News


నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్‌

Thursday 11th July 2019
Markets_main1562840938.png-26993

  • 226 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌ 
  • రాణించిన అటో, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు 

వరుస 4రోజుల మార్కెట్‌ నష్టాలకు గురువారం బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 266 పాయింట్లు లాభంతో 38,823.11 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 84.00 పాయింట్లు ర్యాలీ చేసి 11,582.90 వద్ద ముగిసింది. మార్కెట్‌ 4రోజుల భారీ పతనం నేపథ్యంలో నేడు ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పూనుకోవడంతో పాటు ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ కీలక వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలనివ్వడం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. రూపాయి బలపడటంతో ఐటీ షేర్ల లాభాలు పరిమితంగా నమోదయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 200 పాయింట్ల మేర లాభపడి 30700ల పైన 30,716.55 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 335 పాయింట్ల వరకు లాభపడి  38,892.50 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 11,599.00 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేసింది. 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 194 పాయింట్ల లాభంతో 38,750 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 11,562 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న అమెరికా కాంగ్రెస్ ఎదుట ప్రసంగించిన పావెల్ వడ్డీరేట్ల త‌గ్గింపు సంకేతాలనిచ్చారు. వ‌డ్డీరేట్ల త‌గ్గింపు అంచ‌నాల‌తో ప్రపంచ మార్కెట్లలో సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. రాత్రి అమెరికా మార్కెట్లతో పాటు నేడు ఆసియా మార్కెట్లు సైతం లాభాల‌తో  ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ 4రోజుల భారీ పతనం నేపథ్యంలో అధిక వాల్యూ కలిగిన షేర్లు తక్కువ ధరల్లో లభిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే ట్రేడర్లు సైతం ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పూనుకోవడంతో సూచీలు స్థిరమైన లాభాల్ని ఆర్జించుకోగలిగాయి. అలాగే నేడు యూర‌ప్ మార్కెట్లు సైతం సానుకూలంగా ప్రారంభ‌ం ఇన్వెస్టర్లకు మరింత విశ్వాసాన్నిచ్చింది. ఫలితంగా సూచీలు 4రోజుల వరుస నష్టాలకు ముగింపు పలుకుతూ లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. 

టాటామోటర్స్‌, ఇండస్‌ ఇండ్‌, హీరోమోటోకార్ప్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 3.50శాతం నుంచి 8శాతం లాభపడగా, యాక్సిస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, ఐఓసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. 

  • త‌న అనుబంధ సంస్థ రిలిగేర్ ఫిన్‌వెస్ట్ కంపెనీలో మొత్తం వాటాను టీసీజీ అడ్వైజ‌రీ సర్వీసెస్ విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోవ‌డంతో రిలిగేర్ కంపెనీ షేర్లు 10శాతం లాభప‌డి రూ. 42.95 వ‌ద్ద అప్పర్ స‌ర్క్యూట్ ను తాకాయి. ఈ షేర్లకు ఇది 9 నెల‌ల గ‌రిష్టస్థాయి.
  • కాక్స్ అండ్‌ కింగ్స్ షేర్లు 5శాతం క్షీణించి రూ.23.35ల వ‌ద్ద లోయ‌ర్  స‌ర్క్యూట్ తాకాయి. వాణిజ్య పేపర్లపై వ‌డ్డీ రేట్లు చెల్లింపుల్లో ఆల‌స్యం చేస్తుండంతో కేర్ రేటింగ్ సంస్థ క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్ల ఇష్యూపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. దీంతో ఈ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నెల‌రోజుల్లో ఏకంగా షేర్లు 71శాతం న‌ష్టపోయాయి. 
  • హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌:- ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప‌ద్ధతిలో బాండ్ల ఇష్యూ ద్వారా రూ.3వేల కోట్ల నిధుల సమీకరించ‌నున్న నేప‌థ్యంలో ఈ కంపెనీ షేర్లు నేడు 1శాతం వ‌ర‌కు లాభ‌ప‌డింది. ఇష్యూ జూలై 11న ప్రారంభ‌మ‌వుతుంద‌ని, స‌మీక‌రించిన నిధుల్ని కార్పోరేట్ అవ‌స‌రాల‌కు, రీ పైనాన్స్ కోసం వినియోగిస్తున్నట్లు కంపెనీ ఎక్చ్సేంజీల‌కు స‌మాచారం ఇచ్చింది. 
  • సమల్‌కోట్‌ ప్రాజెక్ట్‌ కొరకు అమెరికా ఎగ్జిమ్‌ బ్యాంకు నుంచి రూ. 2,430 కోట్ల రుణాన్ని తిరిగి పొందినట్లు రిలయన్స్‌ పవర్‌ ప్రకటించడంతో కంపెనీ షేర్లు 7శాతం లాభపడి రూ. 4.24 వద్ద ముగిసింది.You may be interested

మిడ్‌క్యాప్‌ వైపు చూడ్డానికి మంచి టైమ్‌

Friday 12th July 2019

మార్కెట్‌ బ్రెడ్త్‌ (పెరిగిన, నష్టపోయిన స్టాకుల మధ్య నిష్పత్తి) చాలా తగ్గిపోయిందని, ఈ స్థాయి నుంచి మార్కెట్లో బ్రోడ్‌ బేస్డ్‌ (అన్ని విభాగాల షేర్ల ర్యాలీ) రికవరీ జరగాలంటే తాజా ట్రిగ్గర్లు అవసరమన్నారు చార్ట్‌ అడ్వైజ్‌ సంస్థ శిక్షణ విభాగం హెడ్‌ రాజా వెంకట్రామన్‌. నిఫ్టీ-50లో 15 స్టాక్స్‌ ఈ ఏడాది 30 శాతం రాబడులను ఇవ్వగా, అదే సమయంలో మిగిలిన 35 స్టాక్స్‌ 11 శాతం నష్టపోయినట్టు చెప్పారు.

లాభాల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Thursday 11th July 2019

 సానుకూలంగా దేశియ మార్కెట్లు ట్రేడవుతుండడంతో పాటు కంపెనీ వ్యూహాత్మక పెట్టుబడులు పెరిగే అవకాశం ఉండడంతో జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ గురువారం 7.14 శాతం లేదా రూ. 23.75 లాభపడి రూ. 356.50 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ.332.75 వద్ద ముగిసింది. జీ ఎంటర్‌ప్రైజెస్‌ కోసం బిడ్‌ దాఖలుచేయడానికి కామ్‌కాస్ట్‌ నాయకత్వంలోని కన్సార్టియం ప్రయత్నిస్తుండడం తెలిసిందే. ఈ కన్సార్టియంలో కామ్‌కాస్ట్‌తో పాటు ప్రైవేట్‌ ఈక్వీటీ సంస్థ బ్లాక్‌

Most from this category