News


సెన్సెక్స్‌.. వండర్‌ఫుల్‌ ర్యాలీ

Tuesday 4th February 2020
Markets_main1580811992.png-31504

917 పాయింట్ల హైజంప్‌
40,789కు ఎగసిన సెన్సెక్స్‌
నిఫ్టీ 272 పాయింట్ల దూకుడు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ ప్లస్‌


ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌ విరుచుకు పడింది. దీంతో రెండు రోజుల క్రితం కరోనా భయాలు, బడ్జెట్‌ నిరాశలతో కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ ఏకంగా 917 పాయింట్లు దూసుకెళ్లింది. వెరసి బడ్జెట్‌ రోజు నష్టాలను పూడ్చేసుకుంది. సోమవారం సైతం 137 పాయింట్లు లాభపడటంతో సెన్సెక్స్‌ రెండు రోజుల్లో 1054 పాయింట్లను జమ చేసుకోగలిగింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ సమయం‍ గడిచేకొద్దీ బలపడుతూ వచ్చింది. చివరికి దాదాపు ఇంట్రాడే గరిష్టం 40,789 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 272 పాయింట్లు జమ చేసుకుని 11,980 వద్ద స్థిరపడింది. ఇది దాదాపు ఇంట్రాడే గరిష్టంకావడం విశేషం!

మెటల్‌, రియల్టీ, బ్యాంక్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్‌, రియల్టీ, బ్యాంక్స్‌, ఫార్మా, ఐటీ 3-2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఐవోసీ, బజాజ్‌ ఫిన్‌, బీపీసీఎల్‌, హిందాల్కో, ఐటీసీ, గెయిల్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ 7.3-3.7 శాతం మధ్య జం‍ప్‌ చేశాయి. అయితే జీ, బజాజ్‌ ఆటో, యస్‌ బ్యాంక్‌, ఐషర్‌, హెచ్‌యూఎల్‌ 5.3-1 శాతం మధ్య క్షీణించాయి.

ఐబీ హౌసింగ్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, మదర్‌సన్‌, పిరమల్‌, డీఎల్‌ఎఫ్‌, ఎన్‌ఎండీసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ 8-5.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా, మరోపక్క మణప్పురం, ఎక్సైడ్‌, బయోకాన్‌, టీవీఎస్‌ మోటార్‌, ఐడియా, గోద్రెజ్‌ సీపీ 6-2 శాతం మధ్య తిరోగమించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1618 లాభపడగా.. 885 మాత్రమే నష్టపోయాయి.  

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1200 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1287 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా..  శనివారం ఎఫ్‌పీఐలు రూ. 1200 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ కేవలం‍ రూ. 37 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. 



You may be interested

సెన్సెక్స్‌ ర్యాలీకీ కారణాలు

Tuesday 4th February 2020

  మంగళవారం సెక్టోరియల్‌ ఇండెక్స్‌లన్నీ గ్రీన్‌లో ట్రేడ్‌ అయ్యాయి. మెటల్‌ షేర్లు  2.4 శాతం పెరగగా ఇదే బాటలో నడిచిన ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, ఫార్మాలు 1 శాతం పెరిగాయి. శనివారం పడిపోయిన మార్కెట్‌లు మంగళవారం భారీగా పుంజుకోవడంతో సెన్సెక్స్‌ 600 పాయిట్లు పెరిగింది. మరోపక్క నిఫ్టీ 11,900 పాయింట్ల పైకి ఎగబాకింది.ఈ విధంగా షేర్‌ మార్కెట్‌ ర్యాలీ కొనసాగడానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.   గ్లోబల్‌ రికవరీ ఆసియా

సిమెంట్‌ షేర్లకు బడ్జెట్‌ బూస్ట్‌

Tuesday 4th February 2020

సరికొత్త గరిష్టానికి శ్రీ సిమెంట్‌ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి ప్రాధాన్యం బడ్జెట్‌లో సిమెంట్‌ రంగానికి ప్రత్యేకించి ఎలాంటి ప్రతిపాదనలూ లేనప్పటికీ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తాజాగా శ్రీ సిమెంట్‌ షేరు చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో అల్ట్రాటెక్‌సహా ఏసీసీ, అంబుజా సిమెంట్‌, జేకే తదితర సిమెంట్‌ కౌంటర్లు 2-5 శాతం మధ్య ఎగశాయి. ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్‌ రంగాలకు బడ్జెట్‌లో

Most from this category