STOCKS

News


సెన్సెక్స్‌ లాభం 170 పాయింట్లు

Thursday 14th November 2019
Markets_main1573727793.png-29596

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన కొనుగోళ్లతో గురువారం స్టాక్‌ సూచీలు లాభంతో  ముగిశాయి. సెన్సెక్స్‌ 170 పాయింట్లు లాభంతో 40,286.48 వద్ద, నిఫ్టీ 30.00 పెరిగి 11,870.45 వద్ద స్థిరపడింది. ఆర్థిక, ఐటీ, బ్యాంకింగ్‌, అటో రంగ షేర్ల ర్యాలీ సూచీల లాభాల ముగింపు కారణమయ్యాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 223 పాయింట్లు పెరిగి 30,764.35 వద్ద ముగిసింది. మరోవైపు మెటల్‌, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ‘‘నిఫ్టీ డౌన్‌సైడ్‌లో 11700 స్థాయిని పరీక్షించింది.  నిఫ్టీ మద్దతు స్థాయిని తాకిన ప్రతిసారి బలమైన లాంగ్‌పొజిషన్లకు ఏర్పాటుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికీ అప్‌సైడ్‌ ట్రెండ్‌ చెక్కుచెదరకుండా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ నిఫ్టీ అప్‌సైడ్‌ ర్యాలీపై మేము సానుకూల దృక్పథంతో ఉన్నాము. అలాగే రానున్న రోజుల్లో ఆల్‌టైం హైని అందుకుంటుందని విశ్వసిస్తున్నాము.’’ అంటూ ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు మనవ్‌ చోఫ్రా అభిప్రాయపడ్డారు.ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 321 పాయింట్లు రేంజ్‌లో 40,061.23 - 40,447.17 స్థాయిలో ‍కదలాడగా, నిఫ్టీ 93 పాయింట్లు మధ్యలో 11,802- 11,895 రేంజ్‌లో ట్రేడైంది. 

మారుతి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. హిందాల్కో, వేదాంత, జీ లిమిటెడ్‌, ఇండస్‌ ఇండ్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4శాతం వరకూ నష్టపోయాయి.You may be interested

వొడాఫోన్‌ఐడియా, ఎయిర్‌టెల్‌...భారీ నష్టాల్లో రికార్డు

Friday 15th November 2019

- ఐడియాకు రూ.50,921 కోట్ల నష్టాలు  - ఒక భారత కంపెనీకి ఇవే అత్యధిక త్రైమాసిక నష్టాలు  - ఎయిర్‌టెల్‌ నష్టాలు రూ.23,045 కోట్లు  - కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక త్రైమాసిక నష్టాలు న్యూఢిల్లీ:  ఏజీఆర్‌పై (సర్దుబాటు చేసిన వార్షిక స్థూల రాబడి) సుప్రీం కోర్ట్‌ తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వొడాఫోన్‌ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్‌టెల్‌ కంపెనీ రూ.23,045 కోట్ల

చూస్తూ చూస్తూ తప్పులో కాలేయొద్దు!

Thursday 14th November 2019

ఆలస్యమైనా సురక్షిత రాబడికే ప్రాధాన్యమివ్వండి మార్కెట్లో ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి నీలేశ్‌ షా ప్రస్తుతానికి తాము టెలికం స్టాకులపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని, తమ నిర్ణయం ధైర్యవంతమైన నిర్ణయమా? తెలివితక్కువ నిర్ణయమా? అనేది కాలం తేలుస్తుందని కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేశ్‌షా వ్యాఖ్యానించారు. నిరంతరం నష్టాలు, కష్టాల బాటలో పయనిస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడుల కన్నా మందకొడి వృద్ధి నమోదు చేసే బోరింగ్‌ వ్యాపారాల్లో పెట్టుబడులే నయమని కాలం నేర్పిన పాఠమని చెప్పారు. ఒక నిపుణుడిగా టెలికాం రంగంపై

Most from this category