News


మార్కెట్‌ను మెప్పించని ఆర్‌బీఐ రేట్ల కోత

Wednesday 7th August 2019
Markets_main1565168559.png-27610

రిజర్వ్‌ బ్యాంకు పాలసీ విధాన ప్రకటన అనంతరం మార్కెట్‌ లాభాల్లోంచి నష్టాల్లోకి మళ్లింది. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., నేడు దేశీయ మార్కెట్‌ లాభాలతో మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో వడ్డీరేట్ల కోత అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఉదయం సెషన్స్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో సెన్సెక్స్‌ 127 పాయింట్లు పెరిగి 37,104.79 వద్ద, నిఫ్టీ 27  పాయింట్లు లాభపడి 10,975.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే, ఆర్‌బీఐ  వరుసగా నాలుగోసారి రెపో రేటులో కోత పెట్టింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 71 సమీపానికి బలహీనపడింది. వడ్డీరేట్ల కోత విధించినప్పటికీ..., ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు మొగ్గుచూపడంతో సూచీలు ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోవడమే కాకుండా నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ గరిష్ట స్థాయి(37,104.79) నుంచి 327 పాయింట్లను కోల్పోయి 36,775.72 వద్ద, నిఫ్టీ గరిష్టస్థాయి(10,975.65) నుంచి 95 పాయింట్లను కోల్పోయి 10,880.75 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిలను నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.2:15నిల.కు సెన్సెక్స్‌ 90 పాయింట్ల నష్టంతో 36,887.05 వద్ద, నిఫ్టీ 40.50 పాయింట్లు పెరిగి 10,907.75 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, రియల్టీ, మెటల్‌, అటో, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరగుతున్నాయి. 



You may be interested

ఫలితాల ఎఫెక్ట్‌.. 52 వారాల కనిష్టానికి ఎం అండ్‌ ఎం

Wednesday 7th August 2019

మహీంద్రా అండ్ మహీంద్రా జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో, ఏడాది ప్రాతిపదికన 80 శాతం నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,257 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన ఈ కంపెనీ, ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 లో రూ. 2,260 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అసాధారణ లాభం(ఆస్తులు విక్రయం మొ.) రూ. 1,367 కోట్లు ద్వారా, ఈ కంపెనీ నికర లాభం గణనీయంగా

టాటా స్టీల్‌ 3.66 శాతం డౌన్‌

Wednesday 7th August 2019

అంతర్జాతీయంగా స్టీల్‌ కంపెనీ షేర్లు పతనం కావడంతో పాటు ఈ రోజు టాటా స్టీల్‌ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 ఫలితాలు వెలువడనుండడంతో టాటా స్టీల్‌ లిమిటెడ్‌ షేరు విలువ బుధవారం మధ్యాహ్న 1.01 సమయానికి 3.66 శాతం పడిపోయి రూ. 386.90 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 401.60 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం ట్రేడింగ్‌లో రూ. 395.00  వద్ద ప్రారంభమైంది. ఈ కంపెనీ

Most from this category