News


సెన్సెక్స్‌ చార్టులో ‘‘గోల్డెన్‌ క్రాస్‌’’

Tuesday 5th November 2019
Markets_main1572948652.png-29370

బుల్లిష్‌నెస్‌కు సంకేతం
డైలీ చార్టుల్లో అక్టోబర్‌ 30న సెన్సెక్స్‌ గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పరిచింది. చార్టుల్లో ఇలాంటి క్రాసోవర్‌ ఏర్పడడం బుల్‌ర్యాలీ కొనసాగింపునకు సంకేతంగా నిపుణులు చెబుతుంటారు. స్వల్పకాలిక ట్రెండ్‌ ఇండికేటర్‌ దీర్ఘకాలిక ట్రెండ్‌ ఇండికేటర్‌ను క్రాసోవర్‌ చేయడాన్ని గోల్డెన్‌క్రాస్‌గా చెబుతారు. ముఖ్యంగా 40 రోజుల డీఎంఏ ఇండికేటర్‌ 200 రోజుల డీఎంఏ ఇండికేటర్‌ను పైవైపుగా ఖండిస్తూపోతే గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడినట్లు పరిగణిస్తారు. ఇది ఒక బలమైన బుల్లిష్‌ ఇండికేటర్‌గా నిపుణులు భావిస్తుంటారు.

అక్టోబర్‌ 30న సెన్సెక్స్‌ 50 రోజుల డీఎంఏ 39878 పాయింట్ల వద్ద ఉండగా, 200 రోజుల డీఎంఏ 38859 పాయింట్ల వద్ద ఉంది. ఈ రోజున 50 రోజుల డీఎంఏ రేఖ, 200 రోజుల డీఎంఏ రేఖను కింద నుంచి పైకి క్రాస్‌ చేసింది. అనంతరం సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైని తాకింది. తాజా క్రాసోవర్‌తో సూచీల్లో మరో 5- 16 శాతం ర్యాలీని మరో ఏడాదిలో ఆశించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పలు బ్రోకరేజ్‌లు వచ్చే జూన్‌ నాటికి సెన్సెక్స్‌ 46- 47వేల పాయింట్లను చేరవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు నిఫ్టీలో కూడా ఇలాంటి గోల్డెన్‌క్రాస్‌ ఏర్పడింది. రాబోయే వేసవికి నిఫ్టీ 12800 పాయింట్లను చేరవచ్చని నిపుణుల అంచనా. మరోవైపు సూచీల్లోని పలు స్టాకుల చార్టుల్లో కూడా ఇలాంటి గోల్డెన్‌క్రాస్‌ ఏర్పడింది. 
ఇలా చార్టుల్లో బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడ్డ షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి...


బీఎస్‌ఈ 500లో దాదాపు 100 స్టాకుల చార్టుల్లో ఈ క్రాస్‌ ఏర్పడింది. వీటిలో నాణ్యమైన స్టాకులను ఎంచుకోవచ్చని నిపుణుల సలహా.

గమనిక: కేవలం గోల్డెన్‌ క్రాస్‌ ఇండికేటర్‌ ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా, లోతైన సాంకేతిక విశ్లేషణ చేసి పెట్టుబడులు పెట్టాల్సిఉంటుంది. 



You may be interested

ఏడురోజుల లాభాలకు బ్రేక్‌

Tuesday 5th November 2019

54 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 11900 పైన ముగిసిన నిఫ్టీ ఫార్మా, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు  మార్కెట్‌ ఏడురోజుల లాభాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్వల్పంగా నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 54 పాయింట్లను కోల్పోయి 40,248.23 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 11,917 వద్ద స్థిరపడింది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

పీఎన్‌బీ లాభం రూ. 507 కోట్లు..షేరు 5 శాతం డౌన్‌

Tuesday 5th November 2019

ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు నిరాశపరిచాయి. ఈ క్యూ2లో బ్యాంక్‌ రూ.507.05 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం 11శాతం వృద్ధితో రూ.15,556.61 కోట్లను నమోదు చేసింది. గతేడాది క్యూ2లో మొత్తం ఆదాయం రూ.14,035.88 కోట్లుగా ఉంది. ఇదే త్రైమాసికంలో రూ.4,262 నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.3,974 కోట్ల పోలిస్తే ఇది 7.2శాతం

Most from this category