మూడోరోజూ లాభాల ముగింపు
By Sakshi

మార్కెట్ వరసగా మూడోరోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 37641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11105 వద్ద ముగిసింది. వాణిజ్య వివాద పరిష్కారానికి త్వరలో చైనాతో చర్చలు ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడం, గత వారాంతంలో మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు, అదనపు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేయడానికి ఆర్బీఐ ఆమోదం తెలపడం, తదితర అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. బ్యాంకింగ్, మెటల్, అటో, ఆర్ధిక రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి బలహీనతతో ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీతో ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 28000 స్థాయికి అందుకుని 28126 పైన ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,049.50 - 11,141.75 రేంజ్లో, సెన్సెక్స్ 37,449.69 - 37,731.51 శ్రేణిలో కదలాడింది. ఎన్టీపీసీ, యస్ బ్యాంక్, టాటాస్టీల్, బ్రిటానియా, టాటామోటర్స్ షేర్లు 3శాతం నుంచి 9శాతం లాభపడ్డాయి. మరోవైపు గ్రాసీం, ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్రా, భారతీఎయిర్‌టెల్, ఇండియాబుల్స్‌హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం వరకు నష్టపోయాయి.
You may be interested
పరుగులు.. కొన్ని స్టాకుల్లోనే!
Tuesday 27th August 2019ఎఫ్‌పీఐలు తిరిగి వస్తాయి.. ర్యాలీ మాత్రం కొన్ని కౌంటర్లలోనే ఉంటుంది నిపుణుల అంచనా అమెరికా - చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో వర్థమాన దేశాల మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు తన పెట్టుబడులను భారీ స్థాయిలో వెనక్కి తీసుకుంటున్నారు. అందులో భాగంగా మన దేశీయ మార్కెట్‌ను ఎఫ్‌పీఐలు తన పెట్టుబడులను ఉపసంహరణకు ఇంతకాలం సర్‌ఛార్జీల పన్ను విధింపును ఇందుకు ఒక సాధనంగా వినియోగించుకుంచుకున్నారని విశ్లేషకులంటున్నారు. దాదాపు 39 సాక్టుల్లో ఎఫ్‌పీఐలకు మూడోవంతు వాటా ఉంది.
షేర్‌ఛాట్ పది కోట్ల డాలర్ల సమీకరణ!
Tuesday 27th August 2019భారత్‌లో అతిపెద్ద ప్రాంతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌ఛాట్ తాజాగా పది కోట్ల డాలర్లను సమీకరించింది. సీరిస్ డీ ఫండ్ రైజింగ్‌లో భాగంగా ఈ సమీకరణ జరిపినట్లు కంపెనీ తెలిపింది. ఇంతవరకు వివిధ రూపాల్లో 22.4 కోట్ల డాలర్లను షేర్‌ఛాట్ సేకరించింది. తాజా సమీకరణలో ఇప్పటికే కంపెనీ భాగస్వాములైన షున్‌వై క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్టనర్స్, సైఫ్ క్యాపిటల్, ఇండియా కోయిషెంట్, మార్నింగ్సైడ్ వెంచర్ క్యాపిటల్ పాల్గొన్నాయి. ఈ ఫండింగ్‌లో