STOCKS

News


మూడో రోజూ నష్టాలే ..11, 400 దిగువకు నిఫ్టీ!

Tuesday 1st October 2019
Markets_main1569926996.png-28661

  • బ్యాంకింగ్‌ షేర్ల భారీ పతనం
  • 362 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌
  • 11400 దిగువన ముగిసిన నిఫ్టీ 

మార్కెట్‌ మూడో రోజూ నష్టంతో ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సెన్సెక్స్‌ 362 పాయింట్లు పతనమై 38,305 వద్ద, నిఫ్టీ 114.55 పాయింట్లు నష్టపోయి 11,360 వద్ద ముగిశాయి. బలహీన ఆర్థిక గణాంకాలతో పాటు, నేడు పలు కంపెనీలు వెల్లడించిన అటోరంగ షేర్ల విక్రయాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడం, పీఎంసీ బ్యాంక్‌ సంక్షోభ భయాలు, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీపై ఆరోపణలు మార్కెట్‌ను వెంటాడటంతో పాటు నేటి ట్రేడింగ్‌ సమయంలో విడుదలైన  సెప్టెంబర్‌ తయారీ రంగ యాక్టివిటీ గణాంకాలు అంతంత మాత్రంగానే నమోదుకావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 22 పైసలు బలహీనపడటం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం లాంటి అంశాలు కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సూచీలు లాభాలతో ప్రారంభమైనప్పటికీ.., గంటలోపు తిరిగి నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అ‍మ్మకాలు విపరీతంగా జరిగాయి. భారత బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నట్లు జెఫ్పారీస్‌ బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేయడంతో బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.30శాతం(377.65 పాయింట్లు) నష్టపోయి 28,725.50 వద్ద స్థిరపడింది. ఒక దశలో సెన్సెక్స్‌ 737 పాయింట్లు నష్టపోయి 11,247.90 వద్ద, నిఫ్టీ 226 పాయింట్లు క్షీణించి 11,248 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసాయి. ఈ దశలో మార్కెట్లో షార్ట్‌ కవరింగ్‌ జరగడంతో సూచీలు తమ భారీ నష్టాల్ని కొం‍తమేర పూడ్చుకోగలిగాయి.


గ్రాసీం, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 5శాతం నుంచి 22శాతం వరకు నష్టపోయాయి. మారుతి, ఐఓసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్‌ షేర్లు 1శాతం నుంచి 5శాతం వరకు లాభపడ్డాయి. You may be interested

వీ షేప్‌ రికవరీకి అవకాశం లేదు..:!

Tuesday 1st October 2019

నిఫ్టీ-50కి సమీప కాలంలో 11,100 - 11,300 బలమైన మద్దతు స్థాయిలుగా నిలుస్తాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. మార్కెట్లో వీ షేప్‌ రికవరీకి (పడిన విధంగా తిరిగి రికవరీ అవడం) అవకాశం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థలో దారుణ పరిస్థితులు రెండో త్రైమాసికం లేదా మూడో త్రైమాసికం (డిసెంబర్‌ నాటికి) నాటికి ముగిసిపోవచ్చన్నారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    కార్పొరేట్‌

భారీ పతనానికి కారణాలు..!

Tuesday 1st October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో వరుసగా మంగళవారం ట్రేడింగ్‌లో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. బ్యాంకింగ్‌ షేర్లు భారీగా పడిపోవడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 114.55 పాయింట్లు కోల్పోయి 11,359.90 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 361.92 పాయింట్లు కోల్పోయి 38,305.41 పాయింట్లు వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 377.75 పాయింట్లు పతనమయ్యి 28,725.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. భారీగా మార్కెట్లు పడిపోడానికి ప్రధాన కారణాలు.. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల

Most from this category