News


రెండోరోజూ కొనసాగిన రికార్డు ర్యాలీ

Thursday 7th November 2019
Markets_main1573124261.png-29423

  • 5నెలల తరువాత 12వేల పైన ముగిసిన నిఫ్టీ
  • మరో కొత్త రికార్డును నమోదు చేసిన సెన్సెక్స్‌

మార్కెట్లో రెండోరోజూ రికార్డుల ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ ఇంట్రాడే 218 పాయింట్లు లాభపడి 40,688.27 కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 184 పాయింట్ల లాభంతో 40,654 వద్ద స్థిరపడింది. మరోసూచీ నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 12,021 వద్ద స్థిరపడింది. సుమారు ఐదు నెలల అనంతరం నిఫ్టీ 12000 పైన ముగియడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రభుత్వ రంగ బ్యాంక్‌, అటో సెక్టార్లు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య చర్చలు నేపథ్యంలో సానుకూలాంశం రావడంతో మెటల్‌ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు మిశ్రమంగా ట్రేడవడంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 38 పాయింట్ల స్వల్ప లాభంతో 30,647.75 వద్ద స్థిరపడింది. 

మిశ్రమ సంకేతాల నేపథ్యంలో నేడు మార్కెట్‌ లాభంతో మొదలైంది. వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం డిసెంబర్‌ వరకూ కుదిరే వీలులేదన్న వార్తలు వెలువడంతో మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో నిఫ్టీ 11,946.85 స్థాయి వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. వాణిజ్య యుద్ధంలో భాగంగా గతంలో విధించుకున్న టారీఫ్‌లను దశల వారీగా ఎత్తి వేసేకునేందుకు యూఎస్‌ - చైనాలు ఒప్పందం చేసుకున్నట్లు   చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనాన్ని వెల్లడించింది. దీంతో మార్కెట్లో మరోసారి కొనుగోలు మొదలయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 40,654 వద్ద నిఫ్టీ సైతం 12,012 వద్ద స్థిరపడ్డాయి.

జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం వరకు లాభపడ్డాయి. సిప్లా, బీపీసీఎల్‌, గెయిల్‌, యస్‌బ్యాంక్‌, యూపీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 8శాతం వరకు నష్టపోయాయి.



You may be interested

లార్జ్‌క్యాప్స్‌ మార్కెట్‌ ఇది: అజయ్‌ శ్రీవాస్తవ

Friday 8th November 2019

దీర్ఘకాలం పాటు మిడ్‌క్యాప్‌నకు ‘డెడ్‌ ఎండ్‌ స్ట్రీట్‌’ (ముగింపు వీధి)గా పేర్కొన్నారు డైమెన్షన్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సీఈవో అజయ్‌ శ్రీవాస్తవ. ఇండియన్‌ మార్కెట్‌ లార్జ్‌క్యాప్స్‌ మార్కెట్‌గా అభివర్ణించారు. ఈ మేరకు తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.    ప్రస్తుత మార్కెట్లలో ఎలా వ్యవహరించాలి? రికవరీ దశలోకి వెళ్లాం. ఈ మార్కెట్‌ ఏ ఒక్కరికీ అద్భుతమైన రాబడులను ఇచ్చింది లేదు. ఎందుకంటే భారీ పతనం నుంచి ఇది బయటపడింది. ఆ తర్వాత వెనక్కి

30% పెరిగిన హెచ్‌పీసీఎల్‌ నికర లాభం

Thursday 7th November 2019

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌(హెచ్‌పీసీఎల్‌) నికరలాభం, సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో త్రైమాసిక ప్రాతిపదికన 29.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ ఇది విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. జూన్‌క్వార్టర్‌లో రూ. 811 కోట్లుగా నమోదైన కంపెనీ లాభం, సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 1,052.3 కోట్లకు పెరిగింది.  కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 14.3 శాతం పడిపోయి రూ. 60,862 కోట్లుగా నమోదైంది. స్థూల రిఫైనింగ్‌

Most from this category