News


271 పాయింట్ల గ్యాప్‌ అప్‌తో సెన్సెక్స్‌ ప్రారంభం

Thursday 5th March 2020
Markets_main1583380847.png-32289

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 271.83 పాయింట్లు లాభంతో 38,681.31 వద్ద, నిఫ్టీ 85.1 పాయింట్లు పెరిగి 11336.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ వ్యాధి బారి నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించింది. ఇప్పుడు ఇదే బాటలో పలు దేశాల సెం‍ట్రల్‌ బ్యాంకులు ఆర్థిక ఉద్దీపన చర్యలతో పాటు వడ్డీరేట్లను కూడా తగ్గించవచ్చనే అంచనాలతో అంతర్జాయ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. నిన్నరాత్రి అమెరికా సూచీలు 4శాతానికి పైగా లాభంతో ముగియగా, నేడు ఆసియా మార్కెట్లు 1శాతానికి పైగా లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

దేశీయ పరిణామాలు విషయానికొస్తే.... ఫ్రిబవరిలో సేవల రంగం పురోగతి సాధించినట్లు గణాంకాలు వెలువడ్డాయి. ఫెడ్‌బాటలోనే ఆర్‌బీఐ సైతం వడ్డీరేట్లను తగ్గించవచ్చని అంచనాలు నెలకొన్నాయి. అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ మాత్రం బలహీన పడుతూనే ఉంది. నిన్నటి ట్రేడింగ్‌లో 20పైసలు బలహీనపడి 17నెలల కనిష్టం​ వద్ద ముగిసిన రూపాయి నేడు మరింత బలహీనతతో మొదలైంది. క్రితం ముగింపు స్థాయి(73.21)తో పోలిస్తే 15పైసలు నష్టపోయి 73.36 స్థాయి వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. 

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభంతో 38,510వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్లు పెరిగి 11282.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒక్క అటో, ప్రైవేట్‌ రంగ బ్యాంక్, రియల్టీ, మీడియా షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్ల కొనుగోళ్లు విరివిరిగా జరుగుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. 


ఇదే సమయానికి నిఫ్టీ...50 ఇండెక్స్‌లో... యూపీఎల్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, గెయిల్‌, వేదాంత షేర్లు 2శాతం నుంచి 3శాతం పెరిగాయి. సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌, జీ లిమిటెడ్‌ మీడియా, యస్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 3.50 నష్టాన్ని చవిచూశాయి. 
 



You may be interested

ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐ దర్యాప్తును ఆదేశించిన ఎన్‌సీఎల్‌ఏటీ

Thursday 5th March 2020

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కాంపిటీషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ)ను నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. సీసీఐ తన డైరెక్టర్ జనరల్ (డీజీ) చేత ఈ దర్యాప్తును జరిపించాలని బుధవారం సూచించింది. జస్టిస్ ఎస్.జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. సీసీఐ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టి, తాజా దర్యాప్తునకు ఆదేశించింది. ఫ్లిప్‌కార్ట్‌

నేడు అటూఇటుగా ఓపెనింగ్‌ ?

Thursday 5th March 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 4 పాయింట్లు మైనస్‌ నేడు నిఫ్టీకి 11,103 వద్ద తొలి సపోర్ట్‌! బుధవారం 4.5 శాతం జంప్‌చేసిన డోజోన్స్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30   ప్రాంతం‍లో 4 పాయింట్లు తక్కువగా 11,243 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,247 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Most from this category