News


సెన్సెక్స్‌.. హైజంప్‌...635 పాయింట్లు అప్‌

Thursday 9th January 2020
Markets_main1578566202.png-30806

నిఫ్టీ లాభాల డబుల్‌ సెంచరీ
రియల్టీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ జూమ్‌
ఐటీ ఇండెక్స్‌ వెనకడుగు
చిన్న షేర్లకు భారీ డిమాండ్‌

గత గురువారం తలెత్తిన ఉద్రిక్త వాతావరణం ఈ గురువారానికల్లా తేలిపోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లకు ఒక్కసారిగా హుషారొచ్చింది. అటు అమెరికా.. ఇటు ఇరాన్‌ ప్రత్యక్ష దాడులకు దిగబోమంటూ సంకేతాలు ఇవ్వడంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలపడింది. ఫలితంగా ముడిచమురు, బంగారం ధరలు దిగివచ్చాయి. దీంతో రూపాయి జోరందుకుంది. ఈ అన్ని అంశాలూ దేశీయంగా ఇన్వెస్టర్లకు జోష్‌నివ్వడంతో గురువారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ కొనుగోళ్లకు ఎగబడ్డారు. వెరసి మార్కెట్లు సమయం గడిచేకొద్దీ మరింత బలపడ్డాయి. చివరికి సెన్సెక్స్‌ 635 పాయింట్లు జంప్‌చేసి 41,452 వద్ద ముగిసింది. ఇది దాదాపు ఇంట్రాడే గరిష్టంకాగా.. నిఫ్టీ సైతం 191 పాయింట్లు జమ చేసుకుని 12,216 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 41176- 41482 పాయింట్ల మధ్య కనిష్ట, గరిష్టాలను తాకగా.. నిఫ్టీ 12224-12133 పాయింట్ల మధ్య కదిలింది. 

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ, మీడియా, మెటల్‌ 2.7-1.4 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, యస్‌ బ్యాంక్‌, మారుతీ, జీ 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో టీసీఎస్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా 1.6-0.6 శాతం మధ్య నీరసించాయి.

మ్యాక్స్‌ ఫైనాన్స్‌ డౌన్‌
డెరివేటివ్స్‌లో టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఎన్‌బీసీసీ, వోల్టాస్‌, ఎన్‌సీసీ, ఎస్కార్ట్స్‌, హెచ్‌పీసీఎల్‌ 6.2-4.3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోవైపు మ్యాక్స్‌ ఫైనాన్స్‌ 9.2 శాతం పతనంకాగా.. ఐడియా, మైండ్‌ట్రీ, మణప్పురం, ఎన్‌ఎండీసీ, జూబిలెంట్‌ ఫుడ్‌, రామ్‌కో సిమెంట్‌ 4-0.7 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ స్టాక్స్‌లో సన్‌టెక్‌ 7 శాతం జంప్‌చేయగా.. ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, శోభా, ఫీనిక్స్‌, మహీంద్రా లైఫ్‌, ప్రెస్టేజ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 5-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.5 శాతం చొప్పున పెరిగాయి. ట్రేడైన షేర్లలో 1820 లాభపడగా.. 751 మాత్రమే నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 516 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 748 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 682 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 311 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు  చేసిన సంగతి తెలిసిందే.You may be interested

అటో షేర్ల పరుగులు

Thursday 9th January 2020

మార్కెట్లో గురువారం జరిగిన బుల్‌ రన్‌లో అటో షేర్లు లాభాల పరుగులు పెట్టాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే అటో ఇండెక్స్‌ 2.68శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(7,942.75)తో పోలిస్తే 93 పాయింట్లు లాభంతో 8,035.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అటో షేర్లకు గిరాకి నెలకొనడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2.80శాతం లాభంతో 8165.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

ఇన్ఫీ ఫలితాలు.. ఏం చూడాలి?

Thursday 9th January 2020

మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ను శుక్రవారం ఇన్ఫోసిస్‌ ఆరంభించనుంది. సాధారణంగా క్యు3లో ఐటీ కంపెనీల ఫలితాలు నీరసంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి... - రూపీ లెక్కల్లో కంపెనీ ప్రాఫిట్‌ వృద్ధి గత త్రైమాసికంతో పోలిస్తే 6-8 శాతం, గతేడాదితో పోలిస్తే 4-7 శాతం ఉండొచ్చు. - స్థిర కరెన్సీ లెక్కల్లో విక్రయాలు 1.4- 2 శాతం పెరుగుదల చూపవచ్చు.  - క్యు2తో పోలిస్తే

Most from this category