News


మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే..!

Tuesday 11th February 2020
Markets_main1581405230.png-31690

ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం భారీ లాభంతో మెదలైంది. చైనాలో కరోనా వైరస్‌ వ్యాధితో మృతుల సంఖ్య రోజురోజూకూ పెరుగుతున్నప్పటికీ.., ఈ దేశంలో సోమవారం కొన్ని కంపెనీలు పునఃప్రారంభం కావడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు కొంత ఊరటను కలిగించింది. గతంలో సంభవించిన సార్స్‌ అంటువ్యాధి కంటే ఈ కరోనా వైరస్‌ వ్యాధితోనే ఎ‍క్కువ మంది మృత్యువాత పడ్డారు. చైనా అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు ఈ దేశంలో 1000 మంది మరణించినట్లు తెలుస్తోంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్లో కొనుగోళ్ల పర్వం కొనుసాగుతుండటంతో ప్రధాన సూచీలైన నిఫ్టీ ఇండెక్స్‌ 140పాయింట్లు పెరిగి 12,172.30 వద్ద, సెన్సెక్స్‌ 464 పాయింట్లు పెరిగి  41,444.34 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. 

ర్యాలీకి ప్రధాన కారణాలు:
1. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ:
అధిక వెయిటేజీ కలిగిన టెక్నాలజీ షేర్ల ర్యాలీతో నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిని అందుకుని లాభంతో ముగిశాయి. డోజోన్స్‌ ఇండెక్స్‌ 174.31 పాయింట్ల లాభం‍తో 29,276.82 వద్ద, ఎస్‌ అండ్‌ పీ ఇండెక్స్‌ 24.38 పాయింట్లు పెరిగి 3,352.09 వద్ద, నాస్‌ డాక్‌ ఇండెక్స్‌ 107 పాయింట్లు ర్యాలీ చేసి 9,628.39 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి ప్రభావంతో లూనార్‌ సెలవులను పొడిగించిన చైనా కంపెనీలు పునఃప్రారంభం కావడంతో ఆసియాలో ప్రధాన మార్కెట్లు నేడు లాభాల్లోకి మళ్లాయి. జపాన్‌ మార్కెట్‌ 1శాతం పెరగ్గా, చైనా మార్కెట్‌ షాంఘై కూడా దాదాపు 1శాతం లాభపడింది. 

2.తగ్గిన కరోనా వైరస్‌ వ్యాధి కేసులు:- 
చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి ఆదివారంతో పోలిస్తే సోమవారం కొద్దిగా తగ్గినట్లు చైనా వైద్య విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం 2,618 మంది ఈ వైరస్‌ బారిన పడగా, సోమవారం 2,097 మందికి వ్యాధి సోకినట్లు పేర్కోంది. అయితే మరణాలు మాత్రం పెరిగిందని ఇప్పటివరకు తమ దేశంలో మొత్తం 1016 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. వ్యాధి వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న తరణంలో అక్కడి పారిశ్రామిక, రోజువారీ కూలీలు తిరిగి తమ పనుల్లోకి వేళ్లేందుకు సిద్ధమయ్యారు. చైనాలోని ఐఫోన్‌ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ రెండు ప్లాంట్‌లో ఉత్పత్తులను తిరిగి ప్రారంభించింది. 

3. ఆర్‌బీఐ నుంచి మరో రిలీఫ్‌:- 

సీఆర్‌ఆర్‌ మినహాయింపుతో స్పెషల్‌ లోన్‌ విండో ఫిబ్రవరి 14 నుండి తెరిచి ఉంటుందని, ఈ సదుపాయం కింద పంపిణీ చేయబడిన రుణాలు వచ్చే ఐదేళ్ళకు సీఆర్‌ఆర్‌ మినహాయింపు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ సోమవారం తెలిపింది. అంతిమ వినియోగదారులకు ప్రయోజనాలను అందించడానికి, రుణ వృద్ధిని పెంచడానికి బ్యాంకులను ప్రోత్సహించే దిశగా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విభాగాలలో పెరుగుదల కూడా అంతర్లీన డిమాండ్ మీద ఆధారపడి ఉంటుందని బ్రోకరేజ్‌ సం‍స్థ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది.

4. 13నెలల కనిష్టానికి క్రూడాయిల్‌ ధరలు
కరోనా వ్యాధి వ్యాప్తితో అంతర్జాతీయంగా డిమాండ్‌ తగ్గి వృద్ధి మందగమన భయాలతో ఫిబ్రవరి 5వ తేది నాటిని ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు ఏకంగా 3శాతం నష్టాన్ని చవిచూశాయి. క్రూడాయిల్‌ ధర తగ్గుదల భారత్‌ లాంటి దేశాలకు కలిసొచ్చే అంశమని తెలిసిందే. జనవరి గరిష్ట స్థాయి నుంచి ముడిచమురు ధరలు ఏకంగా 25శాతం నష్టాన్ని చవిచూడటంతో 13 నెలల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  You may be interested

బజాజ్‌ కన్జూమర్‌కు క్యూ3 షాక్‌

Tuesday 11th February 2020

7.5 శాతం పతనమైన షేరు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరును ప్రదర్శించడంతో బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ లిమిటెడ్‌ కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బజాజ్‌ గ్రూప్‌లోని ఈ కంపెనీ షేరు భారీ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. నేలచూపులో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచాయి. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో ఈ

52 వారాల గరిష్టానికి  58 షేర్లు

Tuesday 11th February 2020

 మంగళవారం 52 వారాల గరిష్టానికి 58 షేర్లు పెరిగాయి. వాటిలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌, ఆదాని ఎంటర్‌ప్రైజెస్‌, ఏజీస్‌ నెట్‌వర్క్స్‌, అజంతా ఫార్మా, అపోలో పైప్స్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారత్‌ రసాయిన్‌, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, దివీస్‌ ల్యాబొరేటరీస్‌,  ఎసాబ్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, గెలాక్సీ సర్‌ఫ్యాక్టాన్స్‌, జీఎంఎం ఫడ్‌లర్‌, హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌, హెచ్‌ఎల్‌వీలు ఉన్నాయి. 52 వారాల

Most from this category