News


స్వల్పనష్టంతో ముగింపు

Thursday 24th October 2019
Markets_main1571913110.png-29118

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిపలాడిన సూచీలు చివరికి నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టంతో 39,020 వద్ద స్థిరపడింది, నిఫ్టీ 22 పాయింట్ల క్షీణతతో 11600 దిగువున 11,582.40 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., నేడు రెండో రోజూ దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 269 పాయింట్ల లాభపడి  39,327.15,  నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 11,679.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. నేడు మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే మహారాష్ట్రలో భాజపా గెలుపు ఖాయమైంది. అయితే హరియాణాలో మాత్రం హంగ్‌ ఏర్పడింది.  దీంతో మిడ్‌సెషన్‌ నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఉదయం సెషన్‌లో సూచీలు ఆర్జించిన లాభాలన్ని హరించుకుపోవడంతో పాటు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఒక్క రియల్టీ షేర్లు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 357 పాయింట్లు(1.27శాతం) నష్టంతో 29,101.75 వద్ద స్థిరపడింది. 
గెయిల్‌, ఎస్‌బీఐ, యస్‌బ్యాంక్‌, గ్రాసీం, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 4శాతం నుంచి 8శాతం నష్టపోయాయి. టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐషర్‌మోటర్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు 2శాతం నుంచి 3.30శాతం వరకు లాభపడ్డాయి. 



You may be interested

2019-20లో వృద్ధి 5.5 శాతమే: ఫిచ్‌ అంచనా

Friday 25th October 2019

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌  తగ్గించింది. 2019-20లో కేవలం 5.5 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదవుతుందని విశ్లేషించింది. ఈ ఏడాది జూన్‌లో ఫిచ్‌ తొలి అంచనా ప్రకారం ఈ రేటు 6.6 శాతం. బ్యాంకింగ్‌ రుణ వృద్ధి పడిపోవడాన్ని ఫిచ్‌ ఈ సందర్భంగా ఉటంకించింది. అయితే వృద్ధి రేటు 2020-21లో 6.2 శాతానికి

డిసెంబర్‌కల్లా కొత్త గరిష్ఠాలకు సూచీలు

Thursday 24th October 2019

  భారీగా పడిపోయిన దేశీయ మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయని, కానీ దిగువ స్థాయిల వద్ద మందగమనం కొనసాగుతుండడంతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాకులు, లార్జ్‌ క్యాప్‌లను మించి ప్రదర్శన చేస్తాయని ఆశించడం మరీ దూకుడైన ఆలోచనవుతుందని సామ్కో సెక్యురిటీస్‌​ వ్యవస్థాపకుడు, సీఈఓ జిమిత్‌ మోదీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. వ్యవస్థలో వినియోగం పుంజుకుంటుందని, కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన కంపెనీల మూల ధన వ్యయం పెరుగుతుందని

Most from this category