News


ఫ్లాష్‌..సెన్సెక్స్‌ కొత్త రికార్డు

Thursday 31st October 2019
Markets_main1572500107.png-29255

 గురువారం దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ కొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం బ్యాంక్‌లు, ఐటీ షేర్ల మద్దతుతో ఉదయం 10.55 సమయానికి 280.50 పాయింట్లు లాభపడి 40312 పాయింట్ల స్థాయిని అధిగమించడం ద్వారా సెన్సెక్స్‌ ఈ ఫీట్‌ను సాధించింది. ఈ ఏడాది జూన్‌ 4న సెన్సెక్స్‌ 40,312 పాయింట్ల వద్ద ఆల్‌టైం రికార్డును ఏర్పరచగా, ఈ రోజు సెషన్‌లో దానిని అధిగమించించింది.  గత సెషన్‌లో  40,051.87 పాయింట్ల వద్ద పాజిటివ్‌గా ముగిసిన ఈ ఇండెక్స్‌, గురువారం సెషన్లో  40,211.99 వద్ద సానుకులంగా ప్రారంభమైంది. సెషన్‌ ప్రారంభమైన కొద్ది సమయంలోనే, కొనుగోళ్ల మద్ధతు లభించడంతో 40,337.76 పాయింట్ల వద్ద అల్‌ టైం గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ ఆల్‌టైం ​గరిష్ఠం 12,103 పాయింట్లు కాగా, ప్రస్తుతం ఈ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ 78.9 పాయింట్లు లాభపడి 11923.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ సూచీ రికార్డుస్థాయిని చేరాలంటే మరో 1.5 శాతం పెరగాల్సివుంటుంది. 



You may be interested

3నెలల గరిష్టానికి ఎస్‌బీఐ

Thursday 31st October 2019

బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ తో ప్రభుత్వరంగ బ్యాంక్‌ దిగ్గజం ఎస్‌బీఐ షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.300 పైకి ఎగబాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.293.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంక్ యొక్క ఎంటర్ప్రైజ్ విలువ, ఆస్తి నాణ్యత, అధిక వృద్ధి కారణంగా నాటికి కల్లా షేర్లు 42శాతం అప్‌సైడ్‌ అవకాశం ఉన్నట్లు పలు బ్రోకరేజ్‌ సంస్థలు పేర్కోన్నారు. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఈ షేరుకు

11884 దాటితే 11981 పాయింట్ల వరకు నిఫ్టీ!

Thursday 31st October 2019

నిపుణుల అంచనా నిఫ్టీ చార్టుల్లో హ్యాంగింగ్‌ మ్యాన్‌ తరహా క్యాండిల్‌ ఏర్పరిచింది. ఇది టాప్‌ అవుట్‌కు సంకేతంగా కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే గురువారం ముగింపును బట్టి ఈ విషయం నిర్ధారణ చేసుకోవాల్సిఉంటుంది. ప్రస్తుతానికి నిఫ్టీ 11700 పాయింట్ల పైన ఉన్నంత వరకు బుల్స్‌ హవానే ఉండొచ్చు. ఒకవేళ కొంత వెనకడుగు వేసినా, ఈ స్థాయి పైన ఉన్నంత వరకు తిరిగి బుల్స్‌ పగ్గాలు అందుకోగలరని నిపుణుల అంచనా. తాజా ర్యాలీ

Most from this category