News


10850 పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ

Tuesday 15th January 2019
Markets_main1547546937.png-23607

465 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్‌
150 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

పటిష్టమైన ఆర్థిక గణాంకాల నమోదుతో మార్కెట్‌ మూడురోజుల నష్టాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. డిసెంబర్‌లో టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బం తగ్గుముఖం పట్టడంతో రానున్న రోజుల్లో ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోతకు అవకాశం ఉండవచ్చనే అంచనాలు సూచీలను పరుగులు పెట్టించాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ తిరిగి 71స్థాయిని అందుకోవడం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఈ రంగ షేర్లలో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలిచాయి. అలాగే ఈ జనవరి 17న(ఎల్లుండి) డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న రిలయన్‌ ఇండస్ట్రీస్‌ ఆశించిన స్థాయిలోనే గణాంకాలు నమోదు చేయవచ్చని పలు బ్రోకరేజ్‌ సంస్థలు అం‍చనా వేశాయి. ఫలితంగా ఈ కంపెనీ షేరు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 3శాతం లాభం పడటం సైతం సూచీల ర్యాలీకి తోడ్పాటును అందించింది. ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల లాభం ప్రారంభం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. నిఫ్టీ సూచీకి కీలకమైన 10800 నిరోధ స్థాయిని అధిగమించడం సూచీలకు మద్దతునిచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రేడింగ్‌ ఆద్యంతం పటిష్టమైన లాభాలను ఆర్జించిన సూచీలకు చివరి గంట కొనుగోళ్లు మరింత ఉత్సాహానిచ్చాయి. ఫలితంగా నిఫ్టీ 149 పాయింట్లు లాభపడి 10,886 వద్ద, సెన్సెక్స్‌ 464 పాయింట్ల లాభపడి 36,318.33 ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 152 పాయింట్ల లాభపడి 27,400 వద్ద ముగిసింది. అత్యధికంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 3శాతం లాభపడగా అదే బాటలో మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం ర్యాలీ చేసింది.
రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, యస్‌ బ్యాంక్‌, విప్రో షేర్లు 3శాతం నుంచి 5.50శాతం లాభపడగా, ఇన్ఫ్రాటెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, మారుతి షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి.You may be interested

ఎన్నికల ఫలితాల వేళ ఎలా ట్రేడ్‌ చేయాలి?

Tuesday 15th January 2019

యూబీఎస్‌ సూచనలు త్వరలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న వేళ మార్కెట్లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు వెనకాముందాడుతున్నారు. ఎన్నికల వేళ ప్రభుత్వం పాపులర్‌ విధానాలవైపు మొగ్గు చూపవచ్చన్న అంచనాలున్నాయి. ఎన్నికల అనంతరం ఎలాంటి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వాన్ని బట్టి నిఫ్టీ ఎలా స్పందిస్తుంది, ఏ ప్రభుత్వం వస్తే ఏ రంగాలను ఎంచుకొని ట్రేడ్‌ చేయాలనే అంశాలపై ఇన్వెస్టర్లకు పలు సందేహాలున్నాయి. ఈ సందేహాలకు యూబీఎస్‌ సమాధానమిస్తోంది. సీన్‌1: బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం:

భారత మార్కెట్లపై జేఎం ఫైనాన్షియల్‌ పాజిటివ్‌

Tuesday 15th January 2019

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లు మంచి ప్రదర్శన చూపుతాయని జేఎం ఫైనాన్షియల్స్‌ అనలిస్టు గౌతమ్‌ షా అంచనా వేశారు. గత డిసెంబర్‌లో మార్కెట్లను వెనక్కు లాగేందుకు పలు శక్తులు కాచుకుని ఉన్నాయని, కానీ దేశీయ మార్కెట్లు వాటిని ఎదుర్కొని స్థిరంగా నిలబడ్డాయని చెప్పారు. వర్దమాన మార్కెట్లలో భారత మార్కెట్‌ మంచి పనితీరు కనబరుస్తోందని, రాబోయే రోజుల్లో ఇదే జోరు కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం నిఫ్టీ 10650- 10950

Most from this category