News


సెన్సెక్స్‌.. రాకెట్‌ స్పీడ్‌

Friday 27th March 2020
Markets_main1585282658.png-32701

31,000 పాయింట్ల ఎగువకు
నిఫ్టీ 330 పాయింట్ల హైజంప్‌
అన్ని రంగాలూ లాభాల్లోనే
మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 3 శాతం అప్‌
సెన్సెక్స్‌ 1150 పాయింట్లు ప్లస్‌
ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌ దూకుడు


రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు జోరందుకున్నాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇండెక్సులు మరోసారి దూకుడు చూపుతున్నాయి. తొలుత సెన్సెక్స్‌  1150 పాయింట్లు దూసుకెళ్లి 31,105కు చేరింది. తద్వారా తిరిగి 31,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఆపై కాస్త వెనకడుగు వేసింది. 9.25 ప్రాంతంలో 910 పాయింట్లు జంప్‌చేసి 30,857 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క నిఫ్టీ 324 పాయింట్లు జంప్‌చేసింది. 8,966 వద్ద ముగిసింది.  వెరసి ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు సైతం మార్కెట్లు రిలీప్‌ ర్యాలీ బాటలో సాగుతున్నాయి. 

రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా..   ప్రయివేట్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ ఊపందుకోవడంతో బ్యాంక్‌ నిఫ్టీ 6.6 శాతం ఎగసింది. ఈ బాటలో  రియల్టీ, ఫార్మా,  ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ తదితరాలు 4.5-2 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌, ఇండస్‌ఇండ్‌ 15 శాతం దూసుకెళ్లగా..  బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూపీఎల్‌, ఐసీఐసీఐ, జీ, ఎల్‌అండ్‌టీ 9-6 శాతం మధ్య జంప్‌ చేశాయి. కేవలం ఎయిర్‌టెల్‌ 2 శాతం బలహీనపడింది.

బంధన్‌ భళా
డెరివేటివ్‌ కౌంటర్లలో పిరమల్‌, బంధన్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, కంకార్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, అశోక్‌ లేలాండ్‌, ఈక్విటాస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌ 15 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ మాత్రమే 2 శాతం నీరసించింది.  బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1112 లాభపడగా.. 180 మాత్రమే నష్టపోయాయి. రియల్టీ కౌంటర్లలో బ్రిగేడ్‌, మహీంద్రా లైఫ్‌, డీఎల్‌ఎఫ్‌,  ప్రెస్జేజ్‌,  గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, శోభాఇండియాబుల్స్‌, సన్‌ టెక్‌, ఫీనిక్స్‌ 10-3.5 శాతం మధ్య ఎగశాయి. 



You may be interested

నిత్యావసరాలకు మాత్రమే ఓకే..

Friday 27th March 2020

ఇతర ఆర్డర్లకు నో.. ఈ-కామర్స్ సంస్థల నిర్ణయం న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో నిత్యావసర ఉత్పత్తులే సరఫరా చేయాలని ఈ-కామర్స్ సంస్థలు భావిస్తున్నాయి. నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోరాదని నిర్ణయించుకున్నాయి. "నిత్యావసరాలు, హెల్త్‌కేర్‌, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కొనుగోలుదారులకు తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నాం. ఫ్యాషన్‌, మొబైల్‌, యాక్సెసరీస్‌, ఎలక్ట్రానిక్స్ తదితర నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా కొత్త ఆర్డర్లు తీసుకోబోము" అని పేటీఎం మాల్ ఒక

యథాప్రకారంగానే బ్యాంకుల విలీనం

Friday 27th March 2020

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సమస్యలు ఉన్నప్పటికీ .. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ప్రక్రియ యథాప్రకారంగానే కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి విలీనాలు అమల్లోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా బ్యాంకుల విలీనానికి డెడ్‌లైన్‌ పొడిగించే అవకాశముందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ .. "ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు"

Most from this category