News


లాభాల ముగింపు

Tuesday 6th August 2019
Markets_main1565087873.png-27582

  • కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు
  • 277 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 

గత ట్రేడింగ్‌ సెషన్‌లో భారీ నష్టాల్ని చవిచూసిన దేశీయం ఈక్విటీ మార్కెట్‌ మం‍గళవారం లాభంతో ముగిసింది. మార్కెట్‌ నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో చౌకగా లభిస్తున్న షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడటం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌ 277 పాయింట్లు పెరిగి 36,976.85 వద్ద, నిఫ్టీ 85.70 లాభపడి 10,948.30 వద్ద ముగిసిం‍ది. గత రాత్రి అమెరికా, ఈ రోజు ఉదయం ఆసియా మార్కెట్ల పతనంతో నేడు మార్కెట్‌ నష్టాలతో ప్రారంభైనన్పటికీ వెనువెంటనే లాభంలోకి మళ్లింది. కనిష్టాలకు చేరిన కౌంటర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ మార్కెట్లకు జోష్‌ నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 458 పాయింట్లు రేంజ్‌లో 36,536.59 - 37,241.77 శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ 156 పాయింట్ల శ్రేణిలో 10,813.80 - 11,018.55 శ్రేణిలో కదలాడింది. ఒక్క మీడియా, ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు విరివిరిగా జరిగాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్ల పెరుగుదలతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 1.35శాతం ర్యాలీ చేసి 28000 పైన 28,022.10 వద్ద స్థిరపడింది. 
భారతీఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 3శాతం నుంచి 7.50శాతం లాభపడగా, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సిప్లా, జీ లిమిటెడ్‌ షేర్లు 1.50శాతం నుంచి 6శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

జేఎం ఫైనాన్షియల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ నుంచి ఎన్‌సీడీ ఇష్యూలు

Wednesday 7th August 2019

జేఎం ఫైనాన్షియల్‌, ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) సంస్థలు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ ఇష్యూలను చేపట్టాయి. ఈ రెండూ మంగళవారం ఆరంభమయ్యాయి. ఇందులో ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌సీడీ ఇష్యూ ఈ నెల 30న ముగుస్తుంది. జేఎం ఫైనాన్షియల్‌ ఎన్‌సీడీ ఇష్యూ మత్రం సెప్టెంబర్‌ 4 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు కూడా ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు కావడం గమనార్హం. ఇందులో ఐఐఎఫ్‌ఎల్‌ 10.50 శాతం, జేఎం ఫైనాన్షియల్‌ 10.40

సూచీలకు దన్నుగా హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం

Tuesday 6th August 2019

హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం ర్యాలీ మంగళవారం సూచీలకు కలిసొచ్చింది. ఇరు కంపెనీలు క్యూ1లో మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు, నిన్నటి ట్రేడింగ్‌లో  అమ్మకాల ఒత్తిడికి లోనైన నేపథ్యంలో ట్రేడర్లు నేడు ఈ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ పూనుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌ఎసీ బ్యాంక్‌ దాదాపు అరశాతం ర్యాలీ చేసింది. నేడు నిఫ్టీ ఆర్జించిన మొత్తం 85 పాయింట్లలో ఒక హెచ్‌డీఎఫ్‌సీ వాటా 14.51 పాయింట్లు కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటా

Most from this category