News


సెన్సెక్స్‌ 350 పాయింట్లు క్రాష్‌..!

Wednesday 26th February 2020
Markets_main1582689919.png-32098

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ అంటువ్యాధి భయాలు మరింత ఉధృతమవడంతో బుధవారం దేశీయ మార్కెట్‌ సైతం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. సెన్సెక్స్‌ 350 పాయింట్ల నష్టంతో 40,000 దిగువన 39931.20 నిఫ్టీ 100 పాయింట్ల 11,700 వద్ద మొదలయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా తమ దేశ ప్రజలను హెచ్చరించడంతో మంగళవారం రాత్రి ఈ దేశ ఈక్విటీ మార్కెట్లు 3శాతం నష్టాన్ని చవిచూశాయి. అమెరికాలో మొదలైన అమ్మకాలు ఆసియా మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. ఆసియాలో ప్రధాన మార్కెట్లన్నీ దాదాపు 1శాతం నష్టాన్ని చవిచూశాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు వరుసగా మూడో రోజూ పతనం కావడంతో పాటు బ్యారెల్‌ చమురు ధర 55డాలర్ల దిగిరావడంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి నిన్నటి ముగింపు స్థాయి(71.88)తో పోలిస్తే 13పైసలు బలపడి 71.75 వద్ద ప్రారంభం కావడం మార్కెట్‌కు కొద్దిగా ఊరటనిచ్చే అంశాలుగా ఉన్నాయి.

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 220 పాయింట్ల నష్టంతో 40,060.48 వద్ద, నిఫ్టీ 66.45 పాయింట్లను కోల్పోయి 11,731.45 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి ఒక్క ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మెటల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో  బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతానికి పైగా నష్టపోయి 30,227.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

 

నిఫ్టీ -50 ఇండెక్స్‌లో... జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటా స్టీల్‌, యూపీఎల్‌, సిప్లా, విప్రో షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి. బ్రిటానియా, కోల్‌ ఇండియా, ఏషియన్‌పేయింట్స్‌, హిందూస్థాన్‌యూనిలివర్‌, నెస్లే ఇండియా, షేర్లు అరశాతం లాభపడ్డాయి. 



You may be interested

కార్డ్స్‌ ఐపీఓకు ముందు ఎస్‌బీఐ షేరును ఏం చేద్దాం??

Wednesday 26th February 2020

త్వరలో ఐపీఓకి వస్తున్న ఎస్‌బీఐ కార్డ్స్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. చాలాబ్రోకరేజ్‌లు వచ్చేనెల ఆరంభంలో వచ్చే ఈ ఆఫర్‌కు సబ్‌స్క్రైబ్‌ చేయమని సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఓకు ముందు మాతృసంస్థ ఎస్‌బీఐ షేరులో బుల్‌ కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటరని నిపుణులు సూచిస్తున్నారు. రిస్కు తీసుకునే వీలున్న ఇన్వెస్టర్లు ఈ వ్యూహం పాటించవచ్చంటున్నారు. ఈ వ్యూహంలో నష్టం పరిమితంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో ఎస్‌బీఐ 330 స్ట్రైక్‌ప్రైస్‌ కాల్‌

శ్రీసిటీని సందర్శించిన ఈఎంసీ బృందం

Wednesday 26th February 2020

వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌ఎస్‌సీ) సీఈఓ మహాపాత్ర శ్రీసిటీని సందర్శించారు. ఆయనకు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.  శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలను ఆయనకు వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో భాగంగా ఇక్కడ ఏర్పాటైన ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌ పరిశ్రమల గురించి  మహాపాత్ర తెలుసుకున్నారు.  సువిశాల పారిశ్రామికవాడలో ప్రపంచశ్రేణి మౌలిక వసతుతో  పాటు వేలాది ఉద్యోగాలు రావడానికి కృషి

Most from this category