News


ఇంట్రాడే గరిష్టం నుంచి సెన్సెక్స్‌ 519 పాయింట్లు క్రాష్‌

Friday 14th February 2020
news_main1581661052.png-31790

  • ఏజీఆర్‌ చెల్లింపుల అంశంపై మరోసారి సుప్రీం తలుపు తట్టడం కోర్టు తీవ్ర అగ్రహం
  • మార్కెట్‌లో అనూహ్య అమ్మకాలు 
  • బ్యాంక్‌ షేర్ల భారీ పతనం 

ఏజీఆర్‌ చెల్లింపుల విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన టెలికాం కంపెనీలకు చుక్కెదురు కావడంతో మార్కెట్లో అనూహ్య అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(41702) నుంచి 519 పాయింట్లను, నిఫ్టీ  ఇంట్రాడే హై(12,246.70) నుంచి 148 పాయింట్లను కోల్పోయాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లను సానుకూల సంకేతాలను అందిపుచ్చుకొన్న సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఉదయం గం.11:20ని.లకు సెన్సెక్స్‌ మునుపటి ముగింపు 41459తో పోలిస్తే 200 పాయింట్లు నష్టపోయి 41265 వద్ద, నిఫ్టీ నిన్నటి ముగింపు 31,230 వద్దతో పోలిస్తే 50 పాయింట్లను కోల్పోయి 12124 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ముఖ్యంగా టెలికాం కంపెనీలకు ఎక్స్‌పోజర్‌ ఉన్న బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి.  ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయి 31వేల దిగువున 30892 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఏజీఆర్‌ చెల్లింపుల అంశంలో టెలికాం కంపెనీలకు కోర్టు అక్షింతలు 
గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఏజీఆర్‌ చెల్లింపులు చేయకుండా మరోసారి కోర్టు తలుపు తట్టడం ధిక్కార చర్యగా పరిగణిస్తామని సుప్రీం కోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. భారతీ ఎయిర్‌ టెల్, వోడాఫోన్‌ ఐడియా కంపెనీల ఎండీలతో పాటు డైరెక్టర్లు మార్చి 16న కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం శాఖకు సైతం చివాట్లు పెట్టింది. టెలికాం చెల్లింపులను ఆలస్యం చేస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని డాట్‌ను ప్రశ్నించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వోడాఫోన్‌ ఐడియా షేరు 7.50శాతం నష్టాన్ని చవిచూసింది. మరోవైపు ఏజీఆర్‌ చెల్లింపులకు ఇప్పటికే ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి చేసుకున్న భారతీ ఎయిర్‌ టెల్‌షేరు 4శాతం లాభపడింది. You may be interested

సుప్రీం కొరడా...అయినా ఎయిర్‌టెల్‌ కొత్త హై! ఎందుకు?

Friday 14th February 2020

ఏజీఆర్‌ కేసు నేపథ్యంలో షేరు హైజంప్‌   కుప్పకూలిన వొడాఫోన్‌ ఐడియా షేరు ఎయిర్‌టెల్‌ షేరు 3 నెలల్లో 45 శాతం ర్యాలీ  ఇటీవల జోరు చూపుతున్న మొబైల్‌ రంగ దేశీ దిగ్గజం భారత్‌ ఎయిర్‌టెల్‌ షేరు మరోసారి దూకుడు చూపుతోంది. ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో ఉదయం 11.30 ప్రాంతంలో 5 శాతం జంప్‌చేయడం ద్వారా రూ. 564ను అధిగమించింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా..  ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4 శాతం

52 వారాల కనిష్టానికి చేరిన 77 షేర్లు

Friday 14th February 2020

శుక్రవారం  52 వారాల కనిష్టానికి 77 షేర్లు చేరాయి. వీటిలో 3పి ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఆగ్రోఫోస్‌ ఇండియా, ఆంధ్రా పేపర్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కోటెక్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌, బాలకృష్ణ పేపర్‌ మిల్స్‌, బాట్రానిక్స్‌ ఇండియా, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, బిర్లా టైర్స్‌, కంట్రీ క్లబ్‌ హస్పిటాలిటీ అండ్‌ హాలిడ్సే, సెలస్ట్రియల్‌ బయోల్యాబ్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌, కాంపుకమ్‌ సాఫ్ట్‌వేర్‌,

Most from this category