News


సెన్సెక్స్‌ సెంచరీ లాభంతో షురూ

Friday 12th July 2019
Markets_main1562904481.png-26996

  • 11600పై ప్రారంభమైన నిఫ్టీ ఇండెక్స్‌ 

ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 118 పాయింట్ల లాభంతో 38,941.10 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లను ఆర్జించి 11600 పైన 11,601.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు మరోసారి కొత్త రికార్డు స్థాయిలను అందుకున్నాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు ఇవ్వడంతో బుధవారం జీవికాల గరిష్టాలను అందుకున్న అమెరికా మార్కెట్లు నిన్నటి ట్రేడింగ్‌లో మరోసారి రికార్డు గరిష్టాన్ని తాకాయి. ప్రిస్క్రిప్షన్‌ ఔషధ ధరల నియంత్రణకు ఉద్ధేశించిన ప్రణాళికను అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ రద్దు చేశారు. దీంతో ఇన్సూరెన్స్‌, ఔషధ రంగ షేర్లు భారీగా లాభపడి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. నేడు ఆసియా మార్కెట్లు తైవాన్‌, జకర్తా తప్ప మిగిలిన అన్ని మార్కెట్లు లాభాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక దేశీయ పరిణామాలు ఈక్విటీ మార్కెట్‌కు కొంత​ ప్రతికూలంగా ఉన్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి నష్టంతో ప్రారంభమైంది. నేడు ఐటీ రం దిగ్గజం ఇన్ఫోసిస్‌ క్యూ1 ఫలితాలను ప్రకటించనుంది. అలాగే నేడు మార్కెట్‌ వారంతపు రోజు. ఈ నేపథ్యంలో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొంతమేర అప్రమత్తత వహించే అవకాశం ఉంది.
ఉదయం గం.9:30ని.లకు నిఫ్టీ 10 పాయింట్లు లాభంతో 11,592.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌ 20 పాయింట్లు పెరిగి 38,843.26 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి బలహీనతతో ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఇక మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి. 
ఇండస్‌ ఇండ్‌, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌, సన్‌ఫర్మా షేర్లు 1శాతం నుంచి 1.50శాతం లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీ్‌ల్‌, హీరోమోటోకార్ప్‌, టాటామోటర్స్‌, విప్రో షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టపోయాయి. You may be interested

మెక్సికో తుఫాను..పెరిగిన చమురు ధరలు

Friday 12th July 2019

గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో తుఫాను కారణంగా అమెరికా ఆయిల్‌ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిని సగానికి పైగా నిలిపివేశారు. ఫలితంగా శుక్రవారం(జులై 12) ట్రేడింగ్‌లో ఆయిల్‌ ధరలు పెరిగాయి.  బ్రెంట్‌ క్రూడ్‌ 0.6 శాతం లాభపడి బ్యారెల్‌కు 66.89 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.6 శాతం పెరిగి బ్యారెల్‌కు 60.54 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో మే 23 తర్వాత గరిష్ఠ స్థాయి బ్యారెల్‌ 67.52 డాలర్లకు బ్రెంట్‌

ఆస్తులు అమ్ము... అప్పులు తీర్చు..!

Friday 12th July 2019

పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ చేస్తున్నది ఇదే ప్రస్తుతం. రుణాలు తీసుకుని వ్యాపారాలు మొదలు పెట్టారు. ఆ రుణాలను తీర్చలేక అవే వ్యాపారాలను ఒక దాని తర్వాత ఒకటి వరుసపెట్టి అమ్ముతున్నారు. పరిస్థితులు తల్లక్రిందులు అయితే ఇంతే ఉంటుంది. రోడ్డు ప్రాజెక్టుల నుంచి ఎఫ్‌ఎం రేడియో​ వ్యాపారం వరకు పలు ఆ‍స్తులు అమ్మి రూ.21,700 కోట్లు (3.2 బిలియన్‌ డాలర్లు) సమీకరించి, అప్పులు తీర్చాలన్నది అనిల్‌ అంబానీ ప్రయత్నం.    అనిల్‌ అంబానీకి

Most from this category