ఆల్‌టైం గరిష్ఠానికి సెన్సెక్స్, 12,000 పైన నిఫ్టీ
By Sakshi

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ర్యాలీ చేయడంతో బుధవారం సెషన్లో సెన్సెక్స్ కొత్త గరిష్ఠానికి చేరుకుంది. ఉదయం 10.31 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 2721.63 పాయింట్లు లాభపడి 40743.33 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో 40,469.70 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, బుధవారం సెషన్లో 40,768.83 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అదేవిధంగా గత కొన్ని సెషన్లలో కీలక నిరోధంగా పనిచేస్తున్న 12,000 స్థాయిని నిఫ్టీ బుధవారం సెషన్లో అధిగమించింది. ఉదయం 10.35 సమయానికి నిఫ్టీ 75.90 పాయింట్లు లాభపడి 12,016.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో 11,940.10 వద్ద ముగిసిన ఈ ఇండెక్స్, బుధవారం సెషన్లో జీవిత కాల గరిష్ఠమైన 12,103 స్థాయికి చేరువలో టేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ 3.91 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.74 శాతం, అదాని పోర్టు 3.15 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ 2.80 శాతం, యస్ బ్యాంక్ 2.26 శాతం లాభపడి, పాజిటివ్‌గా ట్రేడవుతున్న షేర్లలో ముందున్నాయి. అదేవిధంగా ఇన్ఫ్రాటెల్ 2.63 శాతం, ఐషర్ మోటర్స్ 1.14 శాతం, కోటక్ బ్యాంక్ 0.99 శాతం, బ్రిటానియా 0.84 శాతం, ఐటీసీ 0.54 శాతం నష్టపోయి, పడిపోయిన షేర్లలో ముందున్నాయి.
You may be interested
స్థిరంగా పసిడి
Wednesday 20th November 2019దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి బుధవారం స్థిరంగా ట్రేడ్ అవుతోంది. నేటి ఎంసీఎక్స్‌లో డిసెంబర్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.32ల స్వల్ప నష్టంతో రూ.38173.00 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్వెస్టర్లు తన పెట్టుబడును ఈక్విటీల్లోకి మళ్లిస్తుండంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ ర్యాలీ రెండోరోజూ కొనసాగుతుంది. అలాగే డాలర్ మారకంలో రూపాయి బలహీనంగా ట్రేడ్ అవుతోంది. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ తగ్గుతోంది. ఇక నిన్నటి ఫారెక్స్ మార్కెట్లో రూపాయి
నష్టాల్లో చమురు ధరలు
Wednesday 20th November 2019యుఎస్ చమురు నిల్వలు పెరగడంతో పాటు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వలన అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడంతో గత రెండు సెషన్లలో చమురు ధరలు పతనమయ్యాయి. ఈ పతనాన్ని కొనసాగిస్తు బుధవారం సెషన్లో కూడా చమురు ధరలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బుధవారం ఉదయం 9.46 సమయానికి బ్రెంట్ క్రూడ్ 0.10 శాతం తగ్గి బ్యారెల్‌కు 60.81 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్ 0.03 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 55.33 డాలర్ల