News


సెన్సెక్స్‌ లాభం 222 పాయింట్ల

Wednesday 6th November 2019
Markets_main1573036054.png-29398

  • రాణించిన ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు
  • ఇంట్రాడేలో 12000 స్థాయిని తాకిన నిఫ్టీ

మార్కెట్‌ నష్టం ఒకరోజుకే పరిమితం అయ్యింది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఆర్థిక, రియల్టీరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గురువారం సూచీలు లాభాల ముగింపును సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంతో 40,469.78 వద్ద, నిఫ్టీ 43.80 పాయింట్లు పెరిగి 11,961 వద్ద స్థిరపడ్డాయి. అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌, మీడియా రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమై బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 371 పాయిం‍ట్లు లాభపడి 30,591.00 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందుకున్న సూచీలు నేడు  నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంక్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 211 పాయింట్లు నష్టపోయి 40,037 వద్ద, నిఫ్టీ 67 పాయింట్లను కోల్పోయి 11,850.25 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అనంతరం ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లకు అనూహ్య మద్దతు లభిచడంతో సూచీలు కనిష్టస్థాయి నుంచి రికవరి అయ్యాయి. మిడ్ సెషన్‌ అనంతరం కొనుగోళ్లు అధికమవడంతో సెన్సెక్స్‌ కనిష్ట స్థాయి నుంచి (40,037) నుంచి 565 పాయింట్లు లాభపడి 40,607 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ సైతం ఐదు నెలల అనంతరం(జూన్‌ 11 తరువాత) 12000 మార్కును అధిగమించి 12003 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరి అరగంటలో సూచీలు గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతున్న తరుణంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సెన్సెక్స్‌ 40,469.78 వద్ద నిఫ్టీ 12000 స్థాయి దిగువన 11,961 వద్ద స్థిరపడింది.

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సిప్లా షేర్లు 2శాతం నుంచి 3శాతం పెరిగాయి. మారుతి, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌ షేర్లు 1శాతం నుంచి 10శాతం నష్టపోయాయి. 



You may be interested

బ్లూచిప్‌ కంపెనీలపై రిటైల్‌ ఇన్వెస్టర్ల విశ్వాసం

Wednesday 6th November 2019

అధిక నికర విలువ కలిగిన ఇన్వెస్టర్లే (హెచ్‌ఎన్‌ఐలు) కాదు, రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం భద్రత కోసం బ్లూచిప్‌ స్టాక్స్‌ వెంట నడుస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. నిఫ్టీ-50లోని కంపెనీల్లో వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య (ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్స్‌) సెప్టెంబర్‌ త్రైమాసికంలో 2.33 కోట్లకు పెరగడం దీన్నే సూచిస్తోంది. అంతక్రితం జూన్‌ త్రైమాసికం నాటికి 2.23 కోట్లు, మార్చి త్రైమాసికం నాటికి 2.16 కోట్ల మంది వ్యక్తిగత ఇన్వెస్టర్లే నిఫ్టీ కంపెనీల్లో వాటాలు కలిగి

ఉద్యోగుల తొలగింపు...కాగ్నిజెంట్‌ బాటలోనే ఇన్ఫోసిస్‌

Wednesday 6th November 2019

నికరంగా 7000 మంది మిడ్‌, సీనియర్‌ లెవల్‌ ఉద్యోగులకు ఉద్వాసన చెప్పనున్నట్లు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ప్రకటించిన కొద్దిరోజులకే మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కూడా అదే మార్గాన్ని అనుసరించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇన్ఫోసిస్, వివిధ స్థాయిలలో అంచనాలకు అనుగుణంగా పనిచేయని(ఇన్వాలంటరీ యాట్రిషన్‌) ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడుతోందని కంపెనీ వర్గాలు మంగళవారం తెలిపాయి. ‘అధిక పనితీరును కనబరిచే ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీలు, వ్యాపారాన్ని సమగ్రపరిచేందుకు ఇన్వాలంటరీ యాట్రిషన్‌ను వినియోగిస్తుంటాయి. ఏ స్థాయిలోనైనా

Most from this category