News


ఏడురోజూ నష్టాలే..!

Thursday 9th May 2019
Markets_main1557397711.png-25640

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనంతో మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. ఎనర్జీ, ఇంధన, ఫార్మా, పవర్‌ రంగ షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 230 పాయింట్లు నష్టపోయి 37,559 వద్ద, నిఫ్టీ 57.65 పాయింట్లు నష్టపోయి 11,301.80 వద్ద ముగిసింది. సూచీలు ఇది వరుసగా ఏడోరోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య వివాదం మరింత ముదరడంతో అటు ఆసియాతో పాటు, అమెరికా డౌ ఫ్యూచర్లు నష్టాల బాట పట్టడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పాటు యూఎస్‌, చైనాల మధ్య వాణిజ్య వివాదాలు తలెత్తడంతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా నాలుగో రోజూ నష్టపోయింది. రూపాయి మారకపు విలువ ఇంట్రాడేలో 70 స్థాయికి తాకడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్‌ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత నివ్వడంతో సెన్సెక్స్‌ 344 పాయింట్లను కోల్పోయి 37,405.40 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లను కోల్పోయి 11,255.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి.  హెవీవెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,  హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ బ్యాంక్‌ షేర్ల పతనంతో సూచీలు అధిక నష్టాలను కోల్పోయాయి. 
కోటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పేయింట్స్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 2.50శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, హీరోమోటర్స్‌కార్పో, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్ సర్వీసెస్‌, యస్‌ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 1.50శాతం నుంచి 8.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఎంఎస్‌సీఐ ఇండియా సూచీలోకి కొత్త చేరికలు

Thursday 9th May 2019

ఎంఎస్‌సీఐ ఇండియా ఆరు నెలలకోసారి సూచీల్లో మార్పులను ఈ నెల 13న సమీక్షించాల్సి ఉంది. ఐసీఐసీఐ డైరెక్ట్‌ నివేదిక ప్రకారం... బ్యాంకింగ్‌, బీమా కంపెనీలకు కొత్తగా చోటు లభించనుంది. ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను ఈ సూచీలో చేర్చే అవకాశాలున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా. అధికారికంగా ఈ మార్పులపై ఈ నెల 13న ప్రకటన వెలువడనుంది. ఈ నెల

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Thursday 9th May 2019

ప్రపంచమార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ గురువారం మెటల్‌ భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు దాదాపు 2శాతం క్షీణించింది. అమెరికా - చైనాల వాణిజ్య యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చిన నేపధ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆ ప్రతికూల ప్రభావంతో నేటి ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ మెటల్‌ ఇంండెక్స్‌లోని జిందాల్‌

Most from this category