News


రెండో రోజూ మార్కెట్‌.. బౌన్స్‌బ్యాక్‌

Wednesday 25th March 2020
Markets_main1585133107.png-32678

2009 తదుపరి ఇండెక్సుల హైజంప్‌

7 శాతం ఎగసిన సెన్సెక్స్‌, నిఫ్టీ
అదే బాటలో 8 శాతం లాభపడ్డ బ్యాంక్‌ నిఫ్టీ

ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి జోరందుకున్నాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా రెండో రోజు దూకుడు చూపాయి. సెన్సెక్స్‌ 1,862 పాయింట్లు(7 శాతం) జంప్‌చేసి 28,536 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 517 పాయింట్లు(7 శాతం) దూసుకెళ్లి 8318 వద్ద ముగిసింది. వెరసి 2009 తదుపరి ఒకే రోజు సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 7 శాతం పురోగమించాయి.  ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ సైతం 8 శాతంపైగా పెరగడం విశేషం!  కరోనా సమస్యను ఎదుర్కొని నిలిచేందుకు అమెరికా ప్రభుత్వం రూపొందిస్తున్న భారీ ప్యాకేజీపై అంచనాలతో  అమెరికా, ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లు ఒక్కసారిగా జోష్‌లోకొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మంగళవారం 1933 తదుపరి డోజోన్స్‌ ఏకంగా 11 శాతం దూసుకెళ్లింది. ఫలితంగా సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 8.5 శాతం దూసుకెళ్లాయి. ఈ బాటలో ఆటో. మీడియా, రియల్టీ, మెటల్‌, ఎఫ్ఎంసీజీ 4-2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, మారుతీ, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, బజాజ్‌ ఫిన్‌ 14-9 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇండస్‌ఇండ్‌, ఐవోసీ, కోల్‌ ఇండియా, విప్రో, గెయిల్‌, ఐటీసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఆటో, సిప్లా 3.3-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి.

యస్‌ బ్యాంక్‌ బోర్లా
డెరివేటివ్‌ కౌంటర్లలో నిట్‌ టెక్‌, మణప్పురం, ఐసీఐసీఐ ప్రు, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ముత్తూట్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఉజ్జీవన్‌, సెంచురీ టెక్స్‌, ఎల్‌అండ్‌టీ 25-13 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క యస్‌ బ్యాంక్‌ 16 శాతం కుప్పకూలగా.. సీఈఎస్‌సీ, పీఎన్‌బీ, కమిన్స్‌, కేడిలా హెల్త్‌, లుపిన్‌, జస్ట్‌ డయల్‌, ఎన్‌సీసీ, టీవీఎస్‌ మోటార్, ఏసీసీ 6.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1213 లాభపడగా.. 989 నష్టపోయాయి.


విక్రయాల బాటలోనే
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2153 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు)  రూ. 1554 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2989 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా..  డీఐఐలు రూ. 1082 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

క్వాలిటీ స్టాక్స్‌ కొనుగోలుకు మంచి సమయం

Wednesday 25th March 2020

ప్రస్తుత మార్కెట్‌ పతనంలో నాణ్యమైన కంపెనీలు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచి ఆలోచనగా లాడరప్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ ఎండీ రాఘవేంద్ర పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల ఆస్తుల్లో మార్పులు చేసుకోవాలని.. ఈక్విటీలకు మూడేళ్ల దృష్టితో మరింత కేటాయింపులు చేసుకోవాలని సూచించారు.   నాణ్యమైన స్టాక్స్‌ ఇప్పుడు ఎంతో చౌక ధరల్లో లభిస్తున్నాయని రాఘవేంద్ర అన్నారు. కనుక వాటిల్లో పెట్టుబడులకు ఇది చక్కని తరుణంగా పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు నాణ్యమైన

మూడోరోజూ లోయర్‌ సర్కూ‍్యట్‌ను తాకిన ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌

Wednesday 25th March 2020

వరుసగా మూడోరోజు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేరు లోయర్‌ సర్యూట్‌ను తాకింది. బుధవారం 10శాతం పతనంతో 472.60 వద్ద లోయర్ సర్కూ‍్యట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యింది.  కరోనా వైరస్‌ ప్రభావంతో రుణాలు తిరిగి వసూలు కాకపోవచ్చనే అంచనాలతో బ్యాంక్‌ వృద్ది తగ్గుముఖం పట్టవచ్చనే అందోళనలు షేరు పతనానికి కారణమవుతున్నాయి. 2017లో ఎక్సెంజ్‌లో లిస్ట్‌ అయిన ఈ బ్యాంక్‌ షేరు ఇప్పటిదాక ఇంతటి కనిష్టస్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. కాగా

Most from this category