News


సెన్సెక్స్‌ కొత్త రికార్డు...చేరువలో నిఫ్టీ

Monday 25th November 2019
Markets_main1574678091.png-29841

  • 164 పాయింట్లు పెరిగి నిఫ్టీ
  • కలిసొచ్చిన అంతర్జాతీయ సానుకూలాంశాలు 
  • రాణించిన బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లు

మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సోమవారం సూచీలు పరుగులు తీసాయి. సెన్సెక్స్‌ 529 పాయింట్లు పెరిగి 40,889 వద్ద క్లోజయ్యింది. ఇది సెన్సెక్స్‌కు రికార్డు ముగింపు. ఇక నిఫ్టీ 164.60 పాయింట్ల లాభంతో 12,079 వద్ద క్లోజయ్యింది. జూన్‌ తొలివారంలో నమోదైన రికార్డు గరిష్ఠాన్ని కొద్దిరోజుల క్రితమే దాటిన సెన్సెక్స్‌ తాజాగా 40,900 పాయింట్లపైన మరో కొత్త రికార్డును నెలకొల్పడమే కాకుండా, దాదాపు అదే స్థాయి వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ మాత్రం జూన్‌ 3 నాటి 12,0103 పాయింట్ల రికార్డు గరిష్టానికి, ఆ రోజున రికార్డు ముగింపు 12,088 పాయింట్ల స్థాయికి  మరొకొద్ది దూరంలో వుంది.   ట్రేడింగ్‌ ప్రారంభం ఒక్క మీడియా రంగ షేర్లకు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 572 పాయింట్లు పెరిగి 40,931.71 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 12,084.50 వద్ద 5నెలల గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది జూన్‌3న 12103 పాయింట్లు వద్ద నిఫ్టీ జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలతో మెటల్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. ప్రైవేట్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు లాభపడటంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 453 పాయింట్ల లాభపడి 31,564.60 వద్ద స్థిరపడింది. 

మార్కెట్‌ను నడిపించిన 5 అంశాలివే...
వాణిజ్య ఒప్పందంపై ఆశలు:-  అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే ఆశావహన అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. చైనాతో తొలిదశ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది చివరినాటికి సాధ్యమవుతోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ'బ్రియన్ ప్రకటించారు. అలాగే అమెరికాతో వాణిజ్య చర్చల్లో భాగంగా మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనపై జరిమానాలు పెంచడానికి చైనా అంగీకరించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి 

ప్రపంచమార్కెట్లలో సానుకూలత:- అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే ఆశావహన అంచనాలతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. నేడు ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియడంతో పాటు, మన మార్కెట్‌ మిడ్‌సెషన్‌ అనంతరం ప్రారంభమైన యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చింది.

ఎఫ్‌ అండ్‌ ఓ ఎక్స్‌పైరీ ముందు షార్ట్‌ కవరింగ్‌:- గురువారం ఎఫ్ అండ్ ఓ గడువుకు ముందే షార్ట్ కవరింగ్ కారణంగా మార్కెట్లో ర్యాలీ జరగవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. "ఇది ఎఫ్ అండ్ ఓ గడువు కంటే ముందే కవరింగ్ గా కనబడుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు సైతం అందుకు సహరిస్తున్నాయి.’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ రస్మిక్ ఓజా అన్నారు. 

విస్తృత స్థాయి కొనుగోళ్లు:- గత 17 సెషన్ల నుంచి పరిమితి స్థాయిలో ట్రేడ్‌ అవుతున్న సూచీలకు..ఈ రోజు మార్కెట్లో జరిగిన విస్తృత స్థాయి కొనుగోళ్లు మంచి ఊపునిచ్చాయి. నేడు మార్కెట్లో అన్ని రంగాల్లోనూ విస్తృత స్థాయి కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా టెలికాం, మెటల్‌, అటో, బ్యాంక్‌, రియల్టీ రంగ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ అన్ని రంగాల ఇండెక్స్‌లు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి.

సాంకేతిక కారణాలు:- నిప్టీ ఇండెక్స్‌  కీలకమైన 12035 నిరోధాన్ని అధిగమించింది. ఈ అంశం సూచీలను ఆల్‌టైం గరిష్టాల్ని అందుకోవచ్చనే సంకేతాలను సూచిస్తుంది.  ఫలితంగా నిఫ్టీ 12,100-12,150 స్థాయిలో ట్రేడేయ్యేందుకు ఎక్కువగా అవకాశాలున్నట్లు డీహెచ్‌ఎం రీసెర్చ్‌ హెడ్‌ రాజేస్‌ పాల్వాయ్‌ పేర్కోన్నారు.


గ్రాసీం, హిందాల్కో, టాటాస్టీల్‌, ఇన్ఫ్రాటెల్‌, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు 3.50శాతం నుంచి 8శాతం లాభపడ్డాయి. గెయిల్‌, బీపీసీఎల్‌, యస్‌బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, జీ లిమిటెడ్‌ షేర్లు అరశాతం నుంచి 5.50శాతం నష్టపోయాయి. 



You may be interested

షార్ట్‌టర్మ్‌కు డజన్‌ సిఫార్సులు

Monday 25th November 2019

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినిచ్చే 12 స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. రెలిగేర్‌ బ్రోకింగ్‌ అజిత్‌ మిశ్రా సిఫార్సులు 1. లుపిన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 820. స్టాప్‌లాస్‌ రూ. 750. డైలీ చార్టుల్లో రివర్సల్‌ ప్యాట్రన్‌ ఏర్పరిచి బ్రేకవుట్‌కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 200 రోజుల డీఎంఏపైన కొనసాగుతూ పాజిటివ్‌గా కనిపిస్తోంది. 2. పీవీఆర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1920. స్టాప్‌లాస్‌ రూ. 1700. రికార్డు హైని తాకి రిట్రేసైన

12050పైన క్లోజయితే ఆల్‌టైమ్‌ హై పక్కా!

Monday 25th November 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్‌ గతవారం ఒడిదుడకుల పయనం నుంచి ఈ వారం గాడిలో పడింది. సోమవారం చిన్నపాటి లాభంతో ఆరంభమైన నిఫ్టీ మధ్యాహ్న సమయానికి దాదాపు 140 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. దీంతో మరోమారు నిఫ్టీ కీలక 12వేల పాయింట్ల పైకి చేరింది. గత నిరోధం 12038 పాయింట్లను దాటి 12050 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. దీంతో నిఫ్టీ పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించినట్లే కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ

Most from this category