 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. ఈ స్థాయి దిగువన వేగంగా 11,780-11,750 పాయింట్ల శ్రేణి వరకూ పడిపోవొచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని నిఫ్టీ పరిరక్షించుకోగలిగితే, వెంటనే 12,160 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై క్రమేపీ 12,225 పాయింట్ల స్థాయి వరకూ పెరగవచ్చు.ఈ స్థాయిని సైతం అధిగమిస్తే 12,270-12,330 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. You may be interested

టెల్కోలకు ఊరటపై కేంద్రం దృష్టి

Monday 24th February 2020

టెలికం శాఖ అధికారుల అత్యవసర సమావేశం న్యూఢిల్లీ:   ఏజీఆర్‌ బాకీల భారంతో సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగానికి సత్వరం ఊరటనిచ్చే చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర టెలికం శాఖ, ఇతర కీలక శాఖల సీనియర్ అధికారులు ఆదివారం దీనిపై అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు గంటపైగా సాగిన సమావేశంలో నీతి ఆయోగ్‌, ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. టెలికం పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని

ఈ వారంలోనూ అస్థిరతలు కొనసాగొచ్చు..

Monday 24th February 2020

ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీ ట్రంప్‌ పర్యటనల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై అంచనాలు న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌ (ఎఫ్‌అండ్‌వో) ఫిబ్రవరి సిరీస్‌ ఈ వారంలోనే ముగియనుండడంతో మార్కెట్లో అస్థిరతలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 24, 25వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో కుదిరే డీల్స్‌ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించనున్నాయి. శుక్రవారం విడుదల అయ్యే జీడీపీ అంచనాలు,

Most from this category