News


కొనుగోళ్లకు ఇది సరైన సమయం

Monday 9th March 2020
Markets_main1583752058.png-32374

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన కరోనా వ్యాధి వ్యాప్తి ఆందోళనలు ఇప్పుడు భారత్‌ మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 104దేశాల్లో లక్షకు పైగా ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడినట్లు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనేజేషన్‌ చెబుతోంది. పరిస్థితి మరింత దిగజారవచ్చనే భయాందోళలతో ఇన్వెస్టర్లు అప్రమత్త వహిస్తూ ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కితీసుకుంటున్నారు. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి 

ఈ ఏడాది జనవరిలో రికార్డు గరిష్టస్థాయిలను అందుకున్న భారత బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు 10శాతానికి పైగా నష్టాన్ని చవిచూశాయి. కాగా ఫ్రిబవరి నుంచి 7శాతానికి పైగా క్షీణించాయి. నష్టాల మారణహోమం కేవలం ఫ్రంట్‌లైనర్స్‌కు మాత్రమే కాకుండా మార్కెట్‌ విస్తృతస్థాయి మార్కెట్లలోనూ కొనసాగుతుంది. 

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు, రేటింగ్‌ సంస్థలు తమ ఆయాదేశాల ఆర్థిక వ్యవస్థలకు తమ రేటింగ్‌ను తగ్గిస్తున్న నేపథ్యంలో జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్‌ల గవర్నర్లు గత వారం కరోనావైరస్ వ్యాప్తి నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటామని ప్రకటించారు. ఈ అందులో భాగంగా ఉద్దీపన చర్యలతో పాటు వడ్డీరేట్లను సైతం తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

కరోనా వైరస్‌ ‘‘ఆందోళన’’ స్థాయి నుంచి ‘‘ప్రమాదం’’ స్థాయికి ఎదుగుతున్న తరణంలో ధీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు వాల్యూయేషన్లను ఆకర్షణీయంగా మార్చిందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీ పీఈఆర్‌ వ్యాల్యూయేషన్‌ 18రెట్ల సహేతిక స్థాయిలో కరెక‌్షన్‌ గురైంది. ఇది పదేళ్ల సగటు కూడా. ఐనప్పటికీ ఇది ఆకర్షణీయమైన జోన్‌ కాదు. కాబట్టి కరోనా వైరస్‌ బారి నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకున్న తరువాత మార్కెట్లు క్రమంగా, స్థిరంగా రికవరీ అవుతాయని టాటా మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ ఫండ్‌మేనేజర్‌ సునమ్‌ ఉదాసీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ....  గత పదేళ్లుగా ‘‘తగినంత తేలికైన ద్రవ్యత’’ ఈక్విటీ వాల్యుయేషన్లకు అధిక స్థాయిలో మద్దతు ఇచ్చిందని ఆయన తెలిపారు. 

లాంగ్‌టర్మ్‌లో ఇతర అసెట్‌ క్లాసెస్‌ కంటే  ఈక్విటీలు గణనీయంగా అవుట్‌ఫెర్‌ఫామ్‌ చేసాయి. అయితే బంగారం రికార్డు స్థాయికి చేరుకుందనే వాస్తవాన్ని పరిశీలించినట్లైతే చాలామంది ఇన్వెస్టర్లు అసెట్‌క్లాసెస్‌కే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్ల ఫోర్ట్‌ఫోలియోలో 10శాతానికి మించి బంగారం పెట్టుబడులు ఉండకూడదు. హెడ్జింగ్‌ దృష్ట్యా మాత్రమే బంగారంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన తెలిపారు.

ఈ స్థాయిలో మార్కెట్‌ భారీ పతనం ఈక్విటీల్లో కొనుగోలుకు మంచి అవకాశమని చరిత్ర చెబుతోంది. ఇటీవలి జరిగి కరెక‌్షన్‌ కారణంగా, వాల్యుయేషన్ పరంగా ఈక్విటీలు సహేతుకమైన జోన్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సర్‌ జాన్‌ టెంపుల్టన్‌ వాఖ్యలను కోట్‌ చేస్తూ ‘‘ గరిష్ట నిరాశవాద సమయం కొనుగోలుకు ఉత్తమం. గరిష్ట ఆశావాద సమయం అమ్మకానికి ఉత్తమం’’ తెలిపారు. 

కోటక్‌ సెక్యూరిటీస్‌ నుంచి 6 టాప్‌ స్టాక్స్‌లు: హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మంగళూర్‌ గ్యాస్‌, క్వెస్‌ కార్ప్‌, ఇంజనీరింగ్‌ ఇండియాలు 

ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ నుంచి 14లాంగ్‌ టర్మ్‌ స్టాక్‌లు:- భారతీ ఎయిర్‌టెల్‌, సిప్లా, ఐసీఐసీఐ లాంబార్డ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, టాటా మోటర్స్‌ లాంటి లార్జ్‌ క్యాప్‌ షేర్లు ఉన్నాయి. 

భారత్‌ ఫోర్జ్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ధనుకా అగ్రిటెక్‌, గుజరాత్‌ గ్యాస్‌, జస్ట్‌ డయల్‌, జేకే సిమెంట్స్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, మైండ్‌ ట్రీ, సెక్యూరిటీస్‌ అండ్‌ ఇంటలిజెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లాంటి మధ్య, చిన్న తరహా షేర్లులున్నాయి. You may be interested

చమురు 'బేజార్'

Tuesday 10th March 2020

(అప్‌డేటెడ్‌..) ఉత్పత్తి కోతపై దేశాల మధ్య కుదరని సయోధ్య ధరల పోరుకు తెరతీసిన సౌదీ 30 శాతం పైగా డౌన్‌ 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఇంత భారీ పతనం ఇదే తొలిసారి సింగపూర్‌:   ముడి చమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి, రష్యా మధ్య డీల్ కుదరకపోవడంతో సౌదీ అరేబియా ధరల పోరుకు తెర తీసింది. భారీగా రేట్లు తగ్గించేసింది. 20 ఏళ్ల కనిష్ట స్థాయికి కోత పెట్టింది. దీంతో సోమవారం చమురు ధరలు

మార్కెట్ల మహాపతనం- సెన్సెక్స్‌ 2000 పాయింట్లు క్రాష్‌

Monday 9th March 2020

ఇంట్రాడేలో 2500 పాయింట్లు హుష్‌ 35,109 పాయింట్లకు సెన్సెక్స్‌ ఒక దశలో 10,342 స్థాయిని తాకిన నిఫ్టీ అన్ని రంగాలూ 8-3 శాతం మధ్య డౌన్‌ కోవిడ్‌-19, యస్‌ బ్యాంక్‌,, చమురు సెగ మధ్య, చిన్న తరహా కౌంటర్లూ కుదేల్‌ చాలా కాలం తరువాత మళ్లీ దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా బేర్‌మన్నాయి. ఇన్వెస్టర్ల గుండె గుభేల్‌మంది. ఓవైపు కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనంలోకి జారుకోవచ్చన్న ఆందోళనలు కొనసాగుతుండగా.. తాజాగా చమురు ధరల సంక్షోభం తలెత్తింది. ఒపెక్‌

Most from this category