News


36 వేల దిగువకు సెన్సెక్స్‌

Wednesday 2nd January 2019
Markets_main1546424798.png-23372

  • 10800దిగువకు నిఫ్టీ
  • సూచీలను దెబ్బతీసిన మెటల్, అటో షేర్ల పతనం

అటో, మెటల్‌ రంగ షేర్ల పతనంతో బుధవారం మార్కెట్‌ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్‌ 36వేల మార్కును, నిఫ్టీ 10800 స్థాయిని కోల్పోయింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న మన మార్కెట్‌ నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి క్రమంగా నష్టాలను నమోదు చేసింది.డిసెంబర్‌లో వాహన విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం అటో రంగ షేర్లు, చైనా ఉత్పాదక రంగం క్షీణించడంతో దేశీయ మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా మిడ్‌ సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 400 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ సైతం 150 పాయింట్లను నష్టపోయింది. మిడ్‌సెషన్‌ అనంతరం​యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభంతో సూచీలు మరింత ఒత్తిడిని పెంచాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 520 పాయింట్ల క్షీణించి 35,734.01 వద్ద, నిఫ్టీ 175 పాయింట్ల నష్టపోయి 10,735.05 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే అరగంటలో రికవరీ కొనుగోళ్లతో సూచీలు నష్టాలను తగ్గించుకోగలిగాయి. చివరకు సెన్సెక్స్‌ 363 పాయింట్ల నష్టంతో 35,891 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లను నష్టంతో 10,792.50 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 217 పాయింట్ల నష్టంతో 27,174.70 వద్ద ముగిసింది. అత్యధికం‍గా మెటల్‌ ఇండెక్స్‌ 3.50శాతం నష్టపోయింది. అయితే డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీకి బ్రేకులు పడటంతో ఐటీ ఇండెక్స్‌ (0.03శాతం) స్వల్పంగా నష్టపోయింది. మార్కెట్‌ పతనానికి కారణాలివే...
బేరిష్‌గా ప్రపంచ మార్కెట్లు:-
అంతర్జాతీయ ఆర్థిక మందగమనంతో డిసెంబర్‌లో చైనా ఉత్పాదక రంగం నెమ్మదించినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. రెండేళ్ల తరువాత చైనా ఉత్పాదక రంగం మందగించడంతో ప్రపంచమార్కెట్లలో బేరిష్‌ వాతావరణం నెలకొంది. అందుకు అనుగుణంగా మన మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయంలో ఆసియా మార్కెట్లతో, యూరప్‌, అమెరికా మార్కెట్లకు చెందిన ఫ్యూచర్ల నెగిటివ్‌ ట్రేడింగ్‌ సైతం సూచీలపై ప్రభావాన్ని చూపాయి.
బలహీన ఆర్థిక గణాంకాలు:-
కంపెనీలకు ఆర్డర్లు తగ్గడంతో డిసెంబర్‌ నెలకు నిక్కీ ఇండియా సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 53.2 దిగివచ్చింది. కాగా నవంబర్‌లో పీఎంఐ ఇండెక్స్‌ 11నెలల గరిష్ట స్థాయి 54.0కి చేరింది. పారిశ్రామికోత్పత్తిలో భాగమైన 8 ప్రధాన రంగాల వృద్ధి నవంబర్‌లో 16నెలల కనిష్టస్థాయి 3.5శాతానికి పరిమితం కావడం మార్కెట్‌ ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు:-
డిసెంబరు నెల వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు త‌గ్గాయి. నవంబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.97,637కోట్లు రాగా.. డిసెంబరు నెలలో కేవలం రూ.94,726కోట్లు మాత్రమే వచ్చాయి.  
రూపాయి క్షీణత:-
డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీకి నేడు బ్రేక్‌ పడింది. వరుసగా నాలుగో రోజుల లాభపడిన రూపాయి నేటి ట్రేడింగ్‌లో 66 పైసలు బలపడి 70 స్థాయిని తిరిగి అందుకుంది.
ఎంఅండ్‌ఎం, వేదాంత, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐషర్‌ మోటర్స్‌ షేర్లు 4.50శాతం నుంచి 9.50శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌పేయింట్స్‌, టీసీఎస్‌, ఇన్ఫ్రాటెల్‌, సన్‌ఫార్మా షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి.You may be interested

పతనం బాటలో ప్రపంచ మార్కెట్లు

Wednesday 2nd January 2019

చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీలో మందగమనం నష్టాల్లో యూఎస్‌ ఫ్యూచర్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో అటు ఆసియా, ఇటు యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ మందగించడం, యూరోజోన్‌ పీఎంఐ సూచీ రెండేళ్ల కనిష్ఠానికి చేరడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై మరోమారు భయాలు మొదలయ్యాయి. దీంతో బుధవారం ఎంఎస్‌సీఐ వరల్డ్‌ ఇండెక్స్‌ 0.4 శాతం క్షీణించింది. చైనా మార్కెట్‌ 1.3 శాతం, హ్యాంగ్‌సంగ్‌ 2.77 శాతం, నికాయ్‌ 0.4 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌

ముంచుకొస్తున్న ఐదు సంక్షోభాలు

Wednesday 2nd January 2019

ఈ ఏడాది ఎకానమీల్లో తీవ్ర ఇబ్బందులకు అవకాశం చేతిలో వీలయినంత నగదు ఉంచుకోవడం ఉత్తమం నిపుణుల సలహా అంతర్జాతీయంగా ఉద్దీపనల ఉపసంహరణ వేగవంతమవుతున్న వేళ మార్కెట్లలో భయాలు పెరిగిపోతున్నాయి. ఉద్దీపనల ఉపసంహరణ పరిణామాలు మరిన్ని ప్రతికూలాంశాలకు దారి తీస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు డౌన్‌సైడ్‌ షాకులు తట్టుకునేందుకు తయారుగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒకదాని కారణంగా ఒకటిలాగా ఐదు అంశాలు మార్కెట్లలో ప్రత్యక్షమవుతుంటాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అంతఃసంబంధం కలిగి మొత్తం

Most from this category